Link copied!
Sign in / Sign up
5
Shares

పిల్లలు పుట్టిన తర్వాత తిరిగి ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు బాధపడకుండా ఉండటానికి 6 కారణాలు


ఇన్ని రోజులు మీరు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి, ఎంతో బాధను, నొప్పిని భరించి మీరొక బాబుకు లేదా పాపకు జన్మనిచ్చింటారు. బిడ్డ పుట్టిన తర్వాత వారి ఆలనాపాలనా చూడటం, వారు నిద్రపోయిన తర్వాతే నిద్రపోవడం, వారికి పాలు పట్టించడం వంటి ఎన్నో పనులు చేస్తూ వారికి మీరు చాలా దగ్గరయ్యి ఉంటారు. అయితే మీరు ఇప్పుడు తిరిగి ఆఫీస్‌కు వెళ్ళవలసి వస్తుంది. మీరు ఆఫీస్‌కు వెళ్ళడానికి ఎటువంటి ఇబ్బంది లేనప్పటికీ మీపాపను వదిలి వెళ్ళడానికి మీరు ఎంత మాత్రం ఇష్టపడరు. పాపను వదిలి నేను ఎలా ఉండగలను?, నన్ను వదిలి పాప ఎలా ఉండగలదు?, పాపను ఎవరు సంరక్షిస్తారు? వంటి ప్రశ్నలు మిమ్మల్ని వేధిస్తూ ఉంటాయి.

వీటన్నింటికీ కూడా ఒకటే పరిష్కారం! మీ పాప/బాబును డే కేర్ సెంటర్‌లో చేర్పించడం. మీపాపను అక్కడ చేర్పించడం ద్వారా మీరు మీవర్క్‌ను సమతుల్యం చేస్తూ, మీ పాపను సంరక్షించుకోగలరు. డేకేర్ సెంటర్‌లో ఏమేమి నేర్పిస్తారంటే,

అందరితో కలివిడిగా ఉండటం

డేకేర్ సెంటర్‌లో మీ పాప/బాబుతో పాటు చాలా మంది చిన్నా, పెద్ద వాళ్ళు ఉంటారు. వారందరితో మాట్లడటం వల్ల సోషల్‌గా ఎలా మూవ్ అవ్వాల్లో మీ పాపకు చినప్పటి నుండే అలవాటు అవుతుంది. అందరితో కలివిడిగా ఉండటం వల్ల తనకంటూ ఒక బలమైన వ్యక్తిత్వం ఏర్పడే అవకాశం ఉంది.

స్వతంత్ర భావాలు

రోజంతా డేకేర్‌లో గడపడం వల్ల వారిలో స్వతంత్రంగా ఆలోచించగలిగే తెలివితేటలు పెరుగుతాయి. మీరు వారిని పెద్ద స్కూల్స్‌లో లేదా హాస్టల్స్‌లో పెట్టినా తొందరగా అలవాటు పడతారు. ఒక తల్లిగా మీ పిల్లలలోని స్వతంత్ర భావాలను వెలికి తీస్తే ఎలాంటి వాతావరణంలోనైనా నెగ్గుకు రాగలరు.

సమయపాలన అలవరచుకోవడం

డేకేర్ సెంటర్‌లో ఒక పద్ధతి ప్రకారం అన్నీ సమకూర్చడం జరుగుతుంది. అన్నం తినడానికి, పద్యాలు చెప్పించడానికి, ఆడుకోవడానికి తగిన వేళలు ఉంటాయి. వీటి వల్ల తెలియకుండానే మీ పాపకు సమయాపాలన అలవడుతుంది. దీని వల్ల మీ పిల్లల యొక్క వ్యక్తిత్వం అభివృద్ధి చెందుతుంది. మీ పిల్లలలో వచ్చే మార్పును మీరు అతి తొందరలోనే గమనించగలరు.

చదువుల పట్ల ఒక అవగాహన రావడం

డేకేర్ సెంటర్‌లో చేర్పించడం వల్ల మీ పిల్లలకు కొద్దిపాటు చదువులు కూడా చెప్తారు. ఈ కొద్దిపాటి ఙ్ఞానం వల్ల మీ పిల్లలలో మేదో సంపత్తి పెరిగే అవకాశం ఉంది. దీని వల్ల మీ పిల్లలు స్కూల్‌కు వెళ్ళినప్పుడు తోటి విధ్యార్థుల కన్న బాగా రాణించగలరు.

స్నేహితులతో కలవడం

పిల్లలకు స్నేహితులు దొరకడం ఈదశ నుండే ప్రారంభం అవుతుంది. పిల్లలు మాట్లడటం ద్వారా లేదా వారి ఫీలింగ్స్ పంచుకోవడం ద్వారా వారికి ఎలాంటి స్నేహితులు కావాలో ఎంపిక చేసుకోగలగడం ప్రారంభం అవుతుంది. ఇలా సోషల్‌గా బాగా కలిసిపోయేవారు జీవితంలో మంచి వక్తలుగా రాణించే అవకాశం ఉంది.

మీరు కూడా ప్రశాంతంగా ఉండగలరు

మీ పిల్లలను మంచి డేకేర్ సెంటర్‌లో ఉంచడం ద్వారా మీరు కూడా ప్రశాంతంగా ఉండవచ్చు. దీనితో పాటూ మీరు కూడా మీ వృత్తిగత జీవితం మీద దృష్టీ పెట్టవచ్చు. మీకు పనిలో ఒత్తిడి ఎక్కువ అయినప్పుడు మీ పాపతో ఆడుకోవడం ద్వారా ఒత్తిడి దూరమై మీరు మరింత ఉల్లాసంగా అవుతారు.

ఒక తల్లిగా మీరు మీబిడ్డకు మంచి బవిష్యత్తును ఇవ్వాలని తాపత్రయపడుతూ ఉంటారు. మీపాపను చూసుకోవడానికి మీఅమ్మ లేదా అత్త అందుబాటులో లేకపోతే డేకేర్ సెంటర్‌లో చేర్చడం చాలా ఉత్తమమైన పని. మన దేశంలో చాలామంది తల్లులు పిల్లలను డేకేర్ సెంటర్‌లో చేర్చడం అన్నది వారు తీసుకున్న మంచి నిర్ణయాలలో ఒకటని చెప్తారు. కాబట్టి మీరు మీపాపను డేకేర్ సెంటర్‌లో చేర్చడానికి ఏమాత్రం గిల్టీగా ఫీల్ అవకండి.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon