పసి పిల్లలలో మలబద్ధకం పూర్తిగా నయం చేయడానికి 4 సులభమైన చిట్కాలు
మీ పిల్లలు ఉదయం మోషన్ కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారా? ఆకలి సరిగా కావటం లేదా? అయితే మీ పిల్లలకు మలబద్దకం (Constipation) సమస్య ఉంది. పిల్లలలో మలబద్దకం తీవ్రంగా మారితే కొన్ని అనారోగ్యాలకు, ఎదుగుదల లోపాలకు కారణం అవుతుంది. పిల్లలు తీసుకునే ఆహారంలో మార్పుతో మలబద్దకం నయం చేయచ్చు. మీ పిల్లలకు రోజు తినిపించే ఆహారంలో ఈ చిట్కాలతో కొన్ని మార్పులు చేయండి…
1.పండ్ల రసాలు, ద్రవాలు ఎక్కువగా ఇవ్వండి
పిల్లలకు రోజుకు కావాల్సిన నీరు తాగేలా చుడండి. తక్కువ నీరు తాగడం వలన అరుగుదల మందగిస్తుంది. అలాగే సాలిడ్ ఫుడ్ తో పాటు ఫ్లూయిడ్స్ కూడా ఇవ్వాలి. వివిధ పండ్ల రసాలు, కొబ్బరి నీళ్ళు, జావ, సూప్స్ ఇలా ఆరోగ్యకరమైన ద్రవాలు ఇస్తు ఉండాలి. ఇవన్నీ అరుగుదల శక్తిని పెంచి మలబద్దకాన్ని నయం చేస్తాయి.
2.పీచు పదార్ధాలు తినిపించండి
పిల్లలకు ఫైబర్ (పీచు పదార్ధం) ఎక్కువగా ఉండే ఆహారం ఇవ్వాలి. పీచు పదార్ధాలు ఎక్కువగా ఉండే ధాన్యాలు, పప్పు దినుసులు తినిపించండి. ఇవి పిల్లలకు కావాల్సిన పోషకాలను అందిస్తాయి దాన్తోపాటు అరుగుదలను కూడా పెంచుతాయి.
3.తృణధాన్యాలు ఇవ్వడం ప్రారంభించండి
పిల్లలకు కేవలం తెల్ల అన్నం మాత్రమే కాకుండా జొన్నలు, రాగులు, గోధుమలు, ముడి బియ్యం, సజ్జలు లాంటి తృణధాన్యాలను కూడా మీ పిల్లల ఆహారంలో చేర్చండి. వీటిలో పుష్కలంగా ఉండే పీచు మలబద్దకాన్ని నయం చేస్తుంది.
4.పండ్లు తినిపించండి
ఆపిల్, పియర్, అరటిపండు, బొప్పాయి, ద్రాక్ష, జామపండ్లు వీటన్నిటిలో విటమిన్స్ తో పాటు పీచుకూడా అధికంగా ఉంటుంది. అందుకే ఎక్కువ పండ్లను మీ పిల్లల ఆహారంలో చేర్చండి. ఆపిల్, పియర్ లాంటి పండ్లను తొక్క తీసి, స్టీమ్ చేసి, పాలతో మెత్తగా కలిపి తినిపించచ్చు. పిల్లలు ఇష్టంగా తింటారు.
5.ఆకుకూరలు, కూరగాయలు
తోట కూర, పాల కూర, చుక్క కూర, పొన్నగంటి లాంటి ఆకుకూరలను పిల్లల రోజు తినే ఆహారంలో తప్పకుండా ఉండాలి. అలాగే బీన్స్, క్యారెట్, పీస్, బీట్రూట్, లాంటి కూరగాయలు కూడా పిల్లల చేత తినిపించండి. ఇవ్వన్నీ మలబద్దకాన్ని నయం చేస్తాయి.
6.అజీర్తి చేసినప్పుడు గ్లాస్ పాలు తాగించి చూడండి
పిల్లలకు అజీర్తి లేదా లూస్ మోషన్స్ చేసినప్పుడు ఒక గ్లాస్ పాలు తాగించండి. ఒక్కోసారి పిల్లలు రోజు తాగే పాలు వాటిని నయం చేస్తుంది.
7.మైదాతో చేసిన పదార్ధాలు ఇవ్వకండి
మైదాతో చేసిన బజ్జిలు, పకోడీలు, లాంటివి పిల్లలకు ఎక్కువగా తినిపించకండి. అవి పిల్లలకు సరిగా అరగవు. పిల్లలకు కడుపునొప్పిని, మలబద్దకాన్ని కలిగిస్తాయి. అలాగే పిజ్జా,బర్గర్ లాంటి ఫాస్ట్ ఫుడ్స్ కూడా ఎక్కువగా ఇవ్వద్దు.
