Link copied!
Sign in / Sign up
45
Shares

పిల్లలు ఈ 3 రకాలుగా పడుకుంటే మరణించే ప్రమాదం ఉంది!! ఏ పొజిషన్ లో పడుకుంటే సురక్షితమో తెలుసుకోండి

మొదటిసారి తల్లి అయినప్పుడు బిడ్డకు ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితం ఇవ్వడానికి  ప్రతి క్షణం ప్రతి తల్లి తపన పడుతూ ఉంటుంది. ఐతే ప్రతి విషయాన్ని డాక్టర్ ను అడగలేక, మంచి చెడు చెప్పేవారు పక్కనలేనప్పుడు బిడ్డ పెంపకం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ప్రతి తల్లి ఏ మాత్రం బాధపడకుండా, భయపడకుండా కొన్ని ఉత్తమ సలహాలను v‘టైనీ స్టెప్ తెలుగు’ మీకు అందిస్తోంది. అందులో పసి పిల్లలు నిద్రించే పొజిషన్ గురించి మీ పిల్లల ఆరోగ్యం కోసం…

2500 పిల్లల మరణాలు - నిద్ర పొజిషన్

యూఎస్ లో ఆరోగ్య నిపుణులు జరిపిన తాజా పరిశోధనల ప్రకారం సంవత్సరానికి దాదాపు 2500 మంది పిల్లలు ఆకస్మిక శిశు మరణాల (స్లీపింగ్ ఇన్ ఫాన్ట్ డెత్ సిండ్రోమ్) కు గురి అవుతున్నట్లు తెలిపారు. అందులోనూ ఒక సంవత్సరంలోపు పిల్లలే ఎక్కువగా ఉన్నారట. పిల్లలు పడుకునే విధానం, నిద్రించే పొజిషనే ఇందుకు కారణం.  అందుకే మీ పిల్లలను నిద్రించేటప్పుడు, ఎలా పడుకోబెట్టుకోవాలో చెబుతున్నాం.

కడుపుపై భారం వేసి నిద్రిస్తే
 

పిల్లల కడుపు కిందకు ఉండి, వీపు భాగం పైకి ఉంచి పిల్లలు నిద్రిస్తే ఇది వారి ఆరోగ్యానికి మంచిది కాదు. శ్వాస సమస్యలు తలెత్తి ప్రాణాలకు దారితీస్తుంది. ఎందుకంటే ఇలా బోర్లా పడుకోవడం వలన బెడ్ లేదా దుప్పట్లు పిల్లల నోరు మరియు ముక్కు రంధ్రాలకు దగ్గరగా ఉండటం వలన శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. అలాగే వాటిపై ఉన్న దుమ్ము, ధూళి కణాలు శ్వాస తీసుకునేటప్పుడు లోపలి వెళ్లే ప్రమాదం ఎక్కువ. కొన్నిసార్లు ఇలా పడుకోవడం జరుగుతుంది కాబట్టి దుప్పట్లు క్లీన్ గా ఉండేలా చూసుకోవాలి.

ఒకే వైపు పడుకుని నిద్రిస్తే


పసిపిల్లలు ఎప్పుడు ఒకేవైపు పడుకుని నిద్రించడం వలన పొట్ట భాగం సైజు పెరిగి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుందని, ఇది ఆకస్మిక శిశు మరణాలకు దారి తీస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

పిల్లల నిద్రకు సరైన పొజిషన్

వీపు భాగాన్ని బెడ్ కు, కళ్లు, కడుపు ఆకాశాన్ని చూసేలా పిల్లలను పడుకోబెట్టి నిద్రించడం కరెక్ట్ పొజిషన్. శ్వాస తీసుకోవడం, వదిలి వేయడంలో ఎటువంటి ఇబ్బంది తలెత్తదు మరియు ఆరోగ్యకరం కూడా. ఐతే ఎప్పుడు ఇలాగే నిద్రించడంవలన తల వెనుకభాగం ఫ్లాట్ గా మారుతుందని చెబుతున్నారు. అందుకని అప్పుడప్పుడు పొజిషన్ కొన్ని నిముషాలు మార్చడం లేదా మీపై పడుకోబెట్టుకోవడం చేయాలి.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
100%
Like
0%
Not bad
0%
What?
scroll up icon