Link copied!
Sign in / Sign up
14
Shares

పిల్లల్ని పెంచడం అంత సులువు కాదు అని తెలియ చేసే 9 ఫోటోలు


పిల్లల్ని పెంచడం అంత సులువు కాదు అని కొందరంటారు. పేరెంటింగ్ చాలా కష్టం అని మరికొందరు అంటారు. కానీ, వారు చెప్పని విషయం ఏమిటంటే పిల్లలని పెంచే క్రమంలో మనం పిచ్చి పట్టి జుట్టు పీకుంటాము అని. ఒక్కొక్కసారి నేను ఏమి పాపం చేశాను నాకెందుకు ఇన్ని కష్టాలు అని అనిపిస్తుంది. కానీ కంగారు పడకండి, మీ పిల్లలే కాదు దాదాపు అందరు పిల్లలు అంతే అల్లరి చేస్తారు. ఇప్పుడు పిల్లలు ఎంత అల్లరి చేస్తారు వారిని పెంచడం ఎంత కష్టమో తెలియ చేసే 9 ఫొటోలు చూద్దాము.

1. పిల్లలు - పిండి

అందరికి తెలిసిన విషయమే, పిల్లలు వంటింట్లోకి వెళ్తే ఇంక అంతే. అన్నీ పీకి ఇల్లంతా చిందర వందర చేస్తారు. హఫ్ఫింగ్టన్ పోస్ట్తో ఈ చిత్రాన్ని పంచుకున్న సారా పిన్నాడా, "నా కుమార్తె కమీలా మరియు ఆమె చేసిన పెద్ద గందరగోళంలో ఇదే! మా ఇంటి నుండి ఇప్పుడు పిండి నిషేధించబడింది."

2. లిప్ స్టిక్ కేవలం పేదలకు మాత్రమే కాదు

మిశ్రమ భావోద్వేగాలు. ఒక వైపు మీరు ఆ విలువైన లిప్స్టిక్ కోల్పోయాం అనే బాధ, కానీ అదే సమయంలో మీరు సహాయం కానీ పిల్లలు చేసిన పనికి నవ్వు ఆపుకోలేరు. అయినప్పటికీ, ఈ గందరగోళాలన్ని పోవడానికి ఎంతో సమయం పట్టదు అని మీరు గ్రహించినప్పుడు, ఆ భావోద్వేగాలు పోతాయి.

3. కవలలు - పౌడరు

పౌడరు రాసుకోవడం అలవాటే. కానీ ఇలానా! ఇంట్లో పిల్లలు ఉంటె నెల రావాల్సిన పౌడర్ కేవలం వారం కూడా రాదు. శరీరానికే కాదు ఇల్లు కూడా తెల్లగా అవ్వాలని మొత్తం చిందబోస్తారు.

4. గోడలంతా రంగులమయం

ఈ సమయంలో కూడా ఏమి చేయాలో అర్థం కాదు. వారు వేసిన ముద్దు ముద్దు బొమ్మలని అభినందించాలా లేక గోడంతా పాడు చేసినందుకు తిట్టాలా. ఏమో నాకు తెలీదు.

5. చాక్లేట్ సిరప్

చాక్లెట్ సిరప్ ని ఎవరు మాత్రం ప్రేమించారు. మీ చిన్నారి చేతికి దానిని ఇచ్చి కాసేపు వదిలి చూడండి ఇదే జరుగుతుంది. ఒక తల్లి ఈ ఫోటోను షేర్ చేస్తూ ఇలా రాసింది, ఒక బాటిల్ మొత్తం రూమ్ అంత వేసాడు, అదెలానో కొంచెం సీలింగ్ మీద కూడా వేసాడు.

6. క్రాఫ్ట్ సప్లైస్

సారహ్ అనే మహిళ ఇలా పేర్కొనింది, నేను బాత్రూం వెళ్లిన 30 సెకండ్స్లో నా కూతురు క్రాఫ్ట్ సప్లైస్ ని ఇలా నేల మీద పడేసి ఆడుకుంటోంది. దానిని క్లీన్ చేయడానికి నాకు చాలా సమయం పట్టింది ఎందుకంటే వక్క్యూమ్ క్లీనర్ తో వాటిని క్లీన్ చేయడం వీలుపడక మొత్తం చేతులతోనే క్లీన్ చేయాల్సి వచ్చింది.

7. షేవింగ్ క్రీం

పొరపాటున పిల్లలకు షేవింగ్ క్రీం అందుబాటులో పెట్టమంటే ఇదుగో ఈ ఫొటోలో లానే జరుగుతుంది. జెన్నిఫర్ అనే తల్లి ఇలా చెప్పింది - ఇంటి ఈ చివరి నుండి ఆ చివరి వరకు మొత్తం షేవింగ్ క్రీం పడుంది. కనీసం కోపగించుకుందాం అంటే ఇంట్లో వెళ్ళగానే భూ అని నన్ను భయపెట్టే ప్రయత్నం చేసింది. ఇంకేం కోపం వస్తుంది ప్రేమ నవ్వు తప్ప!

8. పేలికలుగా పేపర్ ముక్కలు

ఈ ఫోటో చూసారా? ఇలాంటి ఒక భయంకరమైన సంఘటన మీకు జరిగిందా? ఇదంతా జరగడానికి ఎంతో సమయం పట్టదు, పిల్లలు కేవలం 5 నిముషాలు చాలు. కానీ దీనిని శుభ్రం చేయడానికి రోజంతా కావాలి.

9. టేబుల్

ఒక్కొకసారి పిల్లలు దేనినైనా పాడు చేయడంలో ఎంత నిష్ణాతులో అని తెలిసి ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది.  లెస్సి అనే ఆమె స్నానం చేసి వచ్చే లోపు తన కొడుకు ఎంత గొప్ప పని చేసాడో చుడండి.

పిల్లలు చేసే పనులు ఆ సమయంలో కోపం తెపించినా కొన్ని రోజులకు ఏవ్ మధుర జ్ఞాపకాలు. హ్యాపీ పేరెంటింగ్. ఇంకా ముందు ముందు ఎన్ని చూడాలో కదా!

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon