Link copied!
Sign in / Sign up
15
Shares

మీ పిల్లలకు ఇది బలాన్ని ఇస్తుంది : 'కొల్హాపూరి గుడ్డు' కూర ఎలా చేయాలో తెలుసుకోండి..

గుడ్డు ఇంట్లో పిల్లలకు పెద్దలకు నచ్చే ఆహరం. అందరూ తినడానికి ఇష్టపడుతారు అంతే కావాల్సిన పోషకాలు. ముఖ్యంగా  ఎదిగే పిల్లలకు గుడ్డు చాలా అవసరం. కానీ పిల్లలు ఇష్టంగా తినేలా కొల్హాపురి గుడ్డు కూరను రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావాల్సిన పదార్ధాలు :

గుడ్లు - ఐదు

ఉల్లిపాయలు - రెండు

టొమాటో - ఒకటి

ఎండు మిర్చి - ఒకటి

అల్లం వెల్లుల్లి - ఒకటిన్నర టేబుల్ స్పూన్

కొబ్బరి తురుము - 2 టేబుల్ స్పూన్లు

నూనె - 4 టేబుల్ స్పూన్లు

పసుపు - అర టి స్పూను

లవంగాలు - ఆరు

మిరియాలు - పది

ఉప్పు - తగినంత

తయారి విధానం : 

1. ముందుగా గుడ్లు ఉడికించి, పెంకు తీసి పెట్టుకోండి.

2. బాణలిలో నూనె పోసి గుడ్లను వేయించుకోండి. వేయించిన గుడ్లను పక్కకు తీసి పెట్టుకోండి.

3. అదే బాణలిలో మరికొంత నూనె పోసి, మిరియాలు, లవంగాలు వేసి వేయించండి. తరిగిన ఉల్లిపాయ, టమాటో ముక్కలను, ఎండు మిర్చి వేయించుకోండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, తగినంత ఉప్పు, కొబ్బరి తురుము, వేసి వేయించండి.

4. ఈ మొత్తం మిశ్రమాన్ని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ గా చేసుకోండి.

5. బాణలిలో ఈ మిశ్రమాన్ని వేసి, రెండు కప్పుల నీటితో కొంత సేపు మరగనివ్వండి. తరువాత అందులో మీరు ముందుగా  వేయించుకున్న గుడ్లను వేసి కాసేపు మూత పెట్టి ఉడికించండి. రుచికరమైన కొల్హాపురి గుడ్డు కూర తయారయినట్టే. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
100%
Like
0%
Not bad
0%
What?
scroll up icon