Link copied!
Sign in / Sign up
0
Shares

పిల్లలు తమను ఫాలో అవ్వాలని తల్లిదండ్రులు చేసే 5 పనులు

పిల్లలను పెంచడం అనేది అంత తేలికైన విషయం కాదు. పిల్లలు పుట్టడం కన్నా పెంచడంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. తల్లిదండ్రులు తమ పిల్లలు తమనే స్ఫూర్తిగా తీసుకోవాలని అనుకుంటారు. వారు వేటిని ఇష్టపడతారో వాటినే పిల్లలు కూడా ఇష్టపడాలని అనుకుంటారు. పిల్లలకు ఆవిధంగా శిక్షణ కూడా ఇస్తారు. కొన్ని విషయాలలో తమ పిల్లలు కచ్చితంగా తమనే ఫాలో అవ్వాలని కోరుకుంటారు. అవేంటంటే,

మీకు నచ్చినవే వారికి కూడా

చాలా మంది తల్లిదండ్రులు తమ ఇష్టాలనే తమ పిల్లలకు నేర్పాలని చూస్తుంటారు. మీకు నచ్చిన కలర్, మీకు ఇష్టమైన ఫుడ్, మీకు నచ్చే వస్తువులను మీ పిల్లలు కూడా ఇష్టపడాలని అనుకోవడం సహజం. పిల్లలు కూడా చాలా వరకు మీరు దేన్నైతే ఇష్టపడతారో దాన్నే ఎక్కువగా ఇష్టపడే అవకాశం ఉంది.

ఇన్సెంటివ్స్

మీరు మీ పిల్లలచే ఏదైనా పని చేయించాలనుకున్నప్పుడు వారికి ఏదైనా ఆఫర్ చేస్తారు. మీరు వాకింగ్‌కు వెల్తున్నప్పుడు తోడు వస్తే ఏదైనా కొనిస్తాననడం, బహుమతి ఇస్తాననడం వంటివి. అయితే, మీరు ఇచ్చే బహుమతి వారికి ప్రోత్సాహకంగానే ఉండాలి కానీ గారాభం చేసేదిగా ఉండకూడదు. ఈ పనిని చాలా మంది తల్లిదండ్రులు చేస్తారు.

భయపెట్టడం

పిల్లలు సమయానికి పడుకోకపోతే చాలా మంది తల్లిదండ్రులు చేసే పని భయపెట్టడం. మీరు పడుకోకపోతే భూచోడు వచ్చి మిమ్మల్ని ఎత్తుకెళ్ళిపోతాడు అని భయానికి గురి చేస్తూ ఉంటారు. దీంతో పిల్లలు దారికి వస్తారని అలా చేస్తుంటారు.

అభిప్రాయాల మీద ప్రభావం

మీ పిల్లలు మీకు నచ్చని దాన్ని ఎన్నుకోవడం జరిగితే వారి నిర్ణయాన్ని ప్రభావితం చేయడానికి మీరు చాలా ప్రయత్నిస్తారు. మీ పిల్లలు వయసు తక్కువ గల వారైతే మీరు వారిని సులభంగా మార్చి వేస్తారు. కొంచెం వయసు ఉన్న వారైతే చాలా విషయాలు చెప్పి వారిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తారు.

బ్లాక్‌మెయిల్

చాలా మంది తల్లిదండ్రులు చివరి అస్త్రంగా బ్లాక్‌మెయిల్ చేస్తారు. నేను నీకోసం అన్నీ చేశాను అయినా నువ్వు నీకిష్టం వచ్చినట్లు  ఉంటానంటే అది నీఇష్టం అంటూ సెంటిమెంట్ మీద కొడతారు. ఈ డైలాగ్ ప్రతి తల్లిదండ్రులు ఉపయోగిస్తూ పిల్లలను కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.

పైవన్నీ కూడా తల్లిదండ్రులు పిల్లల కోసమే చేస్తారు. వారు బాగుండాలని కోరుకుంటూ అలా చేస్తారు. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon