Link copied!
Sign in / Sign up
1
Shares

పిల్లలతో గడిపే సమయాన్ని విలువైనదిగా ఎలా మార్చుకోవాలి?


తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగస్తులు అయితే పిల్లలకు కేటాయించడానికి చాలా తక్కువ సమయం ఉంటుంది. ఉద్యోగస్తులకు కావలసినంత తరచుగా పని బాధ్యతలు నుండి దూరంగా ఉండటం సులభం కాదు. చాలా సార్లు మనం ఆఫీస్ పని చేయాల్సి వస్తుంది, కానీ అది ఒక అలవాటుగా మారకుండా ప్రయత్నించండి. పిల్లలే నిస్సందేహంగా మీ అత్యంత ముఖ్యమైన ఆస్తి. మీ కష్టపడేది వారి కోసమే. కానీ, వారి బ్యాంకులో ఎంత డబ్బులు వేస్తున్నామన్నది మాత్రమే కాకుండా వారితో ఎంత సమయం గడుపుతున్నాము అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. పిల్లలు పెద్దయిన తరువాత వారితో గడపాలన్నా కుదరదు. అంతే కాకుండా, పిల్లలు పెరుగుతున్న వయస్సులో తల్లిదండ్రులు వారితో సమయం కేటాయించడం అత్యంత అవసరం. పనులు ఉన్న పిల్లలతో విలువైన సమయం గడపడానికి ఈ మార్గాలను ప్రత్నించండి.

1. హోమ్ వర్క్ - ఆఫీస్ వర్క్

ఆఫీస్ వర్కుని ఇంట్లో చేయాల్సి వస్తే పిల్లలు హోమ్ వర్క్ చేసుకుంటున్నపుడు వారితో కలిసి చేయండి. ఇలా చేస్తే మీకు వారితో సమయం గడిపినట్టు ఉంటుంది మరియు పిల్లలు కూడా హోమ్ వర్క్ అనేది జీవితంలో ఒక భాగం అని తెలుసుకొని దానిని అసహ్యించుకోవడం తగ్గిస్తారు. ఒక వేల మీకు ఆఫీస్ వర్క్ లేకపోతే మరి మంచిది, వారికి హోమ్ వర్క్ చేయడంలో సహాయం చేయండి. దీని ద్వారా మీ పిల్లలు ఏ సబ్జెక్టులో ఇబ్బంది పడుతున్నారో, వారు చదువు ఎలా సాగుతుందో మీకు అర్థమవుతుంది. వారి చదువు విషయంలో పూర్తి శ్రద్ద చూపండి, స్కూల్లో జరిగే విషయాల గురించి తెలుసుకోండి, ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నారో తెలుసుకోండి. ఇవన్నీ జరగాలి అని అంటే మీరు వారితో రోజు కొత్త సమయం అయినా గడపాలి.

2. టెక్నాలజీని వాడుకోండి

ఈ రోజుల్లో మనం ఎంత కాదన్నా, ఎంత వద్దనుకున్నా టెక్నాలజీ మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. కాబట్టి, దానిని మీ ప్రయోజనాలకు వాడుకోండి. పిల్లలతో పేస్ బుక్ వంటి సోసియల్ మీడియాలో కూడా టచ్లో ఉండండి. వారి ఇష్టాలు, కోరికలను అర్థం చేసుకోవడానికి ఇది కూడా ఒక మంచి మాధ్యమం అని గుర్తించండి. ఒక వేల మీరు దూరంగా ఉంటె స్కైప్, వాట్స్ అప్ వీడియో కాల్ ద్వారా మాట్లాడండి. చూసారా! సరిగ్గా వాడుకుంటే టెక్నాలజీ ఎంతమంచిదో.

3. వారి రోజు కార్యక్రమాలలో పాల్గొనండి

మీ పిల్లలు ఫ్రెండ్స్ తో ఆడుకోవడనికి వెళ్లాలన్న, సినిమాకి వెళ్లాలన్న మీరు స్వచ్చందంగా వారిని అక్కడి వరకు తీసుకొని వెళ్ళండి. వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా మాట్లాడండి. అప్పుడప్పుడు అందరిని ఇంటికి పిలిచి సరదాగా గడపండి. ఇలా చేయడం వలన మీ పిల్లలు మీతో మరింత ఫ్రీగా ఉంది అన్ని పంచుకోగల్గుతారు. దీనికి మీరు ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. కుదిరినప్పుడు, మీ ఆఫీస్ దారిలోనే మీ పిల్లలకు కూడా పని ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు చేయండి చాలు.

4. బయటికి తీసుకొని వెళ్ళండి

వారానికి ఒకసారి, మీ కుటుంబాన్ని విందుకు తీసుకెళ్లండి. అంత సమయం దొరకకపోతే, వారిని పానీ పూరి లేదా చాట్ తినడానికి తీసుకెళ్లండి. సరదాగా అలా ఊరంతా తిరగండి, కలిసి షాపింగ్ చేయండి .మీ పిల్లల మరియు మీ దంపతులకు రోజు వారి పనుల నుండి కొంచెం ఉపశమనం దొరుకినట్టు అవుతుంది. విందు తర్వాత ఐస్క్రీం పార్లర్కు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళండి. దొరికిన ప్రతి అవకాశాన్ని వాడుకొని మీ పిల్లలతో వీలైనన్ని జ్ఞాపకాలను పొందండి. 

.......................................................................................................................

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon