Link copied!
Sign in / Sign up
7
Shares

పిల్లలను ఇలా ఛాతీ మీద పెట్టుకుని నిద్రపుచ్చటం పిల్లల ప్రాణాలకు ఏం జరుగుతుంది..!

చిన్న పిల్లలు ఏడుస్తున్నప్పుడు వారిని నిద్రపుచ్చడానికి, వారిని ఏడుపు నుండి ఆపటానికి చాలామంది ఛాతీ మీద పడుకోబెట్టుకుని నిద్రపుచ్చుతూ ఉంటారు. ఇలా చేయడం వలన పిల్లలకు హాయిగా ఉంటుంది. వెంటనే నిద్రలోకి జారుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ ఇలా చేయడం పిల్లల ప్రాణాలకు ప్రమాదం అని చెబుతున్నారు ప్రముఖ ఆరోగ్య నిపుణులు. ఇలా ఎందుకు ప్రమాదం? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి…

ఛాతీ మీద పిల్లలను పడుకోబెట్టి నిద్రపుచ్చటం..?

చంటి బిడ్డలను ఛాతీ మీద పడుకోబెట్టుకుని నిద్రపుచ్చటం వలన ఆకస్మిక శిశు మరణాలకు కారణమవుతున్నాయని ఆరోగ్య నిపుణులు తెలిపారు. ఛాతీపై పెట్టుకుని పిల్లలను నిద్రపుచ్చటం వలన శ్వాస తీసుకున్నాక మీ శరీరం నుండి బయటకు వచ్చే గాలి, మీ శరీర ఉష్ణోగ్రత, అలాగే మీ పిల్లలు మీపై పడుకుని నిద్రపోవటం వలన వారికి ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి గురై ఆకస్మిక మరణాలకు కారణమవుతున్నాయని సూచిస్తున్నారు. ఇంకా మీ ఛాతీపై పిల్లలను పెట్టుకోవడం వలన కొన్నిసార్లు జారిపోయే అవకాశం కూడా ఉంది.

పిల్లలను నిద్రపుచ్చేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

మీ పిల్లలను త్వరగా నిద్రపుచ్చాలి అనుకున్నప్పుడు ఒకటి రెండు సార్లు ఇలా గుండెలపై పెట్టుకుని ఓదార్చడం  మంచిదే, కానీ నిరంతరం ఇలా చేయటం వలన ప్రాణాలకు ప్రమాదమే. అలాగే పిల్లలను ఎప్పుడు బోర్లా పడుకోకుండా వెల్లకిలా పడుకునేలా, వారు పడుకునే చోట దిండ్లు, దుప్పట్లు అడ్డుగా లేకుండా చూసుకోవాలి. ఇవి వారు శ్వాస తీసుకోవడానికి ఇబ్బందికి గురిచేస్తాయి. ఒక సంవత్సరం వరకు తల్లితండ్రులతో పాటు కాకుండా ఉయ్యాలలో లేదా వారి కోసం ప్రత్యేకంగా రెడీ చేసిన బెడ్ లపై పడుకోబెట్టడం మంచిది.

పిల్లలను వీటికి దూరంగా ఉంచాలి?

చంటి బిడ్డలను ఎక్కువగా ధూమపానం, మద్యపానం చేస్తున్న వారికి దగ్గరగా కాకుండా దూరంగా ఉంచడం మంచిది.  వీరి శ్వాస పిల్లలపై ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతుంది. పిల్లలను ఎక్కువగా పొగ, మంచు పడే చోటు తిప్పడం వలన ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. పిల్లలను సరిగ్గా నిద్రపుచ్చడం అనేది తేలికగా తీసుకుని నిర్లక్ష్యం చేయకండి. చాలా ప్రమాదకరం. దయచేసి ఈ విషయాన్ని అందరికీ చేరేలా SHARE చేయగలరు.. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon