Link copied!
Sign in / Sign up
37
Shares

మీ పిల్లలు బరువు తగ్గుతున్నారా..! అయితే వెంటనే ఈ 3 ఆహారాలను ఇవ్వండి..


కన్నతల్లికి బిడ్డంటే అపురూపం. బిడ్డకు దుస్తులు తొడగడం, తిండి పెట్టడంలో ప్రతి తల్లీ ఎంతో జాగ్రత్త తీసుకుంటుంది. మిగతా పిల్లలకంటే తన పాప లేదా బాబు నంబర్ వన్ గా ఉండాలని కోరుకుంటుంది. బిడ్డను ఇంత అపురూపంగా చూసుకునే అమ్మ ఆ బిడ్డలో శారీరకంగానో, ప్రవర్తనలోనో ఏమాత్రం మార్పు వచ్చినా ఆందోళన పడుతుంది. తట్టుకోలేదు. తల్లులందరూ ఇంతే. కానీ భయపడాల్సిన పనిలేదు. బరువు తగ్గడంవల్ల ఆరోగ్యపరంగా ఏవైనా పెద్ద మార్పులు వస్తే డాక్టర్ ను కలుసుకోవడం మంచిది. చిన్న చిన్న కారణాలవల్ల ఇలా జరుగుతుందని తెలుసుకోవాలి.

తిండి భయాలు

మరీ పసివాళ్లకు తిండి పెట్టడం కష్టమైన పనే. ఏ మారాం చేయకుండా తినడం చాలా అరుదు. ఒక్కోసారి బిడ్డల మూడ్ బాగుండదు. ఏడుస్తుంటారు.  ఎలాగోలా తినిపించాలని తల్లి ప్రయత్నిస్తుంటుంది. పిల్లలు ఇష్టం లేకుండా, తక్కువగా తింటే బరువు తగ్గడం మామూలే. ఆ వయసులో బరువు తగ్గడం అంత భయడాల్సిన, సీరియస్ విషయం కానే కాదు. బరువు తగ్గినంతమాత్రాన వాళ్ల ఆటపాటలకు ఇబ్బందేం ఉండదు. ఆ పరిస్థితి తాత్కాలికమే అని గ్రహించాలి.

వండర్ జీన్స్

పాప లేదా బాబు బాగా తింటారు. పౌష్టికాహారం ఇస్తాం. పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. కానీ బరువు మాత్రం పెరగరు. ఇలా ఎందుకు జరుగుతుందంటే ... వారసత్వంగా వచ్చే జీన్స్ ఇందుకు కారణం. శరీరాకృతి లేదా శరీరం బరువు అనేవి -- తలిదండ్రులు లేదా కుటుంబ సభ్యుల నుంచి వారసత్వంగా సంక్రమిస్తాయని సైన్స్ చెబుతోంది. కాబట్టి అనవసమైన భయాల్ని పక్కన పెట్టి పాపతో మురిపాలు, ముద్దు ముచ్చట్లు తీర్చుకోండి. ఈ రోజులు మళ్లీ మళ్లీ రావు.

చురుకైన బిడ్డ

కొందరు పిల్లలు బాగా చురుగ్గా ఉంటారు. కుదురుగా ఒక చోట ఉండరు. అసలు అలసిపోవడమనేది వాళ్ల డిక్షనరీలో ఉండదు. వాళ్ల జీవప్రక్రియ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటివాళ్లు జీవితంలో సంతోషంగా ఉంటారు. లైఫ్ ను పూర్తిగా ఎంజాయ్ చేస్తారు.

సరైన పద్ధతిలో తిండి పెట్టాలి

బిడ్డకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించినంత మాత్రాన సరిపోదు. దాన్ని సరైన పాళ్లల్లో, తగిన విరామాలతో ఇవ్వడం కూడా చాలా ముఖ్యం. పిల్లలకు తక్కువ పరిమాణంలో సమమైన విరామాలతో ---అంటే 3-4 గంటలకొకసారి తిండి పెట్టాలని డాక్టర్లు చెబుతున్నారు. ఆహారాన్ని ఇవ్వడంలో ఎక్కువ వ్యవధి ఇవ్వడం బిడ్డకు మంచిది కాదు. ఇందువల్లే చాలామంది పిల్లలు బరువు తగ్గుతుంటారు.

జీవక్రియ ప్రభావం

కొంతమంది పిల్లలు ఎక్కువ మెటబాలిక్ రేట్ (జీవక్రియ సామర్థ్యం) తో పుడతారు. వారు ఏ ఆహారాన్నయినా తిని అరిగించుకోగలరు. సులభంగా జీర్ణంకాని పదార్థాలు తిన్నా తొందరగా, సులభంగా జీర్ణమవుతుంది. రోజంతా ఏ పనీ చేయకపోయినా నాజూకుగా ఉంటారు. ఇందులో వారి తల్లి చేసేదంటూ ఏదీ ఉండదు. ఇంకా చెప్పాలంటే వారిని చూసి మిగతా పిల్లలు అసూయ పడతారు కూడా.

నీళ్లు తాగకుంటే బరువు తగ్గుతారు

మనం బతకడానికి, ఆరోగ్యంగా ఉండడానికీ నీరు ఎంత అవసరమో అందరికీ తెలుసు. పిల్లలు తగినంత నీరు తాగితే ఆరోగ్యంగా ఉంటారు. అలాగని వాళ్లకు ఎక్కువ నీటిని తాగించకూడదు. తిండి కూడా మానేసేలా నీళ్లు ఇవ్వకూడదు.

తల్లి పాలు – సీసా పాలు

తల్లి పాలు శ్రేష్టమని అంటారు. అది నిజమే. కానీ కొంతమంది పిల్లల

విషయంలో తల్లిపాలకన్నా సీసా పాలు ఉత్తమం. సీసాపాలు తాగేవారికన్నా తల్లిపాలు తాగే వారు చూడ్డానికి సన్నగా ఉంటారు.  అలాగని ఆందోళన పడక్కర్లేదు. బలమైన ఆహారం ఇస్తే చాలు.

ఆహారం ప్రభావం

మనం తీసుకునే ఆహారం ప్రభావం శరీరంపై ఉంటుంది. పీచుపదార్థం ఎక్కువగా ఉండే ఆహారం ఇవ్వడం మంచిది. అలా చేస్తే సంపూర్ణాహారం ఇచ్చినట్టవుతుంది. బేబీకి తక్కువ ప్రమాణం ఉన్న ఆహారం ఇవ్వడం వల్ల కూడా బరువు తగ్గడం జరుగుతుంది. బిడ్డకు పోషక విలువలున్న సమతుల్యమైన, రుచికరమైన తిండిని ఇవ్వడం అన్నింటికన్నా ఉత్తమం.

అనారోగ్యాలతో తగ్గే బరువు

పిల్లలు తరచు జలుబు, జ్వరం, వైరల్ ఫివర్ వంటి చిన్న చిన్న అనారోగ్యాలకు గురవుతుంటారు. అలాంటప్పుడు వాళ్లకు చికాగ్గా ఉంటుంది. తిండి తినేందుకు ఇష్టపడరు. అందువల్ల కూడా బరువు తగ్గుతారు. అయితే, క్రమంగా మళ్లీ పుంజుకుంటారు.

ఇన్ ఫెక్షన్స్

ఒక్కోసారి చిన్నపిల్లల కడుపులో నులి పురుగులు వంటివి పెరుగుతాయి. వీటివల్ల ఆకలి మందగిస్తుంది. పోషకాహారం తీసుకోనీకుండా అడ్డుకుంటాయి. దాంతో పౌష్టికాహార లోపం ఏర్పడి, పిల్లలు బరువు తగ్గుతారు. అలాంటప్పుడు పిల్లల డాక్టర్ కు చూపించడం మంచిది.

పుట్టిన తర్వాత బరువు తగ్గడం

చాలామంది పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని నెలలకు బరువు తగ్గుతారు. అలాంటి పిల్లలకు పోషక విలువలున్న పళ్లు, కాయగూరలు, పాలు, కాయధాన్యాలకు సంబంధించిన ఆహారం ఇస్తే వారిలో పెరుగుదల బాగుంటుంది. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon