Link copied!
Sign in / Sign up
141
Shares

పిల్లలు గర్బంలో ఎదిగే క్రమం : పిండం నుండి శిశువు దశ వరకు పూర్తి వివరంగా, చిత్రాలతో సహా...

 

మీరు గర్భవతి అని తెలిసిన మరు క్షణం నుంచి, మీలో ఒక ప్రాణం ఎదగబోతుంది అనే భవన మిమ్మల్ని ఒక చోట నిలవనివ్వదు. మీలో బిడ్డ ఎదుగుదలను మీరు మాత్రమే స్పర్శతో అనుభవించగలరు. మీకు లోపల ఎం జరుగుతుందో తెలుస్తుంటుంది. కానీ వివరంగా కాదు. మీ కడుపులో పిండం, శిశువుగా ఎదిగే క్రమాన్ని పూర్తి వివరంగా అందిస్తున్నాం… 

1. గర్భం దాల్చడం

అండంలోకి స్పెర్మ్ చేరుకుని, ఫలదీకరణ జరుగుతుంది. తరువాత అండం గర్భాశయానికి అతుక్కుని ఎదగడం  ప్రారంభిస్తుంది.

2. మొదటి నెల

అండం మూడు భాగాలుగా విడిపోతుంది. ఆ మూడు భాగాలు ఛాతి, భుజాలు, తల భాగాలుగా ఎదగడం ప్రారంభిస్తాయి. ఈ దశలో పిండం కాయిల్ లా చుట్టుకుని ఉంటుంది.

3. రెండో నెల

ఈ దశలో గర్భంలో పిండం ఒక ఇంచు సైజు లో ఉంటుంది, అంటే సుమారు కిడ్నీ అంత. ఈ నెలలో పిండం ఎదగడానికి బలమైన ఆహారం తీసుకోండి.

4. మూడవ నెల

పిండం 2-3 ఇంచ్చులు ఉంటుంది. శిశువుగా రూపాంతరం చెందే దశ. కాలికి, చేతులకు, వేళ్ళు ఏర్పడుతాయి.

5. నాలుగవ నెల

గర్భాశయం విస్తరిస్తుంది. అంటే శిశువు ఎదుగుతున్నాడు అని అర్ధం. ఈ దశలో ఎముకలు ఏర్పడుతాయి, పిండం సుమారు 142 గ్రాముల బరువు ఉంటుంది. గుండే చప్పుడు మొదలవుతుంది.

6. ఐదవ నెల

కడుపులో శిశువు, 27 సెంటీమీటర్ల పొడగు ఉంటాడు. కనురెప్పలు, కనుబొమ్మలు, ఏర్పడుతాయి. కడుపులో కదలికలు తెలుస్తాయి. 

7. ఆరవ నెల

శిశువు లోపలి అవయవాలు, పూర్తిగా రూపు దిద్దుకుంటాయి. ఈ నెలలో అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేయించుకోవచ్చు.

8. ఏడవ నెల

శిశువు 400ల గ్రాముల బరువు పెరుగుతాడు. కదలికలు వేగంగా ఉంటాయి. కాలితో తన్నడం మొదలుపెడుతాడు.

9. ఎనిమిదవ నెల

పూర్తి శరీరం రూపు దిద్దుకుంటుంది. రెండు కేజీ ల బరువు ఉంటారు. ఒక వేళ నెల తక్కువ కంపు జరిగితే, కొంత పర్వేక్షణ అవసరం.

10.తొమ్మిదవ నెల

ఎప్పుడెప్పుడు బయటకు వచ్చేధ్ధామా అని ఎదురు చూస్తుంటాడు. మీరు కూడా డెలివరీకి పూర్తిగా సిద్దమయినట్టే… 

Click here for the best in baby advice
What do you think?
100%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon