Link copied!
Sign in / Sign up
2
Shares

పిల్లలలో వచ్చే పాక్షిక పక్షవాతం (సెరిబ్రల్ పాల్సి) గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు


మెదడు అరచేతిలో పట్టేంత ఉంటుంది, అరకిలో బరువు ఉంటుంది. కానీ మన మొత్తం శరీరంలో ముఖ్యమైన భాగం. మన శరీరంలో జరిగే ప్రతి కదలికను, మనం చేసే ప్రతి ఆలోచనను, మన మెదడు నిర్ధేస్తుంది. మెదడుకు కలిగే ఏ ప్రమాదమైన, చేసే ఏ జబ్బు అయినా మొత్తం శరీరం మీద ప్రభావం చూపిస్తుంది. పిల్లలు ఎదుగుదలలో, మెదడు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే పిల్లలు ఎదిగే క్రమంలో మెదడు జబ్బులు వచ్చే అవకాశం ఉంది. పాక్షిక పక్షవాతం (సెరిబ్రల్ పాల్సి - cerebral palsy) -‘ పక్షవాతాన్ని కలిగించే మెదడు జబ్బు’ అలాంటిదే. దాని కారణాలు, కలిగే సమస్యలు ఇక్కడ తెలుసుకోండి…..

1. శిశువు పుట్టకముందు ఈ జబ్బు రావడానికి కారణాలు (Prenatal Causes)

పిల్లలలో సెరిబ్రల్ పాల్సి కొన్ని సార్లు కడుపులో ఉండగానే రావచ్చు. దానికి కారణాలు ఇవే…

A.కడుపులో పిండం, రేడియేషన్ (Radiation)కు గురవడం.

B.ప్రెగ్నన్సీ అప్పుడు కలిగే ఇన్ఫెక్షన్లు

C.హైపోక్సియా (Hypoxia), మెదడుకు ఆక్సిజన్ సరిగా అందకపోవడం.

2.శిశువు పుట్టిన తరువాత ఈ జబ్బు రావడానికి కారణాలు (Postnatal Causes)

పిల్లలలో సెరిబ్రల్ పాల్సి, పుట్టిన తర్వాత రావడానికి కారణాలు, శిశువు జననం అప్పుడు జరుగుతాయి.

A.శిశువు కడుపులో నుంచి బయటకు వచ్చేటప్పుడు తలకు గాయం అవడం(Head trauma)

B.పిల్లలు పుట్టేటప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ జరగడం

C.హైపోక్సియా (Hypoxia), మెదడుకు ఆక్సిజన్ సరిగా అందకపోవడం.

3.జన్యువులు కూడా కారణం

పిల్లలలో సెరిబ్రల్ లాప్సి కొన్ని సార్లు, జన్యు పరమైన కారణాల వలన కూడా, వచ్చే అవకాశం ఉంటుంది. తల్లితండ్రుల్లో కానీ, కుటుంబంలో కానీ, ఎవరికైనా జన్యుపరమైన లోపాలు ఉంటే, పిల్లలకు సెరిబ్రల్ లాప్సి రావచ్చు.

4.సెరిబ్రల్ లాప్సి మూడు రకాలు

A.స్పాస్టిక్ సెరిబ్రల్ పాల్సి (Spastic Cerebral Palsy)

ఎక్కువ మందికి వచ్చే సెరిబ్రల్ పాల్సి ఇదే. సెరిబ్రల్ పాల్సి వచ్చిన వాళ్ళలో 70% శాతం మందికి స్పాస్టిక్ సెరిబ్రల్ లాప్సి అయ్యివుంటుంది. దీనివలన కండరాలు కదలలేనంత గట్టి పడిపోతాయి.

B.డిస్‘కైనెటిక్ సెరిబ్రల్ పాల్సి (Dyskinetic Cerebral Palsy)

మెదడులో బాసెల్ గాంగ్లియా (Basal Ganglia) అనే భాగం ప్రభావితం అయితే, డిస్‘కైనెటిక్ సెరిబ్రల్ పాల్సి. కదలికల మీద శరీరానికి కంట్రోల్ ఉండదు.

C.అటాక్సిక్ సెరిబ్రల్ పాల్సి (Ataxic Cerebral Palsy)

సెరెబెల్లుమ్ (cerebellum ) మీద కలిగే ప్రభావం వలన అటాక్సిక్ సెరిబ్రల్ పాల్సి వస్తుంది. దీని వలన శరీరం ఎప్పుడు వణుకుతూ ఉంటుంది.

5.సెరిబ్రల్ లాప్సి లక్షణాలు (Symptoms)

A.కండరాలు కదిలించేటప్పుడు నొప్పిగా ఉంటుంది.

B.ఆహారం నమలడం, మింగడం కష్టంగా ఉంటుంది.

C.నిద్రపోవడం కష్టంగా ఉంటుంది.

D.మనం చెప్పింది అర్ధం చేసుకోడం, కొత్త విషయాలు నేర్చుకోవడం కష్టంగా ఉంటుంది.

 

మీ ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళండి.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon