Link copied!
Sign in / Sign up
0
Shares

పిల్లలకు పాలు ఇచ్చేటప్పుడు మందులు వేసుకోవచ్చా?

కొత్తగా బిడ్డకు జన్మను ఇచ్చిన తల్లికి భరించలేని జలుబు మరియు తలనొప్పి కలిగింది. బిడ్డకు తల్లి పాలు సురక్షితం అని తెలుసుకున్న ఆ తల్లికి ఇలా అనారోగ్యంతో ఉన్నప్పుడు, జలుబు, దగ్గు, తలనొప్పికి మందులు వాడుతున్నప్పుడు తన బిడ్డకు పాలు ఇవ్వవచ్చా? ఇవ్వకూడదా? అనే అనుమానం కలిగింది. ప్రతి తల్లీ తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి అందరికీ SHARE చేయండి.

జలుబు, తలనొప్పి మందులు వేసుకునే తల్లి పాలు ఇవ్వవచ్చా..?

జలుబు అనేది సూక్ష్మక్రిముల ద్వారా, చల్లని నీరు ఎక్కువగా తాగినప్పుడు, వాతావరణం మారినప్పుడు వస్తూ ఉంటుంది. జలుబు నుండి తలనొప్పి ఫ్లూ వ్యాపిస్తుంటాయి. తల్లి తీసుకునే ఆహారమే బిడ్డకు పాల రూపంలో చేరుతుంది కాబట్టి తల్లి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. భరించలేని జలుబు, తలనొప్పితో ఉన్నప్పుడు బిడ్డకు తల్లి పాలు ఇవ్వడం ప్రమాదమేమీ కాదు. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. ఎందుకంటే తల్లి నుండి బిడ్డకు ఈ టైములో ఎక్కువ ఇన్ఫెక్షన్స్ చేరే ప్రమాదం ఉంది.

బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

బ్రెస్ట్ ఫీడింగ్ చేసే సమయంలో తల్లి నుండి బిడ్డకు ఇన్ఫెక్షన్స్ అనారోగ్యంతో ఉన్నప్పుడు చేరుతాయి కాబట్టి బిడ్డకు పాలు పట్టించే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. కొన్ని రకాల మందులను మీ సొంతంగా తీసుకోకుండా ఏ మందులు వాడితే మంచిదో డాక్టర్ సలహా తీసుకుని వాడటం చేయాలి.

చేతులు శుభ్రంగా కడుక్కోవాలి

చేతులు శుభ్రంగా సబ్బుతో లేదా కొన్ని చేతులను శుభ్రం చేసుకునే కొన్ని రకాల క్రీములను అప్లై చేసుకుని బాగా క్లీన్ చేసుకుని బిడ్డను చేతులలోకి తీసుకుని బిడ్డకు పాలు పట్టించడం చేయాలి.

ముఖానికి మాస్క్ ధరించండి

జలుబుతో ఉన్నప్పుడు ఎక్కువ సూక్ష్మకారక క్రిములు చేరుతూ ఉంటాయి కాబట్టి ముఖానికి మాస్క్ ధరించడం చేయాలి. ఈ విధంగా చేయడం వలన బిడ్డకు ఇన్ఫెక్షన్స్ సోకకుండా జాగ్రత్త పడవచ్చు.

బిడ్డను కాస్త దూరంగా ఉంచండి

ప్రతి తల్లికీ బిడ్డపై ప్రేమ, మమకారం ఎక్కువగానే ఉంటాయి, ఐతే మీరు అనారోగ్యంగా ఉన్నప్పుడు బిడ్డను కాస్త దూరంగా ఉంచడం వలన ఇద్దరికీ మంచిదే ముఖ్యంగా మీ బిడ్డకు. మీకన్నా మీ బిడ్డలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళను జాగ్రత్తగా చూసుకోవాలి.

జలుబు వెంటనే తగ్గాలంటే ఏం చేయాలి?

జలుబు నుండే తలనొప్పి, ఫ్లూ, జ్వరం..ఇలా ఒకదానికొకటి వ్యాపిస్తూ ఉంటాయి కాబట్టి వేడి నీరు తీసుకుని అందులో కాస్త పసుపు వేసి ఆవిరి పట్టుకోవడం, గొంతు నొప్పి ఉంటే గోరు వెచ్చని నీటిలో కాస్త ఉప్పు కలిపి పొక్కిలించడం, ఎక్కువగా నీరు తాగడం చేయాలి. ఎందుకంటే మీ శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉండటానికి.

తల్లి ఆరోగ్యంగా ఉంటేనే కదా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. అందుకే అందరూ తెలుసుకునేలా SHARE చేయండి.

ఇవి కూడా చదవండి. 

భర్త నుండి భార్య కోరుకునే 10 రొమాంటిక్ పనులు

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon