Link copied!
Sign in / Sign up
8
Shares

పిల్లలు పక్క తడపడం మాన్పించడానికి 10 చిట్కాలు

 

చిన్న పిల్లలు రాత్రి పూట వారికి తెలీకుండానే మూత్ర విసర్జన చేస్తుంటారు. దీనిని పక్క తడపడం లేదా బెడ్ వెట్టింగ్ అంటారు. పిల్లల్లో ఇది చాలా సహజం. 5 ఏళ్ల లోపు పిల్లల్లో 20 శాతం మంది, 6 ఏళ్ల వయసు పిల్లల్లో 10 శాతం మందికి పక్క తడిపే అలవాటుంది. 

రాత్రిపూట నిద్రలో పిల్లలు తమకు తెలీకుండానే మూత్రవిసర్జన చేస్తుంటారు. అది కామన్. దాని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు.

 

1.అందరికీ ఇబ్బందే:

బెడ్ వెట్టింగ్ తో పెద్దవాళ్లే కాదు... పిల్లలూ ఇబ్బంది పడతారు. వయసు పెరిగే కొద్దీ వాళ్లలో ఈ అలవాటు దూరమవుతుంది.

 

2. ఎగతాళి చేయకండి:

నిద్రలో తెలీక మూత్రవిసర్జన చేసేవారిని ఎగతాళి చేయకండి. చులకన చేస్తే ఆ ప్రభావం పడుతుంది. వాళ్లు అలా చేయకుండా, అర్థమయ్యేలా చెప్పండి.

 

3. బాత్ రూమ్ కు వెళ్లాలి :

బెడ్ వెట్టింగ్ మానిపించాలంటే నిద్రపోవడానికి ముందు బాత్ రూమ్ కు వెళ్లే అలవాటు చేయండి.

 

4. మాయిశ్చర్ అలారమ్ :

బెడ్ వెట్టింగ్ మానాలంటే మాయిశ్చర్ అలారమ్ ఉపయోగించడం మంచిది. మీ బేబీ పక్క తడపగానే అలారం ఆగిపోతుంది. ఆ సంకేతం విని పాప లేదా బాబు క్రమంగా పక్క తడపడం మానుకుంటారు.

 

5. కేలండర్ మార్కింగ్ :

మీ పాప/బాబు పక్క తడిపిన రోజు, తడపని రోజు కేలండర్ లో గుర్తు పెట్టండి. ఆ కేలండర్ వాళ్లకు చూపిస్తే, సిగ్గుపడి ఆ అలవాటు మానుకుంటారు.

 

6. రాత్రుళ్లు లిక్విడ్స్ ఇవ్వద్దు :

పిల్లలు రాత్రి అన్నం తిన్న తర్వాత వాళ్లకు ద్రవ పదార్థాలు ఇవ్వకండి. అలా అని వాళ్లను మరీ ఇబ్బంది పెట్టకండి.

 

7. నిద్రలేపండి :

రాత్రిళ్లు అప్పుడప్పుడూ మీ పిల్లల్ని నిద్రలేపి బాత్ రూమ్ కు తీసుకెళ్లడం మంచిది.

 

8. వాటర్ ప్రూఫ్ షీట్లు :

రాత్రిపూట పిల్లలు పక్క తడపకుండా రబ్బరు షీట్లు వాడండి. వాటిని సులభంగా శుభ్రపరచవచ్చు.

 

9. బహుమతి :

పిల్లలు ఎన్నిసార్లు పక్క తడపకుండా ఉన్నారు? అని కొందరు తలిదండ్రులు లెక్కలేస్తుంటారు. పక్క తడపకుండా ఉంటే వాళ్లు ఇష్టపడేది ఏదైనా ఇవ్వండి.

 

10. చివరికి డాక్టర్ దగ్గరికి :

పైన చెప్పిన చిట్కాలేవీ పనిచేయకుంటే చివరికి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లండి.

 

ఎప్పుడు తీసుకెళ్లాలి? :

1. మీ పాప లేదా బాబుకు ఆరేడు ఏళ్లు వచ్చినా ఇంకా పక్క తడుపుతుంటే…

2. ఆరేళ్లలోపు పిల్లలు పక్క తడిసి ఇబ్బంది పడుతుంటే...

3. ఒకసారి పక్క తడపకుండా ఉండి, మళ్లీ తడుపుతుంటే…

4. రోజూ పక్క తడుపుతూ  మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే ...

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon