Link copied!
Sign in / Sign up
4
Shares

పిల్లలు నోట్లో ఇలా వస్తువులు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా..! ఈ అలవాటును ఎలా మాన్పించాలంటే...

మీ బాబు లేదా పాప ఇప్పుడు దోగాడుతున్నారా? అయితే మీరు ఇప్పుడు ఎదురుకోవాల్సిన సమస్య ఇంకోటి వుంది. పిల్లల దోగాడే వయసులో కనిపించిన ప్రతి వస్తువును నోట్లో పెట్టుకోడానికి ప్రయత్నిస్తారు. ఇది కొన్ని సార్లు ప్రమాదాలకు దారి తీయచ్చు. అసలు పిల్లలు నోట్లో వస్తువులను ఎందుకు పెట్టుకుంటారు. ఆ అలవాటును ఎలా మాన్పించాలి ఇక్కడ తెలుసుకుందాం…

వస్తువులను నోట్లో ఎందుకు పెట్టుకుంటారు?

పిల్లలు ఎదుగుతున్న కొద్ది తమ చుట్టూ ఉన్న పరిసరాలను, వస్తువులను గమనిస్తూ వాటి గురించి తెలుసుకోవాలనుకుంటారు. ఆ ప్రయత్నంలో భాగంగా తమకు అందిన వస్తువులను తాకడం నోట్లో పెట్టుకోవడం చేస్తూవుంటారు. పిల్లలు తమ వేళ్ళను, చేతులను కూడా నోట్లో పెట్టుకుంటారు. చేతులతో వస్తువులను పట్టుకోవడం నేర్చుకున్న తరువాత నోట్లో పెట్టుకోవడం మొదలు పెడుతారు.

ఏ వయసు వరకు నోట్లో పెట్టుకుంటారు?

పిల్లలకు వస్తువులను నోట్లో పెట్టుకోవడం 7 నెలల వయసులో మొదలు పెడుతారు. 2 సంవత్సరాల వరకు పిల్లలు వస్తువులను నోట్లో పెట్టుకుంటుంటారు. అంతకు మించి ఎక్కువ సంవత్సరాలు ఈ అలవాటు కొనసాగడం మంచిది కాదు.

అయితే పిల్లలు వస్తువులను నోట్లో పెట్టుకునేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని వున్నాయి…

1. తిట్టదు

పిల్లలు వస్తువుల గురించి తెలుసుకోడానికి నేర్చుకోవడానికి వాటిని నోట్లో పెట్టుకుంటుంటారు. మీరు అది మాన్పించడానికి వారిని తిట్టడం మంచిది కాదు. అలా చేయడం వలన పిల్లలలు కొత్త విషయాలను నేర్చుకోవడం మానేస్తారు.

2. దగ్గరలో ఉంచకండి

పిల్లలు వస్తువులను నోట్లో పెట్టుకునే వయసులో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు ప్రమాదమైన వస్తువులకు, సాధారణమైన వస్తువులకు తేడాను కనుక్కోలేరు. అందుకే పిల్లలు ఉన్న ప్రమాదకరమైన వస్తువులను వేటిని వారికి అందేంత దూరంలో ఉంచకండి.

3. పాల పీక

పిల్లలకు పళ్ళు వచ్చే సమయంలో నోటిలో జిలగా ఉంటుంది.  అది తగ్గించుకోడానికి దొరికిన వస్తువులన్నిటిని కొరకడానికి ప్రయత్నిస్తుంటారు, అందుకే వారికి పాల పీకను అలవాటు చేయండి. వస్తువులను నోట్లో పెట్టుకోవడం మెల్లగా మానేస్తారు. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon