డెంగ్యూ జ్వరం సరైన సమయంలో నివారించకపోతే అత్యత ప్రమాదకంగా మారే ప్రమాదం ఉంది. ఈ జ్వరం ముఖ్యనగ దోమ కాటు వలన సంభవిస్తుంది. అసలే వర్షా కాలం దోమలు విరుచుకుపడే సమయం, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీ పిల్లలను ఈ భయంకరమైన జ్వరం నుండి కాపాడుకోవచ్చు.
ముందుగా డెంగ్యూ జ్వరం వచ్చిందో రాలేదో అని తెలుసుకోవడం ఎలా?
డెంగ్యూ జ్వరం లక్షణాలు
1. అధిక జ్వరం
2. వాంతులు, విరోచనాలు
3. కండరాళ్ళ నొప్పి
4. కళ్ళ వెనుక నొప్పి
5. తీవ్రమైన తలనొప్పి
6. గ్రంధులు ఊదడం
ఈ లక్షణాలు మీ పిల్లల్లో కనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళండి. కొంచెం కూడా నిర్లక్ష్యం చేయకండి.
నివారించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు
1. నీరు నిలువ ఉంచకండి
నిరువ నీటిలోనే దోమలు గుడ్లు పెడతాయి కనుక నీరు అస్సలు నిలువ ఉంచకండి. వానాకాలం కనుక మీ ఇంటి చుట్టూ పక్కన నిలువ నీరు ఉంటె కొంచెం బ్లీచింగ్ పొడి వాటిలో చల్లండి. ఆలా చేయడం కష్టం అనుకుంటే మీ ఇంటి కిటికీకి మెష్ వేసుకోండి. ఎంత వీలైతే అంత దోమలను ఇంట్లోకి రానివ్వకుండా చేయండి.
2. దోమలను చంపే అల్ ఔట్ వంటివి వాడండి
ఇంట్లో తప్పనిసరిగా అల్ అవుట్ పెట్టుకోండి. ఒక్క దోమ ఉన్న ప్రమాదమే. పిల్లల బయట ఆదుకోవడానికి వెళ్ళినపుడు పిల్లల శరీరానికి ఓడోమోస్ వంటివి పూసి పంపించండి.
3. దోమ తెర
పిల్లను తప్పకుండా దోమ తెరలోనే నిద్రపొమ్మని చెప్పండి. ఇది పురాతన సమయం నుండి దోమల నుండి రక్షించుకోవడానికి ఎంచుకున్న మార్గం. దోమ తెరలో పడుకోవడం వలన పిల్లలు కూడా హాయిగా నిద్రపోతారు.
4. తులసి చెట్టు పెంచుకోండి
తులసి చెట్టు ఇంట్లో పెట్టుకోవడం వలన చాల ఉపయోగాలు ఉన్నాయి. అందుకే మన పూర్వికులు తులసి చెట్టుని దేవుడితో సమానంగా భావించి పూజించేవారు. తులసి చెట్టు బయట ఉంటె చాల వరకు క్రిమి కీటకాలు ఇంట్లోకి ప్రవేశించవు. అంతే కాకుండా రోజుకు 2-3 తులసి ఆకులను పిల్లలకు తినిపిస్తే డెంగ్యూ జ్వరం అంత సులువుగా సోకదు.
5. కర్పూరం
దోమలు పిల్లలను కుట్టకుండా ఉంచడానికి సహజమైన పద్దతి పిల్లల వంటికి కర్పూరం రాయడం. కర్పూరం వంటికి రాసుకోవడం వలన జలబు వంటివి కూడా తగ్గుతాయి, దాని మంచి వాసనకు పిల్ల మూడ్ కూడా బాగుంటుంది.
పైన చెప్పిన జాగ్రత్తలు పాటిస్తే పిల్లలకు డెంగ్యూ జ్వరం రాకుండా కాపాడుకోవచ్చు.
