Link copied!
Sign in / Sign up
56
Shares

పిల్లలకు బలాన్నిచ్చే ''బనానా స్మూతి'' ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి

పిల్లలకు తినిపించడం మహా కష్టం. అదే ఆరోగ్యకరమైన  పండ్లు తినిపించాలంటే ఇంకా మారం చేస్తారు. వీటిలోని పోషకాలు, విటమిన్లు ఎదిగే పిల్లలకు  చాలా అవసరం. కానీ పిల్లలకు పండ్లను నేరుగా తినకపోతే ఏదో ఒక రూపంలో వారికి వాటిని అందించాలి. అరటి పండును పిల్లలు తినడానికి అంతగా ఇష్టపడరు.  అందుకే ఈ అరటి పండులోని పోషకాలను ఈ బననా స్మూతి ద్వారా అందించండి. అది ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి…

బనానా స్మూతీ

కావాల్సిన పదార్ధాలు :

1. 4 టేబుల్ స్పూన్స్ తొక్క తీసిన ఉడికిన బాదాం

2. 1 కప్పు తరిగిన అరటిపండు

3. 1 1/2 కప్స్ చల్లని పాలు

4. 2 టేబుల్ స్పూన్స్ పంచదార

5.1/2 టేబుల్ స్పూన్స్ వనిల్లా ఎసెన్స్

6. 8 ఐస్ క్యూబ్స్

తయారి విధానం:

1. అరకప్పు పాలు,బాదాం,అరటిపండు అన్నిటిని జ్యూయిసర్ లో గ్రైండ్ చేయండి. మిశ్రమం బాగా మృదువుగా మరియు నురగ రావాలి.

2. పంచదార, మెలిగిన ఒక కప్పు పాలు, వనిల్లా ఎసెన్స్ మరియు ఎనిమిది ఐస్ క్యూబ్స్ వేసి ముందుగా జ్యూస్ర్ లో బ్లెండ్ చేసినట్టే చేయండి.

3. నాలుగు గ్లాసుల్లో స్మూతీ లో సమానంగా పోయండి.

4. వెంటనే సర్వ్ చేయండి.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon