Link copied!
Sign in / Sign up
16
Shares

పిల్లలను స్కూల్ కు పంపించడానికి సరైన వయస్సు ఏంటి..?

పిల్లలు పుట్టిన తర్వాత మా అమ్మాయిని డాక్టర్ చేయాలి, మా కుర్రాడు ఇంజినీర్ అవుతాడు అని ప్రతి తల్లితండ్రులు అనుకోని రోజంటూ ఉండదు. ఐతే పిల్లలను ఏ వయస్సు నుండి స్కూల్ కు పంపడం చాలామందికి తెలియక, కొందరిని ముందే స్కూల్ లో చేర్పిస్తుంటే, మరికొందరు మాత్రం పిల్లల ఇష్ట ప్రకారం పంపిస్తున్నారు.  మరి పిల్లలను బడికి పంపించడానికి సరైన వయస్సు ఏంటో తెలుసుకోండి..

2 ½ ఏళ్ళ వయస్సు వచ్చాక..

సాధారణంగా పిల్లలు 1 ½ సంవత్సరం లేదా 2 ఏళ్ళ తర్వాత నెమ్మదిగా మాట్లాడటం మొదలుపెడతారు.  బొమ్మలతో ఆడుకోవడం, వస్తువులను విసిరి వేయడం, గోడలు పట్టుకుంటూ లేదా నెమ్మదిగా నడవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి ప్లే స్కూల్ లేదా పిల్లల కోసం ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన పిండి బడికి పంపించవచ్చు. ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా పిల్లలను ఆడించడం చేస్తారు.

5 ఏళ్ళ వయస్సు వచ్చాక..

3 నుండి 5 ఏళ్ళ వయస్సులో పిల్లలు పెన్సిల్ పట్టుకుని ఏదైనా రాయడానికి, కాగితంపై బొమ్మలు గీయడానికి వారి చేతులు సహకరిస్తాయి. అదే ప్లే స్కూల్ లో ఐతే ఎలా చేయాలి, ఎలా రాయాలి అనే అవగాహన పిల్లలకు ఉండదు. అలాగే ఆకలి వేస్తే సొంతంగా తినేలా నేర్చుకోవడం, వేరే పిల్లలతో కలిసి ఆడుకోవడానికి మీరు పిల్లలకు ఆసక్తి కలిగించేలా చేసినట్లయితే మీ పిల్లలను స్కూల్ కు పంపించడం చేయవచ్చు.

ఈ మాటలు ఖచ్చితంగా చెప్పాలి

పిల్లలకు ఏదైనా చిన్న వయస్సులోనే తల్లితండ్రులు చెప్పే మాటలను బాగా అర్థం చేసుకోగలరు, ఆ మాటలు ఎప్పుడు వారికి గుర్తుండిపోతాయి. కాబట్టి, ఎప్పుడు ఒంటరిగా ఉండకూడదు, అందరితో కలిసి మెలసి ఉండాలి, నీకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే మాతో తప్పకుండా చెప్పాల, నీకు ఏమంటే ఇష్టం..వంటి విషయాలను తల్లితండ్రులు అడుగుతూ ఉండటం వలన పిల్లలకు మనో ధైర్యాన్ని ఇచ్చిన వారవుతారు.

అలాగే మీ పిల్లలకు స్కూల్ కు అంటే ఇష్టం ఉండేలా చేయాలి గానీ భారంగా మాత్రం అనిపించేలా చేయకూడదు. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon