Link copied!
Sign in / Sign up
0
Shares

పిల్లలు పుట్టిన (డెలివరీ) తర్వాత పీరియడ్స్ ఎందుకు ఆలస్యం అవుతాయి? ఇలా జరిగితే ప్రమాదమా..!!

మహిళలను ప్రతి నెల మూడు లేదా నాలుగు రోజుల పాటు ఇబ్బంది పెట్టేవి పీరియడ్స్ (ఋతుక్రమం). ఐతే పిల్లలు పుట్టిన తర్వాత (డెలివరీ అయ్యాక) మహిళలలో పీరియడ్స్ రావడం ఆలస్యం అవుతుంది. కొందరిలో దాదాపు ఆరు నెలలు పాటు ఇలా కావచ్చు. పిల్లలు పుట్టాక పీరియడ్స్ ఆలస్యం వెనుక అసలు కారణం ఏంటి? ఇలా జరిగితే మహిళలకు ఎటువంటి ఇబ్బందులు ఉంటాయో తెలుసుకోండి..

పీరియడ్స్ ఆలస్యం కావడానికి కారణాలు

సాధారణంగా మహిళల శరీరంలో పిల్లలు పుట్టాక చాలా మార్పులు వస్తాయి. మునుపటిలా యాక్టివ్ గా ఉండలేరు. పిల్లలకు పాలు పట్టించడం, డెలివరీ సమయంలో ఎక్కువ ఒత్తిడికి గురవ్వడం, అధిక రక్తస్రావం మరియు ఒత్తిడి కారణంగా, ప్రతి నెల సరైన సమయానికి జరగవలసిన ఋతుక్రమం ఆగిపోతుంది. దీనికి అస్సలు టెన్షన్ పడకండి. డెలివరీ అయ్యాక ఈ విధంగా జరగడం సహజమే అని చెబుతున్నారు వైద్యులు.

ప్రగ్నన్సీ తర్వాత పీరియడ్స్

ప్రగ్నన్సీ తర్వాత పీరియడ్స్ ఆలస్యం కావడానికి కారణాలలో బిడ్డకు పాలు ఇవ్వడం మరియు ఇంకా పీరియడ్స్ కాలేదని అధిక ఒత్తిడికి గురికావటం మరొకటి. ఇది మహిళల శరీర తత్త్వంపై ఆధారపడి ఉంటుంది. అలాగే కొన్నిసార్లు యోని నుండి లేత ఎరుపు వర్ణంలో వచ్చే రక్తానికి, పీరియడ్స్ కు సంబంధం లేదు. ఒకవేళ బిడ్డకు తల్లి పాలు ఇవ్వకపోతే వారిలో 5 లేదా 6 వారాలలో పీరియడ్స్ రావడం జరుగుతుంది.

పీరియడ్స్ ఆలస్యం అయితే ప్రమాదమా..!

డెలివరీ అయ్యాక పీరియడ్స్ ఆలస్యమే కాబట్టి డోంట్ వరీ.. కాకపోతే కొందరిలో ఆలస్యం కారణంగా పీరియడ్స్ అయినప్పుడు, 5-6 వారాలలో పీరియడ్స్ వచ్చినప్పుడు నొప్పిగా ఉండటం, అధిక రక్తస్రావం, ఒత్తిడి, వికారం, యోని భాగంలో నొప్పి వంటివి ఉంటాయి. అలాగే ప్రసవం జరిగిన తర్వాత వచ్చే పీరియడ్స్ అప్పుడు అండం శుక్రకణంతో కలిస్తే మళ్ళీ గర్బం దాల్చే అవకాశం ఉంది. కాబట్టి రుతుస్రావం అప్పుడు జరిపే సెక్స్ పట్ల జాగ్రత్త వహించండి.

ఈ విషయాలు చాలా తక్కువమందికే తెలుసు కాబట్టి అందరికీ తెలిసేలా SHARE చేయగలరు..

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon