Link copied!
Sign in / Sign up
1
Shares

పిల్లలు పుట్టాక మీరు తప్పక చేయాల్సిన పనులు, అస్సలు చేయకూడని 5 పనులు


ప్రసవం జరిగిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ శరీరంలో వచ్చే మార్పులకు అనుకూలంగా మీరు కొన్ని పనులు చేయాల్సి రావచ్చు, కొన్ని పనులు చేయకుండా ఉండాల్సి రావచ్చు. అవేంటంటే,

టాంపన్స్

మీకు ప్రసవం జరిగిన తర్వాత యుటెరస్ భాగంలో అయిన గాయం తొందరగా మానదు. కాబట్టి మీకు బ్లీడ్ అవుతున్నప్పుడు టాంపన్ వాడకూడదు. ఒకవేళ మీరు టాంపన్ వేస్తే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది.

శ్యానిటరీ మార్చండి

ప్రసవం జరిగిన కొన్ని రోజుల వరకు కూడా మీకు బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు శ్యానిటరీ ప్యాడ్స్‌ను తరచుగా మార్చడం మంచిది. దీని వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కు గురి కాకుండా ఆపవచ్చు.

శృంగారానికి దూరం

మీకు ప్రసవం జరిగిన తర్వాత అయిన గాయాన్ని బట్టి చాలా రోజులు శృంగారానికి దూరంగా ఉండాల్సి రావచ్చు. గాయం పూర్తిగా మారిన తర్వాతనే శృంగారం మొదలుపెట్టడం మంచిది. ఒకవేళ మీకు ఏదైనా అసౌకర్యంగా ఉంటే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి.

మంచి భంగిమ

మీరు చాలా రోజుల పాటూ కడుపులో బిడ్డను మోయడం వల్ల మీకు వీపు భాగంలో నొప్పి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు విశ్రాంతి తీసుకొనేటప్పుడు మీకు అసౌకర్యం కలగని భంగిమను ఎంచుకోండి. నిద్రపోయేటప్పుడు కూడా జాగ్రత్తగా పడుకోవడం మంచిది.

తలదిండు మీద కూర్చోండి

ప్రసవం జరిగిన తర్వాత అయ్యే గాయాన్ని తొందరగా మాన్పు కోవాలంటే, మీరు అప్పుడప్పుడు తల దిండు మీద కూర్చోండి. దీని వల్ల యుటెరస్ భాగంలో అయిన గాయం తొందరగా మానే అవకాశం ఉంది.

పైవన్నీ పాటించడం వల్ల ప్రసవం తర్వాత మీరు కొద్ది సమయంలోనే తిరిగి మామూలు మనిషి అవుతారు.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon