Link copied!
Sign in / Sign up
1
Shares

పిల్లలను ఎలా మచ్చిక చేసుకోవాలి..? మీలో ఎవరికీ తెలియని 5 సులభమైన పద్ధతులు..

పిల్లలను మచ్చిక చేసుకోవడం అంటే మిమ్మల్ని చూడగానే ప్రేమగా రావడం, మీరంటే ఇష్టంగా ఉండటం, ఎప్పుడు మీతోపాటు ఉండటానికి ముందుకు రావడమని అర్థం. పిల్లలకు అమ్మతో కలిసి ఉండటానికి పెద్దగా ఏ సమస్య ఉండదు కానీ అదే నాన్న దగ్గరకు, తాతయ్య నానమ్మ, ఇలా బంధువులు, స్నేహితుల దగ్గరకు వెళ్లాలంటే త్వరగా వెళ్ళరు. భయపడిపోతుంటారు. వయస్సు పెరిగేకొద్దీ వీళ్ళు మనవాళ్ళు వారితో ఆడుకో బుజ్జి, తాతయ్య దగ్గరకు, అదిగో అమ్మమ్మను చూడు ఏం చేస్తుందో అంటూ ఇలా చెప్పడం వలన వెళతారు. కానీ ఒక సంవత్సరం లేదా సంవత్సరం నిండిన పిల్లలు త్వరగా అమ్మను విడిచి ఉండలేరు. అటువంటప్పుడు పిల్లలతో ఎలా మెలగాలో చూడండి.. 

నవ్వించడం 

ఏ పిల్లలకు అయినా సరే నవ్వించే వారంటే చాలా ఇష్టం. అమ్మ స్పర్శ పిల్లలకు బాగా తెలుస్తుంది కాబట్టి ఎప్పుడు అమ్మతో గడపటానికి ఇష్టపడతారు. అయితే ఇతరులు ఇలా కాదు కదా, అందుకని చిన్నగా చక్కిలిగింతలు పెట్టడం, కడుపుపై ముద్దు పెట్టడం, పాదాలపై మెత్తగా నెమరటం, ఎత్తుకుని అటూఇటూ తిప్పడం వలన మిమ్మల్ని గుర్తుపెట్టుకోగలరు. ఎత్తుకుని తిరిగేటప్పుడు చిన్న పిల్లలను పైకి కిందకు ఎగురవేయడం చేయకూడదు. 

డ్రెస్ వేయడం తీసివేయడం 

అమ్మ పిల్లలతో ఎంత అనుబంధంగా ఉంటుందో అలాగే మీరు పిల్లలతో ఉన్నప్పుడు అమ్మ ప్రేమ తగ్గకుండా చూసుకోవాలి. చిన్నపిల్లలకు కొందరిలో వాతావరణం మారినప్పుడు ఉక్కగా ఉంటుంది. ఇలాంటప్పుడు పిల్లలు వెంటనే ఏడుస్తుంటారు. అందుకని పిల్లలకు ఇబ్బందిగా ఉండే డ్రెస్ తీసివేయడం, పిల్లలకు చలిగా ఉన్నప్పుడు డ్రెస్ వేయడం, పిల్లలు మల మూత్ర విసర్జన చేసినప్పుడు వారికి చాలా చిరాకుగా ఉంటుంది, అందుకని పిల్లలను అమ్మ కేరింగ్ గా చూసుకునేలా వెంటనే ఈ పనులు చేయాలి. 

బొమ్మలతో ఆడించడం 

పిల్లలు ఎప్పుడు ఎందుకు ఏడుస్తారో చెప్పడం చాలా కష్టం. ఆకలి కోసమా, ఏమైనా నొప్పిగా ఉందా, పడుకున్న బెడ్ పై చిరాకుగా ఉందా..!, అమ్మ చాలాసేపు కనిపించకపోయినా వెంటనే ఏడవటం చేస్తుంటారు. అలాగే కొత్తవాళ్లతో కొద్దిసేపు ఉండాలన్నా సరే ఏడవటం మొదలుపెడతారు. అందుకని పిల్లలతో వీలైనంతవరకు వారికి ఇష్టమైన బొమ్మలను దగ్గరకు చేర్చి మీరు కూడా చిన్నపిల్లలుగా వారితో ఆడుకోవడం, ఆడించడం చేయాలి. అప్పుడు వారికి చాలా ఆనందం కలుగుతుంది మరియు మీతో ఉండటానికి ఇష్టపడతారు. 

వారికి నచ్చిన పాటలు పెట్టడం 

ప్రస్తుతం చాలామంది తల్లితండ్రులు తమ పిల్లలు ఏడుస్తున్నప్పుడు ఏదైనా సినిమాలో వస్తున్న పాట పెట్టడం వలన తమ పిల్లల ఏడుపు ఆపేసినట్లయితే ఇకపై అలాగే చేస్తుంటారు. అదే విధంగా టీవీలో వచ్చే కార్టూన్స్, రైమ్స్ పెట్టడం వలన పిల్లలు ఎంతో ఇష్టంగా చూస్తారు. అలా మీరు కూడా పిల్లల ఏడుపు ఆపడటానికి వారితో మచ్చిక చేసుకోవడానికి, పిల్లలు మీతో ఉండేందుకు వారికి నచ్చిన పాట పెట్టడం, కార్టూన్స్ పెట్టడం చేయండి. ఇలా మీ పిల్లలు కూడా పాటలు చూస్తే లేదా కార్టూన్స్ వింటే ఏడుపు ఆపుతున్నట్లైతే కామెంట్ చేయండి.. 

ఇవి అస్సలు ఇవ్వకండి 

ఇది కంప్యూటర్, స్మార్ట్ ఫోన్స్ కాలం కాబట్టి ప్రతి ఇంట్లోనూ ఇవి ఉండటం సర్వసాధారణమే అయ్యింది. అయితే పిల్లలు ఏడుస్తున్నప్పుడు లేదా మీ దగ్గరకు పిల్లలు రానప్పుడు ఇదిగో బాబు సెల్ తీసుకో, ఇదిగో ఇక్కడ చూడు ఎవరున్నారో అంటూ కెమెరాలో ఫోటోలు చూపించడం వంటివి చేస్తుంటారు. చిన్నతనంలోనే ఇలా పిల్లలకు సెల్ ఫోన్స్, కంప్యూటర్స్ అలవాటు చేయడం మంచిది కాదు. అలాగే చాలామంది పిల్లలకు ఏవైనా తినిపించేవి చూపించి నా దగ్గరకు వస్తే ఇదిగో నీకు ఇవి ఇస్తాను అంటూ మచ్చిక చేస్తూ ఉంటారు. అటువంటి తినుబండారాలు చిన్నపిల్లలకు ఇవ్వకండి. వారి ఆరోగ్యం ఎలా ఉందో ఏవి తినిపించాలి పిల్లల అమ్మానాన్నలను అడిగి తెలుసుకోవాలి. 

ఇవండీ పిల్లలను మచ్చిక చేసుకోవడానికి, మీ దగ్గర ఏడవకుండా ఆనందంగా ఉండటానికి ఏం చేయాలో. ఇవి మీకు నచ్చి ఉంటే అందరికీ షేర్ చేయండి, మర్చిపోకుండా కామెంట్ చేయండి..

.....................................................................................................

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon