Link copied!
Sign in / Sign up
1
Shares

పిల్లలు ‘డౌన్ సిండ్రోమ్’ తో ఎందుకు పుడతారు? లక్షణాలు ఎలా ఉంటాయి?

మీరు కొంతమంది పిల్లలను బాగా గమనించినట్లయితే బుద్ధిలోపం, శారీరక, మానసిక ఎదుగుదల లోపం ఆగిపోవడం, ఇతర పిల్లలు ఎంతో ఆక్టివ్ గా ఉంటే ఈ పిల్లలు ఒకేచోట దిగాలుగా ఏమీ చేయలేనట్లుగా కూర్చుని ఉండటం, తెలివితేటలు (ఐక్యూ) కూడా తక్కువగా ఉంటుంది.  వీటినే వైద్య భాషలో ‘డౌన్ సిండ్రోమ్’ అని పిలుస్తారు. డౌన్ సిండ్రోమ్ లక్షణాలు ఎలా ఉంటాయి, వీటికి కారణాలు ఏంటో ఇక్కడ వివరంగా తెలుసుకోండి.

డౌన్ సిండ్రోమ్ అంటే ఏమిటి?

సాధారణంగా మన శరీరంలో ఉండే క్రోమోజోము 21లో రెండు పోగులుగా ఉంటాయి. అలా కాకుండా కొందరిలో మూడు పోగులుగా ఉండటం జరుగుతూ ఉంటుంది. దీనినే డౌన్ సిండ్రోమ్ అని వైద్య భాషలో పిలవడం జరుగుతోంది. వీరి ముఖంలోని మార్పుల వలన, ప్రవర్తించే తీరు, తెలివి తేటల వలన డౌన్ సిండ్రోమ్ పిల్లలను గుర్తించవచ్చు. ముఖ్యంగా మానసిక, శారీరక ఎదుగుదల విషయంలో తెలుస్తుంది.

పిల్లలలో డౌన్ సిండ్రోమ్ కారణాలు

నిజానికి ఇది భయపడాల్సిన జబ్బు కాకపోయినా పిల్లలు ఇలా పుట్టడానికి కారణం తల్లితండ్రులే అని చెబుతున్నారు వైద్యులు. వయస్సు దాటిన తర్వాత పెళ్లి చేసుకోవడం, లేటు వయస్సులో పిల్లలను కనటం (అంటే 35 ఏళ్ళ పై బడ్డ తర్వాత) లేదా 35 ఏళ్ళ గర్భం దాల్చడం వలన పుట్టబోయే పిల్లలలో బుద్ధిలోపం, మానసిక, శారీరక ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. అందరి పిల్లలలో అని కాదు గానీ కొంతమందిలో జరిగే ప్రమాదం ఉంది.

డౌన్ సిండ్రోమ్ లక్షణాలు ఎలా ఉంటాయి?

జన్యు సంబంధమైన ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే ముక్కు సరిగ్గా ఉండకపోవడం, సరిగ్గా వినిపించకపోవడం, మతిమరుపు, కాలి బొటన వేలిలో మార్పులు, కళ్ళు సరిగ్గా కనిపించకపోవడం, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, పుట్టుకతోనే గుండె సంబంధిత సమస్యలు, త్వరగా ఏ విషయాన్ని చెప్పలేకపోవడం, ఎముకలు బలహీనంగా ఉండటం ఈ వ్యాధి లక్షణాలు.

ప్రగ్నన్సీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ప్రస్తుతం ఈ వ్యాధి గురించి పెద్ద భయపడాల్సిన అవసరం ఏమీలేదని అంటున్నారు వైద్యులు. ఎందుకంటే గర్భంతో ఉన్నప్పుడు ఈ వ్యాధి గురించి తెలుసుకోవచ్చట. అలా కొందరికి అబార్షన్స్ కూడా జరిగాయి. ఐతే సరైన పోషక ఆహారం తీసుకోవడం, 35 ఏళ్ళ తర్వాత పిల్లలకు జన్మను ఇచ్చేవారు ఆ సమయంలో కేర్ ఫుల్ గా ఉంటే మంచిది. అలాగే ఈ వ్యాధితో పుట్టిన పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటూ తమ పనులను తామే చేసుకోగలుగుతున్నారు. మనదేశంలో ఈ వ్యాధి తీవ్రత తక్కువగానే ఉంది.

ఈ విషయాలను అందరికీ చేరేలా SHARE చేయగలరు.  

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon