Link copied!
Sign in / Sign up
19
Shares

పిల్లలు పుట్టాక మీ అందాన్ని రెండింతలు పెంచే 5 సౌందర్య చిట్కాలు

అందంగా ఉండాలనుకోవడం మహిళలకు ఉన్న కోరికలలో అతి ముఖ్యమైనది. అందమే  వారికి ఆత్మ విశ్వాసంగా చెబుతుంటారు కూడా. ఐతే చాలామంది మహిళలలో  గర్భం దాల్చిన దగ్గరి నుండి పిల్లలు పుట్టాక అందంలో మార్పులు కనిపించడం సహజమే. ఐతే మునుపటిలా మీ అందాన్ని మళ్ళీ తిరిగి పొందాలంటే ఈ సౌందర్య చిట్కాలను తప్పకుండా ఫాలో అవ్వండి..

ముఖం అందంగా కనిపించేందుకు

ముఖంపై జిడ్డు, మురికి లేకుండా కాంతివంతంగా కనిపించాలంటే కొద్దిగా అరటిపండు తీసుకుని అందులో ఒక స్పూన్ తేనె కలిపి మిక్స్ చేయాలి. ఆ తర్వాత 5 నిముషాల పాటు ఫేస్ ప్యాక్ గా వేసుకుని చల్లని నీటితో శుభ్రం చేసుకోవడం వలన ముఖం అందంగా, కాంతివంతంగా కనిపిస్తుంది.

పాదాల అందం కోసం

ఎదుటివారిని గమనించేటప్పుడు ముఖం తర్వాత పాదాలను ఎక్కువగా చూస్తుంటారు. కాబట్టి, ఒక బకెట్ లో గోరు వెచ్చని నీటిని తీసుకుని  అందులో రోజ్ వాటర్ లేదా సబ్బు కొద్దిసేపు ఉంచి అందులో పాదాలను ఉంచాలి. కొంచెం ఉప్పు కలుపుకోవడం వలన మంచి ఫలితం కనిపిస్తుంది. ఇలా చేయడం వలన పాదాలకు ఉన్నటువంటి మురికి దూరమవుతుంది.

స్ట్రెచ్ మార్క్స్ తొలగిపోవడానికి

పిల్లలకు జన్మను ఇచ్చిన తర్వాత స్ట్రెచ్ మార్క్స్ రావడం సహజమే. ఐతే ఇంటి దగ్గరే సులభంగ తొలగించుకోవడానికి తేనెను స్ట్రెచ్ మార్క్స్ పై రాసుకుని మర్దనా చేయాలి. ఆ తర్వాత గోరువెచ్చగా ఉండే క్లాత్ ను దానిపై ఉంచి 15 నిముషాల తర్వాత తీసివేయాలి. ఆ వెంటనే గోరు వెచ్చని నీటితో క్లీన్ చేసుకోవడం వలన స్ట్రెచ్ మార్క్స్ తొలగిపోతాయి.

ముఖంపై నలుపు, మచ్చలు దూరం కావాలంటే..

రెండు స్పూన్ల నిమ్మరసంలో ఒక స్పూన్ తేనె కలిపి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మోచేతులు, మెడ భాగాలలో రాసుకోవడం వలన ముఖంపై ఉండేటటువంటి నల్లని మచ్చలు తొలగిపోతాయి. అలాగే ముఖం అందంగా, కాంతివంతంగా కనపడేలా చేయడానికి ఉత్తమ చిట్కా..

మీ పిల్లలతో కలిసి నిద్రించండి

పిల్లలు పుట్టాక మహిళకు దాదాపు 2 ఏళ్ళ వరకు సరైన నిద్ర ఉండదు అనేది నిజమే. అందుకని మీ పిల్లలు ఎప్పుడైతే నిద్రిస్తారో అప్పుడే మీరు పడుకోవడం చేయాలి. పిల్లలు ఎక్కువ సమయం నిద్రిస్తారు కాబట్టి మీరు నిద్రించడం వలన ఎప్పటికీ మీ ముఖం ఫ్రెష్ గా మెరిసిపోతూ ఉంటుంది.

లావు తగ్గడానికి

ఇది ప్రతి మహిళలో ఉండే సమస్య కాబట్టి ప్రతి రోజూ కొంచెం దూరం నెమ్మదిగా అయినా నడవటం, ప్రసవం తర్వాత చేయవల్సిన వ్యాయామాలు చేయడం, యోగా, ధ్యానం చేయడం వలన మీ బరువును కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. అలాగే గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వలన టెన్షన్స్, ఒత్తిడి దూరం అయ్యి మనస్సును ప్రశాంతంగా ఉండేలా చేస్తాయి.

ఇంకా వేరే బ్యూటీ టిప్స్ గురించి తెలుసుకోవాలంటే మాకు COMMENT చేయండి. ఈ ఆర్టికల్ ను అందరికీ SHARE చేయండి.. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon