Link copied!
Sign in / Sign up
4
Shares

పిల్లలలో ప్రమాదకరమైన ‘కోరింత దగ్గు’ ను గుర్తించడానికి 7 లక్షణాలు


కోరింత దగ్గు, చాలా ప్రమాదకరమైన అంటు వ్యాధి. దీనినే పెర్టుసిస్ (pertusis) అంటారు. ఈ జబ్బు బాక్టీరియా ద్వారా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి వచ్చిన వారికి శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది, ఊపిరితిత్తుల్లో మంటగా ఉంటుంది. విపరీతంగా దగ్గుతూ ఉంటారు. ఈ జబ్బును పిల్లలలో ముందే గుర్తించి, సరైన వైద్యం చేయించక పోతే తీవరమైన పరిణామాలు ఎదురుకోవాలి. పిల్లలలో కోరింత దగ్గుకు లక్షణాలు ఇవే…. .

1. ముక్కు కారడం

పిల్లలలో సాధారణంగా వచ్చే జలుబు వలన కూడా ముక్కు కారుతుండచ్చు. కానీ ఎక్కువ రోజు ఈ లక్షణం ఉన్నా, విపరీతంగా ముక్కు కారుతున్నా,అది కోరింత దగ్గు అయ్యే ప్రమాదం ఉంది.

2. తుమ్ములు

చాలా మంది తల్లి తండ్రులు, తుమ్ములను అంత ప్రమాదకరమైనవిగా భావించరు. కానీ తుమ్ములు ఆగకుండా వస్తున్నా, లేదా తుమ్ములతో పాటు దగ్గు కూడా ఉన్నా, అవి కోరింత దగ్గు లక్షణాలు. వెంటనే పిల్లలను డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళాలి.

3. పొడి దగ్గు

పిల్లలకు సాధారమైన జలుబు చేసినప్పుడు కూడా దగ్గుతుంటారు. కానీ పొడి దగ్గు చాలా విపరీతమైన నొప్పిని, బాధని పిల్లలకు కలిగిస్తుంది. పిల్లలు ఒక నిమిషం పాటు ఆపకుండా దగ్గుతుంటే అది కోరింత దగ్గు లక్షణం.

4. జ్వరం

పిల్లలకు మరి ఎక్కువగా కాకుండా స్వల్పమైన జ్వరం వస్తూపోతూ ఉంటే, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి జ్వరం పిల్లలకు వస్తే గుర్తించడం కష్టం. అందుకే పిల్లలు మందంగా ఉన్నపుడు జ్వరం ఉందేమో చెక్ చేయండి. ఇలాంటి జ్వరం కోరింత దగ్గు లక్షణం.

5. దగ్గు

ఈ జబ్బు వలన వచ్చే దగ్గు, సాధారణమైన దగ్గు వేరుగా ఉంటాయి. అరనిమిషం పాటు ఆపకుండా దగ్గడం, దగ్గు పొడిగా ఉండడం, దగ్గేటప్పుడు కూత  పెట్టడం, ఇవన్నీ కోరింత దగ్గు లక్షణాలు. అందుకే పిల్లలు దగ్గేటప్పుడు గమనిస్తుండండి. ఈ లక్షణాలు ఏమైనా కనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకు వెళ్ళండి.

6. శ్వాస సమస్యలు

ఈ జబ్బు పిల్లలలో, ఊపిరి తిత్తుల ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. దీని వలన పిల్లలకు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ఊపిరి ఆగి ఆగి తీసుకుంటుంటారు. అలా చేయడం కోరింత దగ్గు లక్షణం.

7. నీరసంగా ఉండడం

ఈ జబ్బు ఉన్న పిల్లలు ఎప్పుడు నీరసంగా ఉంటారు. ఊరికే చికాకు పడుతుంటారు. ఎక్కువగా ఏడుస్తువుంటారు. మీ పిల్లలలో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళండి.

గమనిక: కోరింత దగ్గును పెర్టుసిస్ వాక్సిన్( PERTUSIS VACCINE) తో నివారించచ్చు. ఈ వాక్సిన్ మీ పిల్లలకు తప్పకుండా వేయించండి.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon