Link copied!
Sign in / Sign up
10
Shares

పిల్లలు పుట్టిన తరువాత మీ శరీరంలో వచ్చే 6 భయంకర మార్పులు : ముందే తెలుసుకోండి

మార్పు అనేది సహజం. పిల్లలు పుట్టిన తరువాత జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. ప్రతి మహిళకు పిల్లలు పుట్టిన తరువాత శరీరంలో మార్పులు వస్తాయి  అని తెలుసుగానీ ఆశించని మార్పులు వస్తాయి అని ఎవరు మాత్రం ఉహించగలరు చెప్పండి. ముందుగానే తెలుసుకుని తయారుగా ఉండటం మంచిది.

1. ఏకాంతం 

డెలివరీ అయిన 6 వారాల దాక భర్తతో కలవడం కుదరదు అని మన అందరికి తెలిసిన విషయమే. కానీ అందరికి తెలియని విషయం ఆ 6 వారాల గడువు తరువాత కూడా కలవడం రాను రాను తగ్గిపోతుంది. పిల్లలతో బిజీ గా ఉండటం లేదా ఇతర పనుల్లో పడిపోవటం వలన  ఏకాంతంగా గడిపటం తగ్గే అవకాశాలు ఉన్నాయి. ముందుగానే డెలివరీ అయిన కొన్ని నెలలవరుకు అందుకు దూరంగా ఉండాలని మీ మనసుని సిద్ధం చేసుకోవటం మంచిది.

2. బంధం

పిల్లలు పుట్టిన తరువాత పూర్తిగా పిల్లల పైనే మన దృష్టి వుంటుంది. భాగస్వామితో చర్చల్లో కూడా పిల్లల గురించే ఎక్కువగా మాట్లాడుతూ ఉండటం జరుగుతుంది. మీ ఇద్దరి మధ్య బంధం ఎలా మారుతుంది అంటే మీ పిల్లలు కోసం మాత్రమే మీరు ఇద్దరు ఉన్నటుగా ఉంటుంది. ఇదేమి బాధ పడవలసిన విషయం కాదు. మెల్లగా మీ బంధం ఇంకా బలపడి ఇంతకుముందు కన్నా ఇంకా ఎక్కువ ప్రేమ పెరుగుతుంది.

3. తగాదాలు

ఈ సమయంలో మహిళలు ప్రతి చిన్న విషయానికి తరచూ కలత చెందే అవకాశాలు ఉన్నాయి. దీనికి వారి శరీరంలో విడుదల అయ్యే హార్మోన్లు కూడా ఒక కారణం. ఇంకొకటి మీకు సహనం కూడా తక్కువ గా ఉండవచ్చు. దీని వలన తగాదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు బాధ పడనవసరం లేదు అన్ని అవే సర్దుకుంటాయి.

4. మీ మధ్య దూరం

బిడ్డ పైనే ఎల్లపుడు దృష్టి ఉండటం వలన మీ భాగస్వామి తో అంతగా సమయం కేటాయించలేరు మరియు ఇతర కారణాలు ఉండవచ్చు. వీటి వలన మీ మధ్య దూరం పెరిగే అవకాశం ఉంది.

5. బిడ్డ పైన ఎక్కువ ప్రేమ

అందరికి వారి పిల్లల పైన ప్రేమ ఉంటుంది కానీ కొన్నిసార్లు వారి భాగస్వామి కన్నా ఎక్కువగా ప్రేమిస్తారు. దీని వల్ల మీరు మీ పిల్లలతో ఎక్కువగా సమయం గడుపుతూ మీ భాగస్వామి తో ముందులా లేకపోవటం వలన అది మీ బంధంపై ప్రభావితం చేస్తుంది.

6. విశ్రాంతి

పిల్లలని చూసుకోవడం చాలా కష్టమైన పని. అసలు విశ్రాంతి తీసుకోవటానికి సమయమే దొరకదు. కానీ మీ పిల్లలతో గడిపే మధురమైన క్షణాలు ఎప్పటికి మీ మదిలో కొలువుండిపోతాయి.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon