Link copied!
Sign in / Sign up
60
Shares

మీ పిల్లలు అన్నం తినడానికి మారాం చేస్తుంటే ఈ చిట్కాలు వెంటనే ఫాలో అవ్వండి

పిల్లలు అన్నం తినకపోతే తల్లికి కడుపులో కలిగే బాధను కన్నీళ్ళలో చూపెడుతుంది. తన బిడ్డ కోసం ఎంతో ఇష్టంగా చేసిన ఆహారాన్ని పిల్లలు నాకు  వద్దు అని మారాం చేస్తుంటే బిడ్డ ఆకలిని తీర్చలేకపోతున్నానని బాధపడుతుంది. పిల్లలు కూడా ఏది కావాలో ఒక్కపట్టాన చెప్పలేరు కాబట్టి తల్లికి ప్రతిరోజూ పిల్లల ఆకలి తీర్చడం కాస్త కష్టమైన పనే. అయితే ఇక్కడ చెప్పుకునే ఈ సింపుల్ చిట్కాల ద్వారా మీ పిల్లలు ఖచ్చితంగా ఆహారాన్ని తీసుకోవడానికి ఇష్టపడతారు.

ఉదయం బ్రేక్ ఫాస్ట్

ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ గా పిల్లలకు నూనెతో చేసిన పదార్థాలు అంతగా ఇష్టపడరు కాబట్టి. ఓట్ మిల్క్, తృణ ధాన్యాలు, పెరుగుతో చేసిన ఆహారాలు, ఇడ్లీ, పండ్ల రసాలు, గుడ్లు ఇవ్వడం వలన ఇష్టంగా తింటారు.

మధ్యాహ్నం లంచ్

ప్రతిరోజూ పిల్లలు వెరైటీని కోరుకుంటారు కాబట్టి క్యారెట్, బీట్ రూట్, చిలగడదుంప, ఆలు, బెండకాయ వంటి పోషక విలువలు ఎక్కువగా ఉన్నటువంటి వీటిని అన్నంతో పాటు ఉడకబెట్టి ఇవ్వడం చేయాలి. అలాగే మీరు పిల్లలకు తినిపించేటప్పుడు మీరు తినడం లేదా ఎంత రుచిగా ఉంది, కమ్మగా ఉంది అంటూ వారికి ఇష్టం కలిగించేలా చేయాలి.

సాయంత్రం స్నాక్స్

పిల్లలకు చిరుతిళ్ళు అంటే చాలా ఇష్టం. అందుకని బయట కొనివ్వకుండా మీరే ఇంట్లో తయారు చేసి ఇవ్వండి. అంతకంటే ముందు కొద్దిసేపు వారిని బయట ఆడుకుని రమ్మని నీకు ఇష్టమైన ఫుడ్ తయారుచేస్తున్నాను అని చెప్పాలి. ఇలా చెప్పడం వలన అమ్మ నాకోసం మంచి వంటకం చేస్తున్న అన్న ఆలోచన ఉంటుంది. అలాగే పిల్లలకు ఇష్టమైన ఆటల రూపంలో, బొమ్మల రూపంలో ప్లేట్ లో ఆహారాన్ని ఇవ్వడం వలన ఇష్టంగా తింటారు.

రాత్రి డిన్నర్

ఇది ప్రతి తల్లితండ్రులకు చాలా కష్టమైనపని. ఎంత బ్రతిమలాడుతునాన్నా సరే తినడానికి మారాం చేస్తుంటారు. అందుకని అందరూ కూర్చుని ఈ సమయంలో తినడం వలన వారికి తినాలనే ఆసక్తి కలుగుతుంది. పెరుగన్నంలో ద్రాక్ష, దానిమ్మ లేదా అరటిపండు ఉంచి ఇవ్వడం, పాలతో కలిపి అన్నం తినిపించడం చేయాలి. పిల్లలకు రుచితో పాటు సువాసన కూడా బాగా నచ్చేలా చూసుకోవాలి.

ఇలా ఎప్పుడు చెప్పకండి

నువ్వు ఇప్పుడు అన్నం తింటే నీకు  చాకొలేట్ కొనిపిస్తా, ఐస్ క్రీం కొనిపిస్తా, ఇదిగో నీకు ఈ డబ్బులు ఇస్తాను అని పిల్లలను వాటికి ఆకర్షణగా చూపించి నమ్మించడం వలన నెక్స్ట్ టైం తినమంటే తినరు. ఎందుకంటే మీరు మాట ఇచ్చి చేయకపోతే వారు అదే ఎక్కువగా గుర్తుపెట్టుకుంటారు.

గబా గబా వద్దు నిదానమే ముద్దు

పిల్లలకు ఆదుకోవడం, టీవీలలో కార్టూన్, రైమ్స్ చూడటం బాగా ఇష్టం కాబట్టి గబా గబా తిని వెళ్లిపోవడానికి ట్రై చేస్తుంటారు, అలాగే మీరు కూడా త్వరగా తిను బుజ్జి అని తొందర పెట్టకండి. నిదానంగా తిన్నా సరే మీ బిడ్డ ఆకలి తీరడం మీకు ముఖ్యం కదా..అలాగే మీరు కూడా పిల్లలు తినే ఆహారాన్ని తినడం వలన వాళ్ళు కూడా అవి తినడానికే ఇష్టపడతారు.

మీకు ఈ ఆర్టికల్ నచ్చితే SHARE చేయండి..  

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon