Link copied!
Sign in / Sign up
5
Shares

పిల్లలకు ఈ రెండు పండ్లను కలిపి ఒకేసారి ఎప్పుడు తినిపించకండి : ప్రాణాలకే ప్రమాదం


ఎదిగే పిల్లలు పండ్లు తినడం చాలా అవసరం. వారి మానసిక, శారీరక, ఎదుగుదలకు పండ్లలోని పోషకాలు ఎంతగానో తోడ్పడుతాయి. తల్లిగా మీరు కూడా మీ పిల్లలకు పండ్లు తినిపించడానికి ఉత్సాహపడుతారు. అయితే ఇక్కడే చిన్న సమస్య వుంది. కొన్ని  రకాల పండ్లను ఒకేసారి కలిపి తినడానికి పిల్లలకు ఇవ్వడం మాత్రం ఎప్పుడు చేయకండి. కొన్ని రకాల పండ్లు కలిపి తినడం పిల్లలలో తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది.

 అందుకే పిల్లలకు  కొన్ని రకాల పండ్లను ఎప్పుడు కలిపి ఇవ్వకూడదు… అవేంటో ఇక్కడ తెలుసుకోండి…

1. బొప్పాయి - నిమ్మకాయ

ఈ రెండు పండ్లను కలిపి తినడం పిల్లలకు ఎప్పుడు ప్రమాదమే. ఇది రక్తంలోని హెమోగ్లోబిన్ మీద చెడు ప్రభావం చూపిస్తుంది. పిల్లలలో రక్త హీనత సమస్యలకు ధరి తీస్తుంది.

2. కమలా - క్యారెట్

కమలపండు తో కలిపి తినడం, పిల్లల మూత్రనాళ వ్యవస్థకు మంచిది కాదు, అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కడుపుమంట, అధిక పిత్త రసం ఉత్పత్తి లాంటి సమస్యలు కూడా వస్తాయి.

3. జామ పండు - అరటి పండు

పిల్లలు ఎప్పుడు ఈ రెండు పండ్లను కలిపి తినకుండా చూసుకోండి. జామ పండు, అరటి పండు కలిపి తినడం వికారాన్ని కలిగిస్తుంది. కడుపులో గ్యాస్ ఏర్పడడం వలన, తీవ్రమైన కడుపు నొప్పి రావచ్చు.

4. దానిమ్మ - ఎండు ద్రాక్ష

ఎండు ద్రాక్షలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి, దానిమ్మ లో చక్కర అధికంగా ఉంటుంది. ఈ రెండు కలిపి తీసుకోవడం వలన, దానిమ్మ లోని చక్కరలు, ఎండు ద్రాక్షలోని ప్రోటీన్లను అరగనివ్వవు. అది కడుపులో గ్యాస్ ఏర్పడడానికి కారణమవుతుంది. తర్వాత అరుగుదలలో సమస్యలు వస్తాయి.

5. కమలాపండు - పాలు

పాలు తాగిన తరువాత, ఎప్పుడు కమలా ను తినకూడదు. పాలు అరగడానికి కావాల్సిన ఎంజయ్మ్స్ ను, కమలా పండులోని ఆమ్లాలు నాశనం చేస్తాయి. దాని కారణంగా పాలు అరగవు. పిల్లలు కడుపు నొప్పితో బాధపడాల్సి ఉంటుంది. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon