Link copied!
Sign in / Sign up
2
Shares

పిల్లలు త్వరగా పుట్టాలంటే ఏ ఆహారం తీసుకోవాలి..?

పెళ్లి అయ్యి చాలా కాలమే అవుతున్నా పిల్లలు పుట్టడం లేదని, గర్భం దాల్చినా మధ్యలోనే మిస్ క్యారేజ్ అవుతోందని చాలామంది మహిళలు, దంపతులు బాధపడుతూ ఉన్నారు. గర్భం రావాలంటే ఇద్దరి మధ్య సరైన కలయిక మాత్రమే కాదు, కొన్ని ఆహారాలు కూడా ప్రభావాన్ని చూపిస్తాయని అంటున్నారు  ఆరోగ్య నిపుణులు. ఇక్కడ చెప్పుకునే ఆ ఆహారాలు తీసుకోవడం వలన గర్భం దాల్చడానికి, పిల్లలు ఆరోగ్యంగా పుట్టడానికి సహకరిస్తాయని చెబుతున్నారు.

ఫ్రూట్స్ మరియు కూరగాయలు

గర్భం దాల్చడానికి, ఆరోగ్యకరమైన పిల్లలు పుట్టడానికి తరచూ ఫ్రూట్స్, పచ్చని కూరగాయలు తీసుకోవాలని అందరూ చెబుతూ ఉంటారు. ఐతే ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి అనేది చాలామందికి సరైన క్లారిటీ లేదు. దానిమ్మ, కొబ్బరి, బచ్చలికూర, బాదంపప్పు, అవకాడో, ఆరంజ్, స్ట్రాబెర్రీ, కాలీఫ్లవర్ త్వరగా గర్భాన్ని కలిగిస్తాయి. అలాగే దానిమ్మ పండు తినడం గర్భాశయానికి రక్తసరఫరాను పెరిగేలా చేస్తుంది. ఈ పండ్లు మగవారు కూడా బాగా తినడం వలన వీర్యవృద్ధికి సహాయపడుతుంది.

లైంగిక సామర్థ్యాన్ని పెంచే ఆహారాలు

కొందరిలో వయస్సు పెరిగే కొద్దీ లేదా ఒకరినొకరు ఏకాంతంగా కలిసే సమయంలో చాలా భయపడుతూ ఉంటారు. దీని కారణంగా లైంగిక కోరికలపై ప్రభావం కలిగి శృంగార సామర్థ్యం తగ్గిపోతుంది. అందుకని కొబ్బరి పదార్థాలు, ఆలివ్, ఆలివ్ ఆయిల్ తో తయారుచేసుకున్న ఆహారాన్ని తీసుకోవడం వలన లైంగిక సామర్థ్యాన్ని పెంచుతాయి. ఎందుకంటే ఇందులో ఉండే అన్ మోనో శాచురేటెడ్ ఫ్యాట్స్ మహిళల శరీరానికి చాలామంచివి.

బీన్స్, గింజలు

గర్భం త్వరగా ఉపయోగపడేవాటిలో గింజ ఉత్పత్తులు మరియు ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండే ఆహార ఉత్పత్తులు తినడం చేయాలి. ఉడకబెట్టిన శనగలు, సోయా బీన్స్, చిలగడదుంపలు, బంగాళా దుంపలు, బ్రోకలీ, బీట్ రూట్, అరటిపండ్లు, బాదం, గుడ్లు..ఈ ఆహారాలు పిల్లలు త్వరగా కలగడానికి సహాయం చేసే ఆహారాలు.

పొజిషన్స్ కూడా ముఖ్యమే..

మీరు ఎప్పుడు కూడా ఒక తెలియని విషయాన్ని తెలుసుకోవడానికి అస్సలు భయపడకండి, తప్పుగా అనుకోకండి. మీ ఆరోగ్యం గురించి మీకోసం మీరు తెలుసుకుంటున్న విషయాలు. భర్తతో కలిసే సమయంలో పొజిషన్స్ కూడా త్వరగా గర్భం దాల్చడానికి ఉపయోగపడే విషయాలు. మగవారి నుండి విడుదలయిన కణాలు, స్త్రీ గర్భాశయానికి చేరేలా పొజిషన్స్ ఉండేలా చేసుకోవాలి. అలాగే ఎప్పుడు ఏకాంతంగా కలవడం కూడా గర్భం రావడానికి ఉపయోగపడుతుందో ఇది వరకే మనం చెప్పుకున్నాం..

ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే LIKE చేయండి, మరియు SHARE చేయండి…

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
100%
Like
0%
Not bad
0%
What?
scroll up icon