Link copied!
Sign in / Sign up
1
Shares

పిల్లలకు సాలిడ్ ఫుడ్ తినిపించడం మొదలుపెట్టేటప్పుడు గుర్తించుకోవాల్సిన ముఖ్యమైన 3 విషయాలు


పాలు తాగే దశ నుంచి ఘన ఆహారం (solid food) తినే దశకు చేరుకోవడం, మీ పిల్లల జీవితంలో ఒక మైలురాయి. మీకు కొంత కష్టం తగ్గుతుంది. పిల్లలకు తినిపించాలనుకునే ప్రతి ఆహారాన్ని మెత్తగా, బజ్జిల చేయాల్సిన అవసరం లేదు. సులువుగా తినిపించచ్చు. అయితే ఈ దశలో పిల్లలు తినే ఆహారం, వారి  ఎదుగుదల మీద చాలా ప్రభావం చూపిస్తుంది. పిల్లలు సాలిడ్ ఫుడ్ తినడం మొదలుపెట్టిన తరువాత కొన్ని సమస్యలు కూడా ఎదురవుతాయి. అందుకే కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. అలాంటి ముఖ్యమైన మూడు విషయాలు….

1. తాజా ఆహారాన్ని మాత్రమే తినిపించండి

పిల్లలకు సాలిడ్ ఫుడ్ తినిపించడం మొదలు పెట్టేటప్పుడు, ముందుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. పిల్లలకు తాజా ఆహారాన్ని మాత్రమే ఇవ్వాలి. ఈ దశలో పిల్లల జీర్ణ వ్యవస్థ చాలా సున్నితంగా ఉంటుంది. మీరు తినిపించే ఆహారం కుళ్లిపోయున్న, పాడైపోయున్న, పిల్లలకు చాలా సమస్యలు వస్తాయి. కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు పిల్లలకు వచ్చే ప్రమాదం ఉంది.

2. పెద్ద ముక్కలు తినిపించద్దు

పిల్లలు ఈ దశలో ఆహారాన్ని నమలడం మొదలుపెడతారు. కానీ పెద్ద ముక్కలను నమలడానికి పిల్లలకు కొంత కష్టంగా ఉంటుంది. గొంతులో అడ్డుపడే ప్రమాదం ఉంది. అందుకే ఈ దశలో పిల్లలకు తినిపించే ఏ ఆహారాన్నైనా, చిన్న ముక్కలుగా చేసి మాత్రమే తినిపించాలి. అలాగే పిల్లలు నమల లేని, గట్టిగా ఉండే పదార్ధాలను కూడా తినిపించకండి.

3. తేన తినిపించద్దు

పిల్లలకు మొదటి సంవత్సరం దాటేంతవరకు, తేన కానీ, తేనెతో కూడిన ఏ ఆహార పదార్ధాలు కానీ తినిపించకండి. ఏడాది లోపు పిల్లలకు తేన అరగదు. దీని వలన పిల్లలకు అజీర్తి, కడుపు నొప్పి, అలెర్జీలు రావచ్చు. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon