Link copied!
Sign in / Sign up
3
Shares

పిల్లలు మీ నుండి నేర్చుకునే 5 అద్భుతమైన అలవాట్లు

పిల్లలు అందంలా కనిపించే మీ ప్రతిరూపాలు. మీరు ఏం చేసినా సరే వారు కూడా అలాగే చేస్తుంటారు. మీరు నవ్వితే నవ్వడం, దువ్వెనతో తల దువ్వితే వారు కూడా దువుకోవడం, మీరు లిప్ స్టిక్, పౌడర్ రాసుకుంటే వారు కూడా అలానే చేయడం, డ్రస్ వేసుకునే విధానం, తీసుకునే ఆహారం.. ఇలా అన్ని విధాలుగా మిమ్మల్ని ఇమిటేట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ చెప్పుకునే ఈ అద్భుతమైన అలవాట్లు మాత్రం వారికి తప్పక నేర్పించాలి. అవేంటో మీరే చూడండి.

స్నానం

పిల్లలకు స్నానం అనేది మంచి ఆరోగ్యాన్నిచ్చే ప్రక్రియ. చిన్న పిల్లలకు వారానికి మూడు సార్లు ఫర్వాలేదు కానీ స్కూల్ కు వెళ్లే పిల్లలకు మాత్రం ప్రతిరోజూ తమంతటతామే స్నానం చేసుకునేలా నేర్పాలి. ఎందుకంటే చెమట, క్రిములు, దుర్వాసన కారణంగా చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మీరు ప్రతిరోజూ స్నానం చేయడం, వారికి స్నానం చేయించడం వలన అవును ప్రతిరోజూ స్నానం చేయడం తప్పనిసరిగా అలవాటుగా చేసుకుంటారు.

పడుకోవడం నిద్రలేవడం

పిల్లలు తల్లితండ్రులు ఏం చేస్తే వారు కూడా అలాగే చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. మీరు పడుకుంటే వారు కూడా పడుకోవడం, మీరు ఎప్పుడు నిద్రలేస్తే అప్పుడే వారు కూడా నిద్రలేవడం చేస్తారు. సరైన సమయానికి పడుకోవాలి, బద్ధకంగా ఉండకుండా ఉదయాన్నే నిద్రలేవాలి అనే అలవాటు పిల్లలకు తెలియకుండానే నేర్పించిన వారవుతారు.

మీరు మాట్లాడే తీరు

పిల్లలు మీ చుట్టుపక్కల ఉన్నప్పుడు ఎంతో జాగ్రత్తగా మాట్లాడాలి. ఫోన్ లో అయినా, ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు లేదా మీ భర్తతో గొడవ పడ్డప్పుడు, కోపంగా ఉన్నప్పుడు..ఒకటి వారిని అక్కడి నుండి పంపించడం చేయాలి లేదా సున్నితంగా మాట్లాడం చేయాలి. మీరు మాట్లాడే మాటలు బయట ఫ్రెండ్స్ తో గానీ మీతో గానీ ఉపయోగిస్తారు కాబట్టి కేర్ ఫుల్ గా ఉండాలి.

తినటం

భోజనం చేసేటప్పుడు మీరు ఎలా తింటున్నారు, ఎలా కలుపుతున్నారు, ముద్దగా చేస్తున్నారా..ఇలా ప్రతి విషయాన్ని మీ పిల్లలు గమనిస్తూ ఉంటారు. అందుకని మీరు కూడా క్లీన్ అండ్ నీట్ గా తినడం వలన మీ బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు లేదా స్కూల్ కి వెళ్ళినప్పుడు శుభ్రంగా తినడం అలవాటు చేసుకుంటారు.

నైతిక విలువలు

పిల్లలకు ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, ఎవరితో ఎలా ఉండాలి, గౌరవం, మర్యాద, ఓపిక, మానవత్వం..అనే నైతిక విలువలు, చిన్న పెద్ద వాళ్లను ఎలా ట్రీట్ చేస్తున్నారో తెలుసుకోవడం అనేది మీ నుండే వారికి అలవాటుగా మారుతుంది కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం వలన మీ పిల్లలకు మంచి భవిష్యత్ ఇచ్చిన వాళ్లవుతారు.

ఈ ఆర్టికల్ మీకు నచ్చితే SHARE చేయడం మర్చిపోకండి.  

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon