Link copied!
Sign in / Sign up
0
Shares

పిల్లలు ఎక్కువ బరువుతో పుట్టడం, అధిక బరువుతో పెరగటం ప్రమాదమా..?


పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే తల్లితండ్రులు కూడా సంతోషంగా ఉండగలరు. పిల్లలు తక్కువ బరువుతో పుడితే ఎంత ఇబ్బందికరమో, పిల్లలు పసితనంలోనే వయస్సుకు మించిన బరువు ఉండటం కూడా అంతే ప్రమాదకరం అని చెబుతున్నారు. తాజాగా జరిపిన ఆరోగ్య పరిశోధనల ప్రకారం పిల్లల ఎక్కువ బరువు ఉండటం వలన ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందో ఇక్కడ తెలుసుకోండి..

ఊబకాయం వ్యాపిస్తోంది

వయస్సు ప్రకారం, ఎత్తు, ఉండాల్సిన బరువు కన్నా అధిక బరువు కలిగి ఉండటం, తక్కువ బరువు కూడా ఉండటం ఊబకాయానికి కారణం. పసిపిల్లలలో వచ్చే ఊబకాయం వారి ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతుంది. గుండె సంబంధిత సమస్యలు, బ్లడ్ ప్రెజర్, శ్వాస తీసుకోవడం కష్టమవడం, నడపటం, ప్రాకటం కూడా పిల్లల ఆరోగ్యానికి ప్రమాదకరం..

సంవత్సరానికి రెండు రెట్లు పెరుగుతున్న బరువు

ఇటీవల జరిపిన ఆరోగ్య పరిశోధనల ప్రకారం 6 నుండి 19 ఏళ్ళ వరకు దాదాపు 16 % అధిక బరువు పెరుగుతున్నారని తెలిసింది. ఇది కొన్ని దేశాలలో ఐతే రెండు రెట్లు అధికంగా ఉంది. ఇలా ఐతే వచ్చే నాలుగు సంవత్సరాలలో బరువు డబుల్ అయ్యే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు.

మగపిల్లలతో పోల్చితే ఆడపిల్లలలో

మనదేశంలో జరిపిన పిల్లల బరువు మరియు ఆరోగ్యం ప్రకారం 15 % పిల్లలు ఊబకాయం సమస్యతో బాధపడుతున్నట్లు తెలిసింది. అంటే తమ బరువును తామే భరించలేని పరిస్థితి. దీని కారణంగా గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. పసి వయస్సులో ఊబకాయం ఉండటం వలన పదేళ్లు వచ్చేసరికి ఆడపిల్లలలో ఎద భాగం ముందుగా వచ్చినట్లుగా ఉండి, పొట్ట ఎక్కువగా ఉండటం బాధిస్తుంది.

ఎదురయ్యే ప్రమాదాలు

పసితనం నుండే అధిక బరువు ఉండటం వలన వయస్సు పెరిగే కొద్దీ ఆడపిల్లలలో ఐతే ఋతుచక్రం సరిగ్గా సరైన సమయానికి జరగకపోవడం, గర్భాశయ సమస్యలు, ఎముకలు బలహీనంగా ఉండటం, పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా లేకపోవడం జరిగే పరిణామాలుగా సూచిస్తున్నారు. అధిక బరువు పెరగకుండా పోషక విలువలు బాగా ఉన్న ఆహారం అలవాటు చేయడం, జంక్ ఫుడ్ ను దూరం చేయడం మంచిది.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon