Link copied!
Sign in / Sign up
8
Shares

పిల్లలలో డైపర్ వలన వచ్చే ప్రమాదకరమైన దద్దుర్లు : 5 నిముషాల్లో దూరం చేసే అద్భుత ఇంటి చిట్కాలు

డైపర్ వలన వచ్చే దద్దుర్లు అనేవి పిల్లలో చాలా సహజం. ఇది సాధారణంగా తడి డైపర్ ను సమయానికి మార్చలేకపోవడం వలన వస్తూ ఉంటుంది. పిల్లల యూరిన్ డైపర్ లో వుండి అది శరీరంని తాకుతూ వుండి వాళ్ళ యూరిన్ లో వున్న అమోనియా మరియు రసాయనాలు మరియు శరీరం యొక్క సంఘర్షణ వలన దద్దుర్లు వస్తాయి. దీనికి మీరు కలత చెందనవసరం లేదు ఇంట్లో వున్న వాటితోనే సులువుగా ఈ దద్దుర్లని నయం చేసేయవచ్చు. మరి ఆ చిట్కాలు ఏంటో చూసేద్దామా మరి ?

1. బేకింగ్ సోడా లేదా వంట సోడా

అర టీస్పూను బేకింగ్ లేదా వంట సోడా తీసుకుని ఒక చిన్న గిన్నె లో నీళ్లు తీసుకుని అందులో కలపండి. పూర్తిగా కలిసేదాకా బాగా కలపండి. ఇప్పుడు ఈ ద్రవ్యమును కాటన్ లేదా మెత్తని వస్త్రము తో పిరుదులు పైన రాయండి. ఈ ద్రవ్యము తో మీ పిల్లలకి మీరు స్నానం కూడా చేయించవచ్చు. నీళ్లు వెచ్చగా ఉండేట్టు గా చూసుకోండి.

2.వేప ఆకులు

కొన్ని వేప ఆకులు నలిపి కొంచెం నీళ్లు కలిపి పేస్ట్ లాగా చేసుకోండి. దీనికి మీరు సెనగ పిండి కూడా కలుపుకోవచ్చు . దద్దుర్లు వచ్చిన చోట ఇది పూసి ఒక 20  నిముషాలు తరువాత కడిగేయండి.

3. వెనిగర్

డైపర్ వల్ల వచ్చే దద్దుర్లు ని గుణపరచడం లో ఎంతో మెరుగైనది. వెనిగర్ ని దద్దుర్లు ఉన్న చోట పూసి ఒక 20 నిముషాలు అవ్వగానే కడిగేయండి.

4. ఓట్స్

ఓట్స్ ని గ్రైండ్ చేసి దానికి నీళ్లు కలిపి దద్దుర్లు వచ్చిన చోట పూసి మీ పిల్లలకి దానితో స్నానం చేయించండి. ఓట్స్ లో వున్న సపోనిన్ (saponin) అనే రసాయనం చర్మం పైన ఉన్న మురికి ని తొలగిస్తుంది.

5. ముల్తానీ మట్టి

ముల్తానీ మట్టి కూడా ఎంతో మెరుగైన చిట్కా. ముల్తానీ మట్టిని కొద్దిగా నీరు  తీసుకొని కలిపి దద్దుర్లు వచ్చిన చోట పూసి ఒక ౩౦ నిమిషములు తరువాత తాజా విప్స్ తో తుడిచేయండి. మీరు కొబ్బరి నూనె ని కూడా వినియోగించవచ్చు.

డైపర్ ని సరైన సమయములో మార్చి ఆ చోటు ని శుభ్రం చేస్తూ ఉండండి. శుభ్రంగా ఉన్న వస్త్రాలు మాత్రం శుభ్రం చేయడానికి వినియోగించండి.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon