Link copied!
Sign in / Sign up
42
Shares

పిల్లలలో ఆకలిని పెంచి ఆరోగ్యాన్ని కాపాడే అద్భుతమైన 5 ఆహార పదార్థాలు

నెలల చంటిపిల్లల నుండి వయసు పెరిగే కొద్దీ పిల్లలకు ఎటువంటి ఆహారాన్ని తినిపించాలి? ఎటువంటి ఆహారాన్ని పిల్లలు ఇష్టపడతారు? పిల్లలలో ఆకలిని పెంచే ఆహార పదార్థాల గురించి కొత్తగా బిడ్డకు జన్మనిచ్చిన తల్లితండ్రులకు వచ్చే ప్రశ్నలు. ఐతే కొందరు పిల్లలు మాత్రం వారికి ఇష్టమైన ఆహారాన్ని ఇస్తున్నా సరే తినడానికి ఇష్టపడరు. అందుకని ఇక్కడ పిల్లల ఆకలిని పెంచే ఆ ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకుందాం..

చిరు తిండ్లు 

నెలల బాబు/పాపకు తల్లి పాలు మంచిదని అందరికీ తెలిసిందే. సంవత్సరం లేదా రెండేళ్లు నిండిన పిల్లలు ఆహారం తీసుకోవడానికి ఇష్టపడరు.  అయితే చిరు తిండి తినడానికి మాత్రం ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ముందుగా చిరుతిండికి వారిని దూరం పెట్టడం వలన సరైన ఆహారం తీసుకోవడానికి ఇష్టపడతారు.

పండ్ల రసాలు 

పిల్లల వయసు పెరుగుతున్న కొద్దీ తల్లిపాలను వీలైనంత వరకు తగ్గించి వారికి ఆకలిని పెంచే ఆహార పదార్థాలపై దృష్టిని మళ్లించాలి.

అందుకని ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ లను డైరెక్ట్ గా కాకుండా వాటికి నీరు, పాలు, వెన్న కలిపి ఇవ్వడం వలన ఇష్టంగా తింటారు. ఫ్రూట్ జ్యూస్ లను ఇష్టపడని పిల్లలకు ఆపిల్, బనానా, జామ, సపోటా పండ్లను చిన్న చిన్న ముక్కలుగా అందంగా కోసి ఇస్తే ఇష్టంగా తింటారు.

పోషక పదార్థాలు 

చాలామంది తల్లితండ్రులు పిల్లలకు పోషకాహార పదార్థాలను తినిపించాలని తెలుసు కానీ ఆ పోషక పదార్థాలు అంటే మాత్రం తెలియదు. వాల్ నట్స్, డ్రై ఫ్రూట్స్, ఎగ్, వెన్న రాసిన చపాతీలు, బాదం పప్పు, నువ్వులతో చేసిన ఆహార పదార్థాలు పిల్లలకు ఆకలి వేయడానికే కాకుండా మంచి ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.

బలవంతం చేయకండి 

పిల్లలైనా పెద్దలైనా సరే ఆకలి వేసినప్పుడే తినడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా పిల్లలకు ఒకే సమయానికి తినాలి అని బలవంతంగా ఆకలి కలుగకున్నా తినిపించడం వలన వారు ఆహారం తీసుకోవడానికి ఇష్టపడరు కాబట్టి బలవంతం చేయకూడదు. పెద్దలు తింటున్నప్పుడు లేదా వేరే వాళ్ళు తింటున్నప్పుడు ఆకలికి మారాం చేస్తుంటారు కాబట్టి అటువంటి సమయాలలోనే తినిపించడం చేయాలి.

ఆకలిని పెంచడానికి 

పిల్లలకు వికారం వాంతుల కారణంగా ఆకలి కలగకపోవడానికి ఒక కారణం కాబట్టి ఆకలిని పెంచడానికి ఇసి బాగా ఉపయోగపడుతుంది. ముందుగా ఒక పావు కిలో బియ్యం, ఇరవై గ్రాముల శొంఠి మరియు రెండు గ్రాముల మిరియాలు తీసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక బాక్స్ లో దీన్ని నిల్వ ఉంచుకోవాలి. దీనిని ప్రతిరోజూ ఒక స్పూన్ ఒక గ్లాస్ నీటిలో కలిపి ముద్దలుగా అయ్యేలా ఉడికించాలి. దీనికి కాస్త ఆవు నెయ్యి కలిపి ముద్దలుగా చేసుకోవాలి. ఐతే కొందరు పిల్లలు తియ్యగా ఉంటే తింటారు కాబటి వారికి పటికబెల్లం కలిపి పెట్టవచ్చు, అలా ఇష్టపడని వారికి కొద్దిగా సాల్ట్ కలిపి తినిపిస్తే ఆకలి పెరుగుతుంది.

అరటిపండు

ఆకలి మందగించిన పిల్లలకు అరటిపండును బాగా గుజ్జుగా చేసుకుని తినపించవచ్చు లేదా అందులో కాస్త పాలు, కొంచెం చక్కర కలిపి తినిపించిన ఎంతో ఇష్టంగా తింటారు.

జీర్ణం అయ్యే ఆహారం 

పిల్లలకు ఎప్పుడైనా త్వరగా జీర్ణం అయ్యే ఆహార పదార్థాలను మాత్రమే తినిపించాలి. లేకపోతే కడుపునొప్పి, వాంతులు, వికారం సమస్యలు తలెత్తుతాయి. నూనె, మసాలా పదార్థాలను కొన్ని రోజుల వరకు దూరంగా ఉంచడమే మంచిది.

ఈ ముఖ్యమైన సమాచారం పసి పిల్లలు ఉన్న ప్రతి తల్లితండ్రులకు ఉపయోగపడేది గనుక అందరికీ తెలిసేలా SHARE చేయగలరు.  మీకు ఇంకా ఏదైనా ఆరోగ్య సమాచారం తెలుసుకోవాలంటే కింద COMMENT సెక్షన్ లో తెలుపండి.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

Recently, we launched a baby-safe, natural and toxin-free floor cleaner. Recommended by moms and doctors all over India, this floor-cleaner liquid gets rid of germs and stains without adding harmful toxins to the floor. Click here to buy it and let us know if you liked it.

Stay tuned for our future product launches - we plan to launch a range of homecare products that will keep your little explorer healthy, safe and happy!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon