Link copied!
Sign in / Sign up
9
Shares

మీ పిల్లలు ఈ 5 పనులు చేస్తే మీకు చాలా బాగా నచ్చుతారు : మరి మీ పిల్లలు ఇలా చేస్తున్నారా..!

 

మనం మన పిల్లల్ని ఎంతో ప్రేమిస్తాం. అందమైన మన పిల్లల గురించి అందరికీ గొప్పగా చెబుతాం. అయితే పిల్లలతో మరింత దగ్గరగా ఉండాలంటే, వాళ్లు మనకు  ఇంకా దగ్గర కావాలంటే ఏంచేయాలి? మనం ఏది చేస్తే దాన్ని పిల్లలు అనుకరిస్తారు. చక్కగా రియాక్ట్ అవుతారు. ఏం చేస్తే వాళ్లు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం.

1. బొటనవేలు పట్టుకుంటే

మీ పాపను ఒళ్లో కూచోబెట్టుకుని చేత్తో కాస్త ఎత్తి పట్టుకొని ఉంచండి. తల కాస్త వెనక్కు వాలి ఉండేలా చూసి, చేతులు పైకి లేపి బొటనవేలును పట్టుకోండి. ఆ స్పర్శ గ్రహించి పాపకూడా రియాక్ట్ అవుతుంది. మిమ్మల్ని పట్టుకుంటుంది. దీన్ని మోరో రిలాక్స్ పద్ధతి అంటారు. పుట్టిన వెంటనే బిడ్డలు ఇలా చేస్తారు. 4 లేదా 6 నెలలకు మరిచిపోతారు.

2. తల ఒక వైపు తిప్పితే

బేబీ తలను వెనకవైపు నుంచి ఒకవైపు తిప్పండి. అప్పుడు ఆ బేబీ తన చేతిని ఒక వైపు చాపి, తల తిప్పుతుంది. మరో చేతిని కూడా ఆడిస్తుంది. ఈ చర్యను టానిక్ నెక్ రిఫ్లెక్స్ అంటారు. వారిలో ఈ స్పందన 4 నుంచి 6 నెలల వరకు ఉంటుంది.

3. స్కై డైవింగ్

మీరు సడెన్ గా మీ బిడ్డ నడుము నుంచి మీ చేతిని తీసేసి, కాస్త కిందికి జరపండి. కిందకి పడిపోతున్నట్టు, గాలిలో తేలిపోతున్నట్టు పాప భయపడుతుంది. వెంటనే మీ బిడ్డ రక్షణకోసం మీ చుట్టూ చేతులు వేస్తుంది. బిడ్డకు కలిగే ఈ స్పందనను పారాచూట్ రిఫ్లెక్స్ అంటారు. మీ పాప నడక ప్రారంభించే ముందు ఇలా చేస్తుంది.

4. సెల్ఫీ

మీ బిడ్డ బుగ్గను చిన్నగా తట్టండి. వెంటనే బిడ్డ ఆవైపు తిరుగుతుంది. ఎక్కడ మీరు తట్టారో అక్కడ తడుముకుంటుంది. తల్లి తనకు పాలిస్తున్నట్టు ఫీలవుతుంది. పిల్లల్లో ఈ చర్య సాధారణంగా 4-6 నెలల మధ్య ఉంటుంది. ఈ రియాక్షన్ ను రూటింగ్ రిఫ్లెక్స్ అంటారు.

5. ఫాన్ అవుట్

మీ పాప కాలి మీద స్థిరంగా తడితే బేబీ తన కాళ్లను చాపుతుంది. అలా చాపడం చూస్తే చిన్న ఫ్యాన్ తిరిగినట్టు ఉంటుంది. ఈ రియాక్షన్ ను బాబిన్ స్కి రిఫ్లెక్స్ అంటారు. బిడ్డకు 9 నెలలు వచ్చేవరకూ ఇలా చేస్తూనే ఉంటుంది.

పిల్లల చేష్టలు ఎలా ఉంటాయి? ఎందుకలా చేస్తారు? ఆ చేష్టల్లో రహస్యమేంటి అన్నది ఇప్పటికి అర్థమై ఉంటుంది. ఇప్పుడు మీరు మీ బిడ్డ ముద్దు ముద్దు కదలికల్ని మీ కెమెరాలో బంధించండి. ఇలాంటి చిన్న చిన్న భంగిమలు మీ బిడ్డ పెరిగేందుకు బాగా తోడ్పడతాయి.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon