Link copied!
Sign in / Sign up
40
Shares

పిల్లలలో పళ్ళు పుచ్చిపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు : నిర్లక్ష్యం చేస్తే చాలా ఇబ్బందులు వస్తాయి..

పిల్లలు పుట్టిన తర్వాత తల్లితండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలలో దంతాల సంరక్షణ అతి ముఖ్యమైనది. లేకపోతే దంతాలు పుచ్చిపోవడం, దంతాల మధ్య ఇన్ఫెక్షన్ రావడం, పళ్ళు దృఢంగా లేకపోవడం జరుగుతుంది. చిన్న పిల్లలలో పళ్ళు పుచ్చిపోకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..

పాల పళ్ళు వచ్చిన తర్వాత

పిల్లలకు 6 నెలల తర్వాత పళ్ళు రావడం జరుగుతుంది. వీటినే పాల పళ్ళు అని అంటారు. పాల పళ్ళ తర్వాత కింద ఉండే శాశ్వత దంతాలు రావడం జరుగుతుంది. పాల పళ్ళను జాగ్రత్తగా చూసుకోవడం వలన కింద ఉండే దంతాలకు మంచి రక్షణగా ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్ లో పిల్లల పళ్ళు పుచ్చిపోకుండా ఫ్లోరెడ్ ఉన్న టూత్ పేస్ట్ లు వాడటం వలన దంతాలను కాపాడుకోవచ్చు.

తల్లి నుండి బిడ్డ పాలు తాగిన తర్వాత

ఇలా చాలా తక్కువమందే చేస్తుంటారు. బిడ్డ తల్లి నుండి పాలు తాగిన తర్వాత నోటిని తడి బట్టతో లేదా దూదిని నీటిలో ముంచి శుభ్రం చేయడం మంచిది. ఇలా చేయడం వలన పాల పళ్లకు ఎటువంటి ఇబ్బంది ఉండదు.

చాకోలెట్స్ జంక్ ఫుడ్స్

పిల్లలు ఎక్కువగా చాకోలెట్స్ జంక్ ఫుడ్స్ తినడం చేస్తుంటారు కాబట్టి తిన్న వెంటనే నీటితో బాగా పుక్కిలించడం చేయించాలి. వీలయితే బ్రష్ చేయించడం చాలా మంచిది. ఎందుకంటే ఇవి పళ్ళ సందులో ఇరుక్కుపోయి ఉండటం వలన అక్కడ బాక్టీరియా వృద్ధి చెందుతుంది.

పళ్ళపై గార

నిద్రలేచిన తర్వాత పళ్ళను శుభ్రంగా బ్రష్ చేయకపోవడం, కలుషిత నీటిని సేవించడం వలన పళ్ళపై గార వచ్చి వికారంగా కనిపించేలా చేస్తాయి. సాధారణంగా పాల పళ్ళు పోయి శాశ్వత పళ్ళు మళ్ళీ రావడం జరుగుతుంది, ఐతే పాల పళ్ళపై గార వచ్చి పాల పళ్ళు పోకుండా ఉండే అది పోగొట్టడం కష్టమవుతుంది.

తల్లి తండ్రులే చేయించాలి

పిల్లలు సరిగ్గా బ్రష్ చేసుకునేంత వరకు తల్లితండ్రులే దగ్గరుండి మరీ పిల్లలకు బ్రష్ చేయించాలి. లేకపోతే వారు సరిగ్గా బ్రష్ చేసుకోకపోవడం వలన పళ్ళ మధ్య ఇన్ఫెక్షన్ చేరి పంటి నొప్పిని కలిగిస్తుంది. ఎలా పడితే అలా బ్రష్ చేయడం వలన రక్తం కూడా వచ్చే ప్రమాదం ఉంది.

మీరు వాడిన వస్తువులు పిల్లలకు ఇవ్వకండి

తల్లికి పిల్లలు చిన్న వయస్సులో ఎక్కువ దగ్గరగా ఉంటారు కాబట్టి మీరు వాడిన వస్తువులను నోట్లో పెట్టుకోవడం వలన వాటికి ఉండే బాక్టీరియా పిల్లల నోట్లోకి చేరి పళ్ళపై ప్రభావం చూపుతుంది.

6 నెలలకు ఒకసారి

పిల్లలు దంతాలు సంరక్షణగా ఉన్నాయో తెలుసుకోవడానికి 6 నెలలకు ఒకసారి దంత వైద్యుడిని సంప్రదించడం చేయాలి. అలాగే రెండు నెలలకు ఒకసారి పిల్లల బ్రష్ మార్చడం, పిల్లలు పేస్ట్ మింగకుండా చెప్పాలి.

వేప పుల్ల

అప్పుడప్పుడు పిల్లలకు వేప పుల్లతో బ్రష్ చేయించడం నేర్పించడం వలన నోటిలో సూక్ష్మక్రిములు చంపివేసి పళ్లకు మంచి రక్షణగా ఉంటుంది. అలాగే స్వీట్స్ పదార్థాలు తక్కువగా తినేలా చూసుకోవాలి. ఆకు కూరలు బాగా ఇవ్వాలి.

ఈ ముఖ్యమైన సమాచారాన్ని అందరికీ SHARE చేయండి. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon