Link copied!
Sign in / Sign up
1
Shares

పిల్లలకు పాలివ్వడాన్ని సులభం చేసే 5 బ్రెస్ట్ ఫీడింగ్ టెక్నిక్స్


ఒక తల్లి కొంగుచాటున బిడ్డకు పాలిచ్చే దృశ్యం సృష్టిలోనే అద్భుతమైనది. బిడ్డకు పాలివ్వడం ప్రతి తల్లికి సహజంగా వచ్చేదే. అయినా కూడా బ్రెస్ట్ ఫీడింగ్ మెరుగవ్వలంటే కొంత నేర్పుఉండాలి. బిడ్డను ఒద్దికగా పట్టుకోవడం, వడిలో పెట్టుకోవడం, బిడ్డకు పాలు ఇవ్వడం ఇవన్నీ కొత్తగా తల్లి అయిన మహిళలకు కొంచెం కష్టంగా ఉండచ్చు. అందుకే మీకోసం పిల్లలకు పాలు ఇవ్వడం సులభం చేయడానికి నాలుగు బ్రెస్ట్ ఫీడింగ్ టెక్నిక్స్….

1. క్రాడల్ హోల్డ్ (Cradle hold)

ఈ బ్రెస్ట్ ఫీడింగ్ టెక్నిక్ బిడ్డకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. బిడ్డను వడిలోకి తీసుకుని సౌకర్యవంతంగా కూర్చోండి. కుడి చేతితో బిడ్డను మీకు దగ్గరగా జరిపి పట్టుకోండి. మీ కుడిచేతితో వక్షోజాలను బిడ్డకు అందించండి. బొటన వేలుతో నిప్పుల్ మీద ఉంచి, బిడ్డకు అందించండి.

2. క్రాస్ క్రాడల్ హోల్డ్ (Cross cradle hold)

బిడ్డ జారిపోకుండా పాలివ్వాలంటే, ఈ బ్రెస్ట్ టెక్నిక్ ద్వారా బిడ్డకు పాలు ఇవ్వచ్చు. బిడ్డను మీ గుండెలపై ఉంచి, ఎడమ చేతితో అదుముకోవాలి. కుడి చేతి సాయంతో వక్షోజాలను బిడ్డకు అందించాలి. ఎడమ చేయి మోచేతిని, మీ తొడల మీద ఆనిచ్చి, సపోర్ట్ తీసుకోండి.

3. ఫుట్బాల్ హోల్డ్ (Football hold)

వక్షోజాలు పెద్దగా ఉండే తల్లులకు ఈ బ్రెస్ట్ ఫీడింగ్ టెక్నిక్ చాలా సహాయపడుతుంది. బిడ్డను మీ కుడి చేయి మరియు మీ పొత్తి కడుపు మధ్య ఉంచాలి. తలను మీ వక్షోజాలు అందే విధంగా పైకి ఉంచండి. ఇప్పుడు ఎడమ చేతిని బిడ్డ తల మీద ఉంచి వక్షోజాన్ని అందించండి.

4. పడుకోపెట్టుకుని

మీరు బిడ్డకు పాలిచేటప్పుడు కొంత రెస్ట్ తీసుకోవాలంటే, ఇలా బ్రెస్ట్ ఫీడింగ్ చేయచ్చు. మీ పడుకుని, బిడ్డను మీ పక్కనే పడుకోబెట్టుకోండి. దగ్గర హత్తుకుని వక్షోజాలను అందించండి. మీ కాళ్ళను ముడవండి. అలా బిడ్డ జారిపోకుండా ఉంటాడు.

5. కవలల కోసం

మీకు కావలలుంటే, ఇద్దరి బిడ్డలకు ఒకే సారి పాలు ఇవ్వడానికి ఈ బ్రెస్ట్ ఫీడింగ్ టెక్నిక్ ఉపయోగపడుతుంది. బిడ్డలిద్దరిని ఇరు వైపులా ఉంచుకోండి. మీ రెండు తొడల మీద దిండులను ఉంచుకుని, వాటి మీద మోచేతులను ఉంచి, బిడ్డను చేతులతో పట్టుకోండి. వక్షోజాలను అందించండి.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon