Link copied!
Sign in / Sign up
3
Shares

పిల్లలు పుట్టిన తరువాత కుడా సన్నగా అందంగా ఉండాలంటే ఇవి చేస్తే చాలు…


పిల్లలు పుట్టిన తర్వాత చాలా మహిళల్లో తమ బరువు గురించి కొంచెం ఆందోలన ఉంటుంది. ఎలా బరువు తగ్గాలి, మునుపటిలా నాజూగ్గా ఎలా తయారవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటారు. దీని కోసం నెట్‌లో చూడటం, మేగజిన్స్ చదవడం వంటివి చేసి ఉంటారు. ఎలాగైనా బరువు తగ్గాలని ప్రయత్నించి ఉంటారు. కానీ తగ్గలేకపోతారు. దానికి కారణం సరైన నియమాలు పాటించలేకపోవడంతో పాటూ మీకు ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోకపోవడమే.

మీరు బరువు తగ్గడానికి చెయవలసిన మరియూ చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. అవేంటంటే,

చేయవల్సిన పనులు

1. ఫ్రై చ్ఝేసిన పదార్ధాలకు దూరంగా ఉండాలి.

2. భోజనం తక్కువగా తినడం, ఎక్కువ సార్లు తినడం.

3. వ్యాయామం చేయడానికి ప్లాన్ వేసుకోండి మరియూ తప్పక పాటించండి.

4. చాక్‌లెట్స్ వీలైనంత తక్కువ తినండి

5. పళ్ళరసాలను వీలైనంత ఎక్కువగా తాగండి

ఒక్కోసారి మీరు పైవన్నీ సరిగ్గా పాటించినా కూడా లావు తగ్గకపోవచ్చు. అప్పుడు నిరాశ చెందకుండా మీరు చేసిన తప్పులను ఒకసారి చూసుకోండి. మీరు బరువు తగ్గాలనుకున్నప్పుడు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. అవేంటంటే,

చేయకూడని పనులు

1. అన్నీ ఒకేసారిగా

మీరు బరువు తగ్గడనికి పాటించే డైట్‌ను ఒక్కసారిగా మొదలుపెట్టకూడదు. ఒకేసారి మొత్త ట్రై చేయడం వల్ల మీ శరీరం అడ్జస్ట్ కాలేకపోవచ్చు. కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి చేస్తే మీ శరీరం తట్టుకొని ప్రభావం చూపిస్తుంది.

2. ఇష్టమైన ఆహారం

మీకు బాగా ఇష్టమైన ఆహారాన్ని ఒకేసారి ఆపడం వల్ల మీరు చేస్తున్న దాని పట్ల మీకు అయిష్టత ఏర్పడుతుంది. కాబట్టి మీకు నచ్చిన ఫుడ్‌ను తక్కువ మోతాదులో తీసుకొనే విధంగా ప్లాన్ చేసుకోవాలి. అలా చేస్తూ చేస్తూ మీ బరువు అదుపులో పెట్టుకోవాలి.

3. పళ్ళరసం

చాలా మంది భోజనానికి బదులు పళ్ళరసం తీసుకో సరిపోతుంది అని చెప్పవచ్చు అయితే పళ్ళరసం వల్ల మంచి పోషణ అందుతుంది కానీ కడుపు నిండదు. కాబట్టి జ్యూస్‌ను స్నాక్స్ లాగా తీసుకోవచ్చు కానీ మీల్స్ లాగా కాదు అని గుర్తించాలి.

పై 3 తప్పులను బరవు తగ్గాలనుకొనే వారు చేస్తారని న్యూట్రీషియన్స్ అంటారు. ఈ తప్పులు జరగకుండా జాగ్రత్త పడితే కేవలం 2-3 నెలల్లో ఫలితం కనిపిస్తుందని చెప్పవచ్చు. వ్యాయామం చేయాలనుకుంటే ఎక్కువ ఇత్తిడికి గురయ్యి చేయాల్సిన అవసరం లేదు కేవలం అర్ధగంట వాకింగ్ లేదా జాగింగ్ చేస్తే చాలు. మంచి ఫలితాన్ని గమనించవచ్చు.

ఇంకో విషయం ఏమిటంటే, వ్యాయామం చేయడం వల్ల జీరో సైజ్‌కు ఆకృతి వస్తుందని చాలా మంది అనుకుంటారు అయితే నిజం కాదు. వ్యాయామం యొక్క ముఖ్య ఉద్ధేశం ఏమిటంటే ఆరోగ్యంగా ఉండటం, ఫిట్‌గా ఉండటం, శరీరంలో అనవసర కొవ్వును తొలగించుకోవడం. కాబట్టి మీరు మరీ సన్నగా కాలేకపోయినా ఆరోగ్యంగా ఉన్నారని గుర్తిస్తూ ఆనందంగా వ్యాయామాన్ని కొనసాగించండి.

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon