Link copied!
Sign in / Sign up
88
Shares

పిల్లలలో రోగనిరోధక శక్తి పెరగడానికి తినిపించాల్సిన 7 అద్భుతమైన ఆహారాలు

ప్రతి అమ్మ తన బిడ్డకు ఏ జబ్బు, రోగం రాకుండా, ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటారు. కానీ మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, పిల్లలను కొన్ని జబ్బుల నుండి కాపాడలేం. వారి చుట్టూ, క్రీములు, బాక్టీరియా, లాంటి రోగ కారకాలు ఎప్పుడు పొంచే ఉంటాయి. జబ్బులు వచ్చిన తరువాత వైద్యం చేయించడం కన్నా అవి రాకుండా నివారించడం ఉత్తమం. అందుకు మీరు చేయాల్సింది, పిల్లలు ఈ జబ్బులను ఎదురుకునే రోగ నిరోధక శక్తిని వారిలో పెంచడం. పిల్లలలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి తినిపించాల్సిన ఆహారాలు ఇవే…

1. అల్లం

అల్లంలో ఉండే ఔషధ గుణాలు, అనేక జబ్బులకు నివారణగా పనిచేస్తాయి. పిల్లలు 8 నెలల వయసు దాటిన తరువాత వారి ఆహారంలో అల్లాన్ని చేర్చండి. ఇది పిల్లలలో దగ్గు, జలుబు లాంటి జబ్బులను నయం చేయడమే కాకూండా, పిల్లలకు ఆ జబ్బులను రాకుండా నివారిస్తుంది.

2. క్యారెట్స్

క్యారెట్స్ లో అధికంగా ఉండే బీటా కరోటిన్, శరీరంలోకి చేరాక విటమిన్ ‘A’ గా మారుతుంది. అందుకే క్యారట్ పిల్లలకు తినిపించడం చాలా అవసరం. విటమిన్ ‘A’ పిల్లల కంటి చూపును ఆరోగ్యాంగా ఉంచడమే కాకూండా, ఏ కంటి చూపు సమస్యలు రాకుండా చేస్తుంది.

3. పెరుగు

మీ పిల్లలు 7-8 నెలలు వయసు నుండి పెరుగు తినిపించడం మొదలుపెట్టండి. పెరుగులో పిల్లల ఎదుగుదలకు కావల్సిన ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా పిల్లలకు అరుగుదల సమస్యలు రాకుండా చేస్తుంది.

4. వెల్లుల్లీ

7 నెలల వయసు దాటినా తరువాత, పిల్లలకు వెల్లుల్లిని తినిపించచ్చు. చిన్న ముక్కలుగా చేసి పిల్లల ఆహారంలో చేర్చండి. గాయాలు త్వరగా మానిపోవడానికి, పిల్లలకు రోగ నిరోధక శక్తిని అందిస్తుంది.

5. పండ్లు

పిల్లలకు పండ్లు తినిపించడం చాలా అవసరం. అరటి పండు, బత్తాయిలు, ద్రాక్ష ఇలాంటి పండ్లలో, విటమిన్స్, యాంటీ యాక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. పిల్లల రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అయితే సాలిడ్ ఫుడ్ పూర్తిగా అలవాటు అయిన తరువాత మాత్రమే పండ్లను తినిపించండి.

6.బొప్పాయి

బొప్పాయిలో ఉండే విటమిన్ ‘B’ , విటమిన్ ‘C’ పిల్లల ఎదుగుదలకు చాలా అవసరం. విటమిన్ ‘B’ ఆహారాన్ని శక్తిగా మారుస్తుంది.  విటమిన్ ‘C’, పిల్లలకు ఇన్ఫెక్షన్లు ఎదురుకునే, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

7. పాల కూర (Spinach)

పిల్లల ఆహారంలో పాల కూర, లాంటి ఆకుకూరలను తప్పకుండా చేర్చాలి. దీనిలో పిల్లల రోగ నిరోధక శక్తిని పెంచే ఐరన్, విటమిన్ ‘C’ ఉంటాయి.  

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
100%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon