Link copied!
Sign in / Sign up
24
Shares

పిల్లలు అమ్మనాన్నల నుండి కోరుకునే టాప్ 10 విషయాలు : ఇలా చేస్తే చాలా సంతోషంగా ఉంటారు

చిన్న పిల్లల మనస్సు చాలా సున్నితమైనది, వారు మాట్లాడే ప్రతి మాట తల్లితండ్రులకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. బుజ్జిబుజ్జిగా మాట్లాడుతూ, ఇళ్లంతా తిరుగుతూ సందడి చేస్తుంటే తమ ఇంట్లో తెలియని సందడి సంతోషాలు వెల్లివిరుస్తుంటాయి. అయితే ప్రస్తుత బిజీ గజిబిజి జీవితంలో చాలామంది ఉద్యోగం, సంపాదనలో పడి పిల్లలతో తగినంత సమయాన్ని గడపలేకపోతున్నారు. కాగా ఇక్కడ చెప్పుకునే ఈ 10 విషయాలు పిల్లలు తమ అమ్మనాన్నల నుండి కోరుకుంటారు. నిజంగా, ఇలా మీరు పిల్లలతో గడిపితే వారి తెలియని సంతోషం ఉత్సాహం కలుగుతాయి. అవేంటో మీరే చూడండి..

ఆడుకోవడం 

సాధారణంగా పల్లెలలో అయితే పిల్లలతో ఆడుకోవడానికి పొరుగింటివారు, పక్కింటివారు అంటూ అంతా ఒకచోట కలిసి ఆడుకుంటూ ఉంటారు. అదే టౌన్, సిటీలలో పక్కింట్లో ఎవరున్నారో కూడా తెలియదు. అందుకని మీరు పిల్లలతో పాటు కలిసి బయటకు వెళ్లడం, ఇంట్లోనే కలిసి వారు ఆడుకోవడాన్ని పిల్లలు కోరుకుంటారు. గ్రౌండ్ లేదా పార్క్ లకు పిల్లలను తీసుకువెళ్లి ఆట్లాడిపించడం వలన వారిలో ఉత్సాహం మరింత పెరుగుతుంది. 

రాత్రి పడుకునేముందు 

ప్రతి రోజూ రాత్రి పడుకునేముందు పిల్లలను ఒంటరిగా పడుకోబెట్టకుండా ఒక అరగంట పాటు వారితో ఉండటం పడుకోబెట్టి పాటలు పాడటం లేదా మీరు చిన్నప్పుడు విన్న మంచి కథలు చెప్పడం చేయాలి. ఈ విధంగా చేసినట్లయితే పిల్లలు హాయిగా నిద్రిస్తారు. పిల్లలను చిన్నతనం నుండే ఒంటరిగా పడుకోబెట్టడం వలన ఒంటరితనంగా ఫీలవుతారు.

అక్క అన్నలతో కాకుండా..

ఇంట్లో చిన్నపిల్లలున్నప్పుడు ఎక్కువ సమయం తమతోనే అమ్మనాన్నలు ఉండాలని ప్రతి చిన్నారులు కోరుకుంటారు. ఇలా వారు కోరుకోవడంలో తప్పేమీ లేదు. అందుకని ఇంట్లో పెద్ద పిల్లలతో కాస్త తక్కువ సమయం గడుపుతూ చిన్నారులతో ఎక్కువసేపు మాట్లాడం, వారితో పాటు ఉండటం చేయాలి. 

ముద్దులు పెట్టడం

చిన్నారులను మీరు ఎంత దగ్గరగా తీసుకుని మనస్సు విప్పి వారితో మాట్లాడేటప్పుడు మీరు కూడా చిన్నారులగా ఉండటం చేయాలి. పిల్లలకు ముద్దులు పెట్టడం, నువ్వంటే నాకు చాలా ఇష్టం నాన్నా, బుజ్జి అంటూ దగ్గరకు తీసుకోవడాన్ని అమ్మనాన్నల నుండి పిల్లలు ఇష్టంగా కోరుకుంటారు. 

ఆహారం 

పిల్లలు ఎప్పుడు ఒకే ఆహారాన్ని తినడానికి చాలా బోర్ గా ఫీలవుతూ ఉంటారు. వారికి ఆరోగ్యాన్ని, బలాన్ని ఇస్తూ వారి ఎదుగుదలకు ఉపయోగపడే న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వడం చేయాలి. రెండు రోజులకు ఒకేసారి ఒకే ఆహారాన్ని ఇస్తున్నప్పుడు కాస్త వెరైటీగా తయారుచేసి ఇవ్వాలి. 

స్కూల్, ఫ్రెండ్స్ గురించి..

అమ్మనాన్నలు అయిన తర్వాత ప్రతి ఒక్కరికీ చాలా ఓపిక అవసరం. పిల్లలు ఏం చేస్తున్నారు, ఎటువంటి విషయాలు ఇష్టపడుతున్నారు అనే సంగతులను తప్పక గమనిస్తూ ఉండాలి. అలాగే పిల్లల స్కూల్ గురించి, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, వారికి నచ్చిన ఆటలు..ఇలా ప్రతి విషయాన్ని అడిగి తెలుసుకోవడం వలన చాలా హ్యాపీగా ఫీలవుతారు. ఇవి పెద్దలకు చిన్న విషయాలే కావచ్చు కానీ, మీ పిల్లలకు ఇవే సంతోషాన్ని ఇచ్చే సంగతులు. 

క్రమశిక్షణ నేర్పించడం 

'మొక్కై వంగనిది మానై వంగునా..' అనే సామెత అందరికీ తెలిసే ఉంటుంది. అంటే పిల్లలకు అమ్మనాన్నలు చిన్నతనం నుండే క్రమశిక్షణ నేర్పించడం చాలా అవసరం, లేకపోతే పెరిగి పెద్ద అయ్యేకొద్దీ వారి జీవితం ఎటు వెళ్తుందో చెప్పడం చాలా కష్టం. ఆ తర్వాత మీరు బాధపడటం, తమ జీవితం సరైన దారిలో వెళ్లలేదని పిల్లలు బాధపడటం వల్ల ఏమీ రాదు. పిల్లలకు డిసిప్లైన్ నేర్పడం వలన ఇతర అమ్మానాన్నలలాగే నన్ను  చాలా కేరింగ్ గా మా పేరెంట్స్ చూసుకుంటున్నారనే ఫీలింగ్ వారికి కలుగుతుంది. 

వారితో కలిసి ఇలా.. 

పిల్లలతో వీకెండ్ సమయాలలలో, సెలవులప్పుడు వారితో కలిసి ఎక్కువగా ఉండాలి. ఉదాహరణకు వారికి నచ్చిన టీవీ సీరియల్ కార్టూన్స్ లేదా సినిమాలను ల్యాప్ టాప్ లేదా మొబైల్ లో చూపిస్తూ వారికి దగ్గరగా ఉండటం వలన వారికి చాలా ఆనందాన్ని ఇచ్చిన వాళ్లవుతారు.  ఉదయాన్నే తమ ఫ్రెండ్స్ తో నేను మా అమ్మానాన్న రాత్రి నాకు నచ్చిన కార్టూన్స్, సీరియల్ చూసి ఎంజాయ్ చేశాం తెలుసా..అంటూ ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. 

నిజానికి ఇవి ప్రతి అమ్మనాన్నలకు చాలా చిన్న విషయాలే కావచ్చు గానీ, చిన్న పిల్లలకు మాత్రం ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప సంతోషాలు మరియు మధురానుభూతులు. ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి.. ఇందులో మీరు మీ పిల్లలతో ఏమైనా చేస్తుంటే కామెంట్ చేయండి.. 

Cover Image Source : South Film Stars

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon