Link copied!
Sign in / Sign up
1
Shares

మీ పిల్లలలో భయం పోగొట్టడానికి ఈ 5 చిట్కాలు ఫాలో అవ్వండి..

పిల్లలు ఎక్కువగా చేస్తున్నప్పుడు బూచోడు వస్తాడు నిన్ను ఎత్తుకెళతాడు అంటూ చీకటిని చూపించి పిల్లలను భయపెట్టడం, ఎవరైనా కొత్త వ్యక్తులు ఇంటికి వచ్చినప్పుడు వారిని చూసి భయపడటం, అమ్మనాన్నలు దూరంగా ఉంటే భయపడటం, ఎక్కువగా వినికిడి చేసే శబ్దాలు, క్రిమికీటకాలు..ఇలాంటివి చూసినప్పుడు పిల్లలు ఎక్కువగా భయపడుతూ ఉంటారు. అలాగే స్కూల్ లో ఎవరైనా నువ్వు పొట్టిగా ఉన్నావ్ అని ఏడిపిస్తున్నా కూడా భయపడుతూ ఉంటారు. కొన్ని భయాలు కాస్త ఫోబియాగా మారే ప్రమాదం ఉంది. అందుకని ఇక్కడ చెప్పుకునే ఈ చిట్కాలు మీ పిల్లలలో భయం పోగొట్టడానికి సహాయపడతాయి..

బలవంతం చేయకూడదు 

మీరు ఏమైనా పని చేయమనప్పుడు, అక్కడికి వెళ్లి అది తీసుకురా అని చెప్పినప్పుడు పిల్లలు ఉత్సాహంగా వెళ్లకుండా వెనకడుగు వేస్తున్నారంటే వద్దని చెప్పాలి. బలవంతం చేసి వెళ్ళమనకూడదు. ఇలా చేయడం వలన వారికి భయం ఇంకా పెరుగుతుందే కానీ తగ్గదు. మీకు ఆ పని సులువుగా అనిపించవచ్చు, కానీ మీ పిల్లలకు మాత్రం అదే పెద్ద భయం. అందుకని ఎక్కువగా బలవంతం చేయకండి. అలా వాళ్ళు ఏదైనా చేయలేనప్పుడు, భయపడుతూ ఉంటే మీరే దగ్గరుండి అక్కడికి వారిని తీసుకెళ్లి చూడు ఏమీ లేదని ధైర్యాన్ని నింపాలి. 

పిల్లల భయం ఏంటో అడిగిమరీ తెలుసుకోవాలి 

వాళ్ళు భయపడే విషయాలను ఎవరికైనా చెబితే నవ్వుతారు, ధైర్యం లేని పిరికివాళ్ళుగా చూస్తారు, ఆటపట్టిస్తారని తమ భయాలను అందరితో పంచుకోరు. అమ్మనాన్నలే అడిగిమరీ తెలుసుకోవాలి. పిల్లలను దగ్గరకు తీసుకుని నీకు ఏదైనా భయం ఉంటే నేను ఆ భయం పోగెట్టేస్తాను అంటూ ధైర్యం చెప్పాలి. వాళ్ళు చెప్పే విషయాలు సిల్లీగా ఉన్నాయని నవ్వడం చేయకూడదు, సరే అని ఆ భయాన్ని పోగెట్టే మార్గం ఆలోచించాలి. ఇలా చేసినట్లయితే పిల్లలు హ్యాపీగా ఉంటారు. 

అసలు నిజాలు చెప్పాలి 

హారర్ సినిమాలు, ఫ్రాంక్ వీడియోస్, దెయ్యం సినిమాలు మీతో పాటు చిన్నపిల్లలు చూస్తున్నప్పుడు నిజంగా చీకట్లో మన గదిలోకి వస్తాయేమో అని పిల్లలు భయపడుతూ ఉంటారు ఎక్కువగా. అవి అసలు నిజం కాదని పిల్లలకు అర్థం అయ్యేలా చెప్పాలి. చిన్న పిల్లలకు ఈ విషయాలు అర్థం కాకపోవచ్చు గానీ ఎదుగుతున్న పిల్లలకు నిజ జీవితానికి, సినిమాలలో చూపిస్తున్న దానికి మధ్య ఉన్న తేడాను అర్థం అయ్యేలా చెప్పాలి. 

సంతోషంగా ఉండేలా కొద్దిసేపు రిలాక్స్ ఇవ్వండి 

భయపడే విషయాలను పిల్లలు ఎక్కువగా గుర్తు చేసుకోవడం వలన, వారు విన్న కథలు లేదా చూసిన వీడియోలు తమ కళ్ళ ముందు కనిపిస్తున్నట్లుగా ఉండటం వలన భయంతో వణికిపోతూ ఉంటారు. అలాంటప్పుడు పిల్లలను ఒంటరిగా వదిలిపెట్టకూడదు. కూల్ గా ఉండమని కూర్చోబెట్టి రిలాక్స్ అవ్వమని చెప్పాలి. ఇలా టెన్షన్ పడటం వలన వారి ఆరోగ్యానికి ప్రమాదం. వెంటనే వారికి నచ్చిన విషయాలు చెప్పడం, ఫన్నీగా ఉండే విషయాలు గుర్తుచేయడం చేయాలి. అక్కడ ఏమీ లేదు అంటూ ధైర్యాన్ని ఇవ్వాలి. 

పిల్లలకు ఉండే అలవాటు 

చాలామంది పిల్లలు టీవీలలో వచ్చే కార్టూన్స్ చూసి భయపడుతూ ఉంటారు. రాత్రి పడుకున్నప్పుడు లేదా గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు కార్టూన్స్ లో ఉండే విలన్ లేదా రాక్షసుడు తమ దగ్గరకు వస్తున్నాడనే భయం ఎక్కువగా ఉంటుంది. ఆ క్షణం వరకు భయపడినా కూడా, మళ్ళీ నెక్స్ట్ రోజు కార్టూన్స్ చూడటం మాత్రం వదిలిపెట్టరు. అమ్మను అడిగిమరీ ఆ కార్టూన్స్ పెట్టించుకుంటారు. ఇలా భయపడుతున్నప్పుడు అందులో హీరో ఏం చేస్తాడో, వాటితో ఎలా ఫైట్చేస్తాడో నువ్వు కూడా అలా చేయాలి, ఇలా భయపడకూడదు అంటూ సున్నితంగా అర్థం అయ్యేలా చెప్పాలి. 

పిల్లల భయాలు పోగొట్టడానికి కొందరు అంత్రాలు, మంత్రాలు అంటూ వెళ్తుంటారు. అది పిల్లలపై ఉండే ప్రేమ వలన కాబట్టి, వారిని తప్పుగా అర్థం చేసుకోకూడదు. అలాగే పైన చెప్పినట్లుగా పిల్లలలో భయాన్ని ఎలా పోగొట్టాలో చూశారు కదా.. 

.....................................................................................................

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon