Link copied!
Sign in / Sign up
2
Shares

పిల్లలు డిప్రెషన్ కు గురైతే తల్లి తండ్రులుగా మీరు ఏమి చేయాలి?


డిప్రెషన్ అనేది ఎంత భయకరమైనదో అనుభవించే వారికే తెలుస్తుంది. డిప్రెషన్ కి గురి అవ్వడానికి అనేక కారణాలు, తెలిసో తేలికో చాల మంది దాని బారిన పడుతుంటారు. ఈ భయంకర స్థితి పెద్దలనీ కాదు చిన్న పిల్లలను కూడా బాధిస్తుంది.

సాధారణంగా డిప్రెషన్ బారిన పడిన పిల్లలు తమ ఉత్సాహాన్ని, శక్తిని కోల్పోతారు. చిన్న చిన్న విషయాలకే ఎక్కువ కోప్పడటం లేదా బాధ పడటం చేస్తుంటారు. ఇలా ఎక్కువ ఇంట్లోనే చేస్తుంటారు కానీ బయట స్కూల్ లేదా కాలేజీలో వారి భావాలను అణుచుకుంటుంటారు. Opposition Difient Disorder తో బాధ పడుతున్న పిల్లలు బయట సహజంగానే ప్రవర్తిస్తారు కానీ ఇంట్లో మాత్రం విచిత్రంగా ప్రవర్తిస్తారు. ఈ మధ్య నేషనల్ ఇన్టిట్యూట్ ఆఫ్ హెల్త్ జరిపిన ఒక సర్వే ప్రకారం, చిన్న పిల్లల్లో డిప్రెషన్ని నయం చేయడం అంత సులువు కాదని వెల్లడించింది. అది ప్రతి పిల్లాడికి ఒకేలా ఉండదు మరియు వివిధ దశల్లో అనేక రకాలుగా ఉండటం వలన దీనిని నిర్మూలించం కష్టం అని అనేక మంది మానసిక వైద్యులు పేర్కొన్నారు.

పిల్లలు డిప్రెషన్కి గురి అయ్యారు అని తెలియచేసే లక్షణాలు

డిప్రెషన్ అనేది వాటి లక్షణాలను బట్టి అనేక రకాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఇప్పుడు తెలుసుకుందాము.

Major Depressive Disorder

అంటే తీవ్రమైన డిప్రెషన్ అని అర్థం. దీని లక్షణాలు పిల్లలను దేని మీద ఏకాగ్రత లేకుండా చేస్తుంది. దీనితో బాధపడే వారు సరిగ్గా చదవరు, తినరు కనీసం నిద్ర కూడా హాయిగా పోరు. ఇది పూర్తిగా నయం అవ్వకపోతే తరుచు వచ్చి పిల్లలను బాధిస్తూ ఉంటుంది.

Dysthymic Disorder

దీనిని డేస్తేమియా అని కూడా అంటారు. ఇది చిన్నదే కానీ ప్రమాదకరమైనది. దీని లక్షణాలు చాలా ఎక్కువ రోజులు అంటే సుమారు 2 సంవత్సరాలు లేదా అంత కంటే ఎక్కువ రోజులు ఉంటాయి. ఇది మేజర్ డిప్రెషన్ కంటే తక్కువ ప్రమాదకరమైనదే కానీ, దీని బారిన పడిన పిల్లల కూడా రోజు వారి పనులు చేసాయడానికి ఇబ్బంది పడుతుంటారు. ఈ డిప్రెషన్ ఒక మనిషి జీవితంలో ఒక కంటే ఎక్కువ సార్లు వచ్చే ప్రమాదం ఉంది.

Minor Depression

ఇది కూడా పైన చెప్పిన రెండు డిప్రెషన్ల లాంటిదే. కానీ లక్షణాలు కొంచెం తక్కువ ప్రమాదకరమైనవిగా ఉంటాయి. దీని ముఖ్య లక్షణం ముక్కు మీదనే కోపం ఉండటం. ఈ డిప్రెషన్నీ సరైన సమయంలో చికిత్స చేయకపోతే మేజర్ డిప్రెషన్గా మారే ప్రమాదం ఉంది.

వైద్యం ఎలా?

డిప్రెషన్తో బాధపడుతున్న పిల్లలు తీవ్రతను బట్టి చికిత్స ఉంటుంది. కొన్ని ముఖ్యమైనవి మీకోసం…

మానసిక ఆరోగ్య సంరక్షణ నిపుణులతో మాట్లాడి సమస్యను పరీక్షించుకోవడం దీనిలో ముఖ్యమైనది. డిప్రెషన్ చికిత్స రకాలు:

1. Cognitive-behavioral therapy (CBT)

ఈ చికిత్సలో ప్రధానంగా పిల్లాడి ఆలోచనా విధానంలో మార్పు తేవడం ఉంటుంది. చెడు ఆలోచనలు దూరం చేసి మంచి ఆలోచనలు ప్రేరేపించడం ద్వారా డిప్రెషన్ని తగ్గించడం.

2. Interpersonal therapy (IPT)

మానవ సంబంధాలను గురించి తెలియ చేసి, వారి మధ్య ఏమైనా సమస్యలు ఉంటె పరిష్కార దిశగా చికిత్స ఉంటుంది.

మొత్తంగా డిప్రెషన్ తీవ్రతను బట్టి, మానసిక వైద్యుడు థెరపీని సిఫారసు చేస్తారు. అది ఒక సరి 10 నుండి 20 వరాల వరకు ఉండచ్చు లేదా ఇంకా ఎక్కువ సమయం పట్టవచ్చు. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon