Link copied!
Sign in / Sign up
3
Shares

పిల్లలు అబద్దాలు ఆడకుండా ఉండాలంటే ఎలా?


పిల్లలు అన్నాక మంచి కన్నా చెడ్డ అలవాట్లను త్వరగా పట్టేసుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులుగా వారికీ అలవాటు అయినా చెడును ఇంక పెరగకుండా అక్కడితో  ఆగేలా చూడటం మన బాధ్యత. చెడు విషయాల సంగతి లో పిల్లలతో గనక మనం సరిగ్గా ప్రవర్తించక పోతే అది దారుణాలకు దారి తీస్తుంది.

ఎంత త్వరగా పిల్లలకి నిజం అనే విలువను వారిలో నేర్పిస్తే అంత మంచిది. పిల్లలకి మంచి మంచి కధల పుస్తకాల ద్వారా లేదా మంచి మతాల ద్వారా వారికీ నేర్పించాలి. అబద్దాలు అనేది అలవాటుగా మారె ముందే మనం దానిని ఆపేయాలి.

1.బహుమతి 

నిజం చెప్పిన ప్రతిసారి పిల్లలకి తప్పకుండ ఏదైనా బహుమతి ఇవ్వండి. ఇలా చేయడం వలన వారు సంతోషిస్తారు మరియు అబద్దాల జోలికి వెళ్లకుండా ఉంటారు.

2. నిజం సులభం 

మీ పిల్లలకి ప్రేమగా నెమ్మదిగా చెప్పండి. వారికి అబ్బదాలకన్నా నిజం మిన్న అని అర్ధం అయ్యేలా చెబుతూ ఉండండి. అబ్బదం ఆడడం కన్నా నిజం చెప్పడం సులభం అని వారికీ అర్ధం అయ్యేలా చెప్పండి.

3. మీరు చేయకండి 

మీ పిల్లల ముందు మీరు చిన్న అబ్బధాలు కూడా ఆడకుండా చూసుకోండి. వాళ్ళ ముందు గనక మీరు ఆలా చేస్తే వారికీ నిజం చెప్పాలని ఎలా అనిపిస్తుంది చెప్పండి? మనలాగే కదా మన పిల్లలు కూడా ఉంటారు. కొన్ని సందర్భాలలో నిజం చెప్పకపోయినా పర్లేదు అనే భావన వారిలో కలిగితే ఎటువంటి సమయం లో నిజం చెప్పాలో వారికీ అర్ధం కాకుండా పోతుంది.

4. ఈరోజే చెప్పండి 

 అబద్ధాలకోరు మరియు ఎటువంటి ఇతర పదాలు ఉపయోగించి ఏ రోజు కూడా పిల్లలకి మంచి చెబుదాము అని అనుకోవద్దు. ఇది సరైన తీరు కాదు. మీరు అలంటి చెడు పదాలు ఉపయోగిస్తే పిల్లలు కూడా మిమల్ని చూసి నేర్చుకుంటారు కదా అలంటి మాటలు.

5. కోప్పడకండి 

ఒకవేళ మీ పిల్లలు గాని మీతో అబ్బద్దాలు ఆడితే వెంటనే కోప్పడి వారిని సరిచేయడం వంటివి చేయకండి. ఇది ఇంకా నష్టాన్నే ఏర్పరుస్తుంది. బదులుగా వారికీ సరైనది ఏమిటో తప్పు ఏమిటో అర్ధం అయ్యేలా రీతిలో సహనం తో మంచిగా చెప్పండి.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon