Link copied!
Sign in / Sign up
0
Shares

పిల్లలను పుట్టించి అమ్ముకుంటున్నారు : డబ్బుల కోసమే ఇదంతా..!

అమ్మ అవ్వడం అంటే అదృష్టం ఉండాలి, అమ్మ కావడం అంటే అంగడిలో లభించే సరుకులు కొనుక్కోవడం కాదని అంటారు. అమ్మ కావాలని మహిళలకు ప్రతి ఒక్కరికీ ఉంటుంది, అది కూడా ఒక పధ్ధతి ప్రకారం. కానీ ఇక్కడ మాత్రం డబ్బు అనే ఆశ చూపి, కొందరు అమ్మాయిలకు ఇష్టం లేకున్నా సరే వారిని గర్భవతులుగా చేసి పిల్లలను అమ్ముకుంటున్నారు. అమ్మ అనే పదానికి మచ్చతెస్తున్న ఈ సంఘటన గురించి వివరంగా మీకోసం..

అందరూ టీనేజ్ అమ్మాయిలే..

సుమారు 13 నుండి 18 ఏళ్ళ వయస్సు ఉండే అమ్మాయిలు, టీనేజ్ వయస్సు కూడా దాటని వారు, అందునా ఏ తోడూ నీడా లేని అనాథలు. వీరికి డబ్బు ఆశ చూపించడం, వారి మాట వినకపోతే బలవంతంగా లాక్కుని వెళ్లడం..వారిని గర్భవతులుగా చేసి వారికి పుట్టిన పిల్లలను 5 నుండి 10 లక్షల దాకా పిల్లలు కోసం వెదుకుతున్న దంపతులకు అమ్ముకుంటున్నారు. గర్భం దాల్చి బిడ్డను ఇచ్చినందుకు ఆ అమ్మాయిల చేతిలో ఎంతో కొంత సొమ్ముపెడుతున్నారు.

బేబీ ఫార్మర్మ్ పేరుతో చేస్తున్న మోసం..

టీనేజ్ అమ్మాయిలను అడ్డుపెట్టుకుని గర్భవతులను చేసి, వారికి పుట్టిన పిల్లలను పెంచుకుంటున్న దీనిని ‘బేబీ ఫార్మర్మ్, బేబీ ఫార్మింగ్’ అని పిలుచుకుంటున్నారు. నైజీరియా దేశంలో ప్రభుత్వం కళ్లుకప్పి రహస్యంగా ఇలా చేస్తున్నారు. పిల్లలు కలుగరని తెలిసిన దంపతులు, పిల్లలంటే ఇష్టం ఉన్నవారు తమ సంతానం లేకపోతేనే ఇలా చేస్తున్నారు. ఈ దేశంలో అబార్షన్ చేయించుకోవడం చట్ట విరుద్ధం అట. ఇది వీరికి ఒక వ్యాపారంగా మారింది కూడా. అమ్మాయిలకు ఇష్టం లేకపోయినా ఈ విధంగా చేస్తున్న ఈ నీచులపై పోలీసుల రైడింగ్ లో దొరికిన వాళ్ళు చాలామందే ఉన్నారు. అయినా కూడా వీళ్ళు మారటం లేదు.

పిల్లలు కనటం తప్పు కాదు, కానీ ఇలా అడ్డదారిలో అమ్మాయిలకు ఇష్టం లేకుండా అమ్మతనానికి మచ్చతెస్తున్న వీరిని కఠినంగా శిక్షించాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon