Link copied!
Sign in / Sign up
0
Shares

పిల్లలను కంటికి రెప్పలా చూసుకునే తల్లికే ఆరోగ్యం బాగాలేకపోతే..


తల్లి.. ఈమే కుటుంబానికి శ్రీరామరక్ష‌. మహిళలు అన్ని రంగాల్లో ముందున్నట్లుగా ఓ తల్లిగా కుటుంబ బాధ్యతలను మోయడంలోనూ మహిళ ముందుంటుంది. అయితే.. గృహిణి అయినా... పని చేసే మహిళ అయినా.. ఇంట్లో తల్లిగా, భార్యగా, కోడలుగా, కూతురుగా ఇలా పలు రూపాల్లో కుటుంబ బాధ్యతను నెత్తినేసుకోవాల్సిందే. మరి.. కుటుంబ బాధ్యతను మోయాల్సిన ఆ తల్లికి ఏదైనా సమస్య వస్తే ఎలా? ఆ తల్లి కంటికి రెప్పలా చూసుకునే పిల్లలను ఎవరు చూసుకోవాలి. కుటుంబాన్ని ఎవరు నెట్టుకురావాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరి సహాయం తీసుకోవాలి. ఎలా మెలగాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా తగినంత రెస్ట్ తీసుకోండి

మీరు లేకుండా మీ ఫ్యామిలీ ఒక అడుగు కూడా ముందుకు వెళ్లదనేది అందరికీ తెలుసు. కాని.. మీ ఆరోగ్యం కూడా మీకు ముఖ్యమే. మీ పిల్లల కోసం, భర్త కోసం, అత్తమామ కోసం, తల్లిదండ్రుల కోసం మీరు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు కాబట్టి.. ఇటువంటి సమయాల్లో తగినంత రెస్ట్ తీసుకోండి. ప్రతి క్ష‌ణం మీరు మీ కుటుంబం గురించే ఆలోచిస్తారు. అందుకే ఏమాత్రం సంకోచించకుండా తగినంత రెస్ట్ తీసుకోండి. దీంతో మీ మనసు కుదుటపడుతుంది. మళ్లీ మీ శరీరం పునరుత్తేజితం అవుతుంది. దీంతో మళ్లీ మునుపటిలా ఏపనైనా చేసే అవకాశం ఉంటుంది. మీ కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకునే చాన్స్ దక్కుతుంది.

మీ పిల్లల బాధ్యతను వేరేవాళ్లకు అప్పగించండి

మీ ఒంట్లో బాగోలేనప్పుడు ఖచ్చితంగా వేరే వాళ్ల సహాయం తీసుకోండి. దానికి ఏమాత్రం మొహమాట పడకండి. ఎందుకంటే.. మీరు మీ కుటుంబాన్ని, మీ పిల్లలను చూసుకోలేనప్పుడు ఖచ్చితంగా వేరే వాళ్ల సహాయం అత్యవసరం.

మీ పిల్లలను వాళ్ల నాన్నకు అప్పగించండి. మీ సమస్యలు తీరేవరకు వాళ్ల నాన్నను పిల్లలను చూసుకోవాలని చెప్పండి. వాళ్ల నాన్నకు కూడా కొన్ని పనులు అప్పగించండి. పిల్లల బాధ్యతను తెలపండి. స్కూల్ కు వెళ్లడం, తీసుకురావడం, ఆహారం విషయంలో వాళ్ల నాన్న ఇన్వాల్వ్ చేయండి. ఎలాగోలా కొన్ని రోజులు మీరు లేకుండా పిల్లలను మేనేజ్ చేయగలిగితే వాళ్లకు కూడా పిల్లల బాధ్యత తెలిసొస్తుంది.

ఎక్కువగా శ్రమపడకండి

మీ ఆరోగ్యం బాగా లేనప్పుడు ఎక్కువగా టెన్షన్ తీసుకోకండి. మీరు రెస్ట్ తీసుకోవడం మీదనే శ్రద్ధ పెట్టండి. అనవసరంగా మీ కుటుంబ గురించి ఎక్కువగా ఆలోచించి ఆందోళన చెందకండి. మీ కుటుంబం కోసం ఎక్కువగా కష్టపడే మీరు.. ఇటువంటి సమయాల్లో చాలా సావదానంగా ఉండాలి.

పనులు అప్పగించండి..

మీ పిల్లలు కొంచెం పెద్దవాళ్లయితే ఖచ్చితింగా వాళ్లకు కొన్ని పనులు అప్పగించండి. దీంతో మీ భారం సగం తగ్గుతుంది. అంతే కాని.. మీ ఆరోగ్యం బాగా లేకున్నా.. మీ పిల్లలకు పని చెప్పకుండా మీరు రెస్ట్ తీసుకోవడం మానేసి.. కష్టపడకండి. దాని వల్ల మీ ఆరోగ్యం చెడిపోవడమే కాకుండా మీరే చిక్కుల్లో పడతారు. అందుకే.. మీకు అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ పిల్లలకు చిన్న చిన్న పనులు, వాళ్లు చేయగలిగే పనులను అప్పగించండి. వాళ్లకు ఆ పనులు ఎలా చేయాలో దిశానిర్దేశం చేయండి. దీంతో మీ మనసు నెమ్మదిస్తుంది. మీరు కూల్ అవుతారు.

మీ పిల్లలను దూరంగా ఉంచండి

మీకు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు మీ పిల్లలను దగ్గరకు రానివ్వకండి. వాళ్లను కౌగిలించుకోవడం, ముద్దు పెట్టడం లాంటి వల్ల వాళ్లకు ఇన్ఫెక్ష‌న్ సోకే ప్రమాదం ఉంటుంది. అందుకే.. మీరు అనారోగ్యానికి గురయినప్పుడు మీ పిల్లలకు వీలైనంత దూరంగా ఉండండి.  

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon