Link copied!
Sign in / Sign up
21
Shares

పిల్లలకు పాలు ఇచ్చేటప్పుడు తీసుకోవాల్సిన 5 జాగ్రత్తలు : అమ్మలకు కూడా ఈ విషయాలు తెలియవు

మహిళలకు అమ్మ అవ్వడం అనేది ఎంత ఆనందాన్ని ఇస్తుందో, కడుపు చీల్చుకుని పుట్టిన బిడ్డకు ఆకలి తీరుస్తున్నప్పుడు మరింత ఆనందం కలుగుతుంది. ఇది మహిళలు మాత్రమే పొందగల గొప్ప సంతోషం మరియు అదృష్టం. అయితే పిల్లలకు పాల రూపంలో ఆకలి తీరుస్తున్నప్పుడు చాలామంది తల్లులు తమకు తెలియకుండా కొన్ని తప్పులు చేస్తున్నారు. ఇవి తల్లి, బిడ్డకు కూడా మంచిది కాదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. బ్రెస్ట్ ఫీడింగ్ చేసే సమయంలో ఈ 5 జాగ్రత్తలు తప్పక తెలుసుకోండి. అవేంటో తెలుసుకుని జాగ్రత్తపడండి.. 

ఆహారం 

బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నప్పుడు లేదా పిల్లలు తల్లి పాలను ఆరు నెలలకు పైగా తాగుతున్నప్పుడు మీరు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫుడ్ విషయంలో సరైన డైట్ పాటించాలి. ప్రోటీన్స్, విటమిన్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇలాంటి ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వలన మీకు మాత్రమే కాకుండా మీ బిడ్డకు కూడా ఆరోగ్యకరం. పిల్లలు త్వరగా ఎదగడానికి ఈ ఆహారాలే బాగా ఉపయోగపడతాయి. అలా కాకుండా మసాలా ఆహారాలు ఏవి పడితే అవి తినడం వలన బిడ్డకు ఇబ్బందిగా మారుతాయి. 

పాలు పట్టించే విధానం 

బిడ్డకు పాలు పట్టించేటప్పుడు తన ఎద భాగంలో రెండు చేతులతో పట్టుకుని ఒడిలో కూర్చోబెట్టుకున్నప్పుడు లేదా పడుకోబెట్టుకుని బ్రెస్ట్ ఫీడింగ్ చేపిస్తున్నపుడు బిడ్డకు పాలు సరిగ్గా అందుతున్నాయో లేదో చూసుకోవాలి. అంటే బిడ్డ పాలు తాగే పొజిషన్ ఎలా ఉంది? సరిగ్గా తనకు పాలు అందుతున్నాయా? లేదా! అని, ఎందుకంటే పసిపిల్లల నోరు, పెదాలు చాలా సున్నితంగా ఉండటం వలన పాలు తాగేటప్పుడు జారిపోతూ ఉంటాయి. అలా పాలపళ్ళు వచ్చినప్పుడు అక్కడ పిల్లలు కొరకడం వంటివి చేయకుండా సరిగ్గా పాలు పట్టించాలి. ఆ భాగంలో కొరికినట్లయితే మీకు రక్తం వచ్చి నొప్పి పుట్టే అవకాశం లేకపోలేదు. 

మందులు 

గర్భంతో ఉన్నప్పుడు, ప్రసవం దాల్చిన తర్వాత అమ్మగా మీరు ఎన్నో మెడిసిన్స్ తీసుకుంటూ ఉండవచ్చు. అయితే పిల్లలకు పాలు పట్టిస్తున్నప్పుడు డాక్టర్ చెప్పనటువంటి మందులు వేసుకోవడం అస్సలు చేయకూడదు. ఏదైనా చిన్న వెలితిగా ఉన్నా కూడా ఈ మెడిసిన్ వేసుకుంటే తగ్గిపోతుందిలే అని వేసుకోవడం మీకన్నా మీ నుండి పాలు తాగే బిడ్డకు ఆరోగ్యకరం కాదు. తల్లిగా మీ శరీరంలోకి వెళ్లే ప్రతి ఆహారం కూడా బిడ్డకు పాల రూపంలో చేరుతుందని గుర్తుంచుకోండి. 

నిద్ర 

మంచి నిద్ర మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. నిద్ర సరిగ్గా లేకపోతే ఎన్నో అనారోగ్యాలకు దారితీస్తుంది. బిడ్డకు పాలు ఇచ్చే తల్లులకు తప్పకుండా మంచి నిద్ర చాలా అవసరం. మీరు తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం మీరు మానసికంగా ఆనందంగా ఉంటేనే కదా, బిడ్డకు మీ నుండి చేరే ఆహారం సరిగ్గా అందుతుంది. అర్ధరాత్రులు బిడ్డ నిద్రలేచి పాలకోసం ఏడుస్తున్నట్లయితే పాలసీసాలో పాలు ఉంచి మీ భర్తను పాలు పట్టమని, బిడ్డను చూసుకోమని చెప్పాలి. 

ఈ రెండు అస్సలు చేయకూడదు 

పసిపిల్లలకు ఎప్పుడు ఆకలి వేస్తుందో అమ్మకంటే బాగా ఎవరికి తెలిసి ఉండదు. నిద్ర లేచిన వెంటనే ఏడుస్తున్నారంటే వారి ఏడుపు ఆపడానికి వెంటనే పాలు పట్టిస్తారు, అలా రోజుకి ఎన్నిసార్లు పాలు పట్టించాలి అనే విషయాలు మీకు గుర్తుండాలి. ఈ షెడ్యూల్ పిల్లల విషయంలో అస్సలు మర్చిపోకూడదు. ఇది బిడ్డ ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతుంది. అలాగే ఆల్కహాల్, స్మోకింగ్ వంటివి బిడ్డకు పాలు ఇచ్చే తల్లులు చేయకూడదు. 

ఇవండీ, పిల్లలకు పాలు పట్టించేటప్పుడు తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ విషయాలు అందరికీ తెలిసేలా షేర్ చేయగలరు.  

Image Source : Max Pixel

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon