మీ పిల్లలను కౌగిలించుకోవడం వాళ్ళకి ఎంత మంచిదో తెలుసా? ఒక్కసారి ఇది చదవండి మీకే అర్థమవుతుంది
పిల్లలను కౌగిలించుకోవడం అనేది ఒక మధురానుభూతి. వారి కోమలమైన స్పర్శ, మెత్తని శరీరం తాకుతున్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. మామూలుగా మీరు బిడ్డతో గడిపిన్న సమయంలో కౌగిలించుకున్నప్పుడు ఎక్కువ సంతోషాన్ని పొందుతారు. పిల్లలను ఆడించి సంతోషంగా ఉంచడం కన్నా కౌగిలించుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి. వాటిని ఇప్పుడూ తెలుసుకుందాం.
గాయం మానుతుంది
ఒక తల్లిగా మీరు పిల్లలను కౌగలించుకొని పడుకోవడం వల్ల మీ ప్రసవానికి సంబంధించిన గాయం చాలా తొందరగా మానుతుందని మెడికల్ పరిశోధనలు చెప్పాయి. ఒక్కోసారి పిల్లల శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది అలాంటప్పుడు హగ్-తెరపీని పాటించమని వైద్యులు చెప్తారు.
కంగారు
మీలో చాలా మంది కంగారూ కేర్ గురించి విని ఉంటారు. వైద్యులు కూడా పిల్లలకు కంగారూ థెరపీని పాటించమని చెప్తారు. కంగారూ థెరపీ అంటే బేబీని చాలా జాగ్రత్తగా కాపాడుకోవడం. దాని కోసం బేబీని కౌగిలించుకోవడం. దాదాపు పిల్లలకు 6 నెలల వయసు వచ్చే వరకు పిల్లలను కౌగిలించుకోవాలి. దీని వల్ల పిల్లలకు పూర్తి రక్షణ అందుతుంది.
ఆక్సిటోసిన్
మీరు ఆక్సిటోసిన్ హార్మోన్ గురించి వినే ఉంటారు. ఆక్సిటోసిన్ అనేది కేవలం అడల్ట్స్ కోసం అను అనుకుంటారు. ఆ హార్మోన్ చిన్న పిల్లలకు కూడా అవసరం. దాని వల్ల పిల్లలు చాలా సౌకర్యంగా ఫీలవుతారు. మీరు బేబీని హగ్ చేసుకొని పడుకోవడం వల్ల ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఎక్కువ మోతాదులో విడుదల అవుతుంది. దీంతో పిల్లలు చాలా హ్యాపీగా ఉంటారు.
వ్యక్తిత్వం
ఆక్సిటోసిన్ వల్ల పిల్లలకు చాలా మంచిదని ఎన్నో వైద్య పరిశోధనలు తెలియజేశాయి. ఒకవేళ పిల్లలకు సరైన స్పర్శ తల్లిదండ్రులు ఇవ్వలేకపోతే పిల్లలు బవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అది వారి వ్యక్తిత్వం మీద ప్రభావం చూపుతుంది. దీనిని బట్టి పిల్లలకు హగ్ ఇవ్వడం వల్ల ఎంత మంచి జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లలకు పూర్తి రక్షణను ఇస్తూ, వారిని ఆనందంగా ఉంచండి.
