Link copied!
Sign in / Sign up
18
Shares

పిల్లలకు వచ్చే అత్యంత ప్రమాదకరమైన 7 చర్మ సమస్యలు..వాటి పరిష్కారాలు

పసి పిల్లల చర్మం చాలా చాలా సున్నితం అని మనకు తెలిసిందే. ఇంత సున్నితంగా ఉండడం వలన చర్మసమస్యలు వచ్చే  అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే పిల్లలలో సాధారణంగా వచ్చే  చర్మ సమస్యల గురించి అవగాహన కలిగివుండడం, వాటిని ఎలా నివారించాలో తెలుసుకోవడం చాలా మంచిది.  పిల్లలలో సాధారణంగా వచ్చే అలాంటి చర్మ సమస్యలు ఇవే…

1.మిలియేరియా (Miliaria)

ఈ చర్మసమస్య ఉన్నప్పుడు, పిల్లల ముఖం, మెడ, వీపు భాగం, పిరుదుల మీద రాషెస్ కనిపిస్తాయి. పిల్లల శరీరంలో వేడి ఎక్కువైతే ఈ సమస్య వస్తుంది. పిల్లల శరీరంలో వేడి ఎక్కువవడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాతావరణం వేడిగా ఉండడం, ఇంకా ముఖ్యంగా పిల్లలకు బిగుతైన బట్టలు వేయడం. ఈ చర్మ సమస్య పిల్లలలో కనిపించిన వెంటనే మీరు చేయాల్సింది, పిల్లలకు బిగుతుగా ఉండే బట్టలు వాడకుండా, తేలికైన, వదులుగా ఉండే బట్టలు వేయడం.

2. మొటిమలు (Baby Acne)

చిన్న పిల్లలకు మొటిమలు వస్తాయని ఎవరు ఊహించరు. కానీ చిన్న పిల్లలలో ఈ సమస్య సహజం. ముఖం మీద చిన్న మొటిమలు వస్తాయి. కొన్ని సార్లు అవి తెల్లగా చీము తో ఉంటాయి. ఇవి వాటంతట అవే తగ్గిపోతాయి. మీరు ఏదైనా సొంత వైద్యం ప్రయత్నిస్తే అవి ఇంకా తీవ్రం అవచ్చు. ఆలా చేయకండి.

3. అమ్మవారు (Chicken pox)

మీ పిల్లలకు వాక్సినేషన్ చేయించినా, చికెన్ ఫాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమస్య పిల్లలలో చాలా సాధారణం. సరైన వైద్యంతో దీన్ని పూర్తిగా నయం చేయచ్చు. చికెన్ ఫాక్స్ వచ్చినప్పుడు, పిల్లల శరీరం మొత్తం చిన్న కురుపులు వస్తాయి. పిల్లలకు జ్వరం, కండరాల నొప్పులతో బాధపడతారు.

4. ఎక్జిమా (Eczema)

ఈ చర్మ సమస్య వలన చర్మంలోని కొంత భాగం పొడిబారిపోతుంది, పగుళ్లు ఏర్పడతాయి, చర్మం ఎర్రగా కందిపోతుంది, ఆ ప్రాంతంలో దురదగా ఉంటుంది. చేతులు, మెడ, మోచేతులు, మోకాళ్ళు మీద ఇలా జరుగుతుంది. 3-4 నెలల వయసుగల పిల్లలలో,ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాతావరణంలోని మార్పులు, తడి బట్టలు వాడడం, బిగుతైన బట్టలు పిల్లలకు వేయడం వలన ఈ సమస్య వస్తుంది. ఈ సమస్య తీవ్రమైతే తప్పకుండా డాక్టర్ ను కలవాలి.

5. చలి కురుపులు(Cold sores)

ఈ సమస్య పిల్లలలో, పెద్దల్లో సహజంగా వ స్తుంది. నోటి చివర్ల, పెదాల పైన,  చిగుర్లల్లో కురుపులు వస్తాయి. మంటా, నొప్పి కలుగుతాయి. 5-10 రోజుల తరువాత పొక్కులు కట్టి, కురుపులు మానిపోతాయి. ఈ సమస్య రాకుండా ఉండాలంటే పిల్లలకు డిహైడ్రాషన్ కలగకుండా చూసుకోండి.

6. కండ్ల కలకలు (Conjuctivitis)

ఇది పిల్లలలో అత్యంత సహజంగా వచ్చే సమస్య. కళ్ళు ఎర్రగా అయిపోయి, కళ్ళ నుండి పుసి కారుతుంది. చాలా నొప్పిగా, కళ్ళు మంటగా ఉంటాయి. ఇది వచ్చిన వెంటనే పిల్లలను డాక్టర్ దగ్గరకు తప్పకుండా తీసుకెళ్ళండి. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon