Link copied!
Sign in / Sign up
7
Shares

పిల్లలకు పాలు తాగేటప్పుడు ఈ 3 పనులు చేస్తే వారికి అస్సలు నచ్చదు : చాలా ప్రమాదం కూడా..!

కొత్తగా తల్లి అయిన తర్వాత అందరి కన్నా ఎక్కువగా ఒత్తిడికి గురయ్యేది ఒక్క అమ్మ మాత్రమే. బిడ్డకు ఏ ఆహారం ఇవ్వాలి, ఎలా తయారు చేసుకోవాలి, ఏ టైములో ఏది తినిపించడం కరెక్ట్..ఇలా ఎన్నో అనుమానాలు అమ్మ మనస్సులో ఎప్పుడు మెదలాడుతూనే ఉంటాయి.  అలాగే బిడ్డకు పాలు ఇచ్చేటప్పుడు కొందరు తల్లులు కొన్ని రకాల తప్పులు చేస్తుంటారు. ఇలా చేస్తే మీ బిడ్డకు అస్సలు నచ్చవు. అలాగే వారికి ప్రమాదం కూడా.. మరి ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలుసుకోండి..

టైం పెట్టుకోకండి..

కొత్తగా తల్లి అయిన వారు పసిబిడ్డలకు పాలు ఇచ్చేటప్పుడు రోజుకు కొన్నిసార్లు ఫలానా టైములో ఇద్దాం అని ఆ సమయంలో మాత్రమే బిడ్డ ఆకలి తీరుస్తూ ఉంటారు. మీరు అలా షెడ్యూల్ పెట్టుకోకండి. ఎందుకంటే బిడ్డకు ఆకలి ఎప్పుడు ఏ సమయంలో కలుగుతుందో తెలియదు కాబట్టి, ఏడుస్తున్నప్పుడు, రోజు మొత్తంలో చాలా తక్కువసార్లే తల్లి పాలు తాగకపోయినా ఒక్కసారి మీఎదభాగానికి దగ్గరగా ఉంచండి.

ఈ తప్పులు అస్సలు చేయకండి

బిడ్డకు పాలు ఇస్తూ కొందరు భోజనం చేయడం, స్మార్ట్ ఫోన్ చూసుకుంటూ సమయం గడపడం, టీవీ చూస్తూ ఉండటం..ఇలా ఎన్నో రకాలుగా పనిచేస్తూ ఉంటారు. తల్లి, బిడ్డ మధ్య మంచి బంధాన్ని పెంచే ప్రక్రియ బిడ్డకు తల్లి పాలు ఇవ్వటం. ఆ బంధం బాగా ఉండాలంటే పైన చెప్పినట్లు చేయకూడదు. అంతే కాకుండా బిడ్డ ఎంత సమయం, ఎంత మొత్తంలో పాలు తాగుతున్నాడో అమ్మకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి నిర్లక్ష్యం చేయకూడదు.

ఈ మందులు తీసుకుని..

ప్రసవం తర్వాత డాక్టర్ చెప్పిన విధంగా కాకుండా, జలుబు చేసినా, నొప్పులుగా ఉన్న తమంతట తామే బయట నుండి మందులు తెచ్చుకుని వేసుకుని బిడ్డకు పాలు ఇవ్వడం వలన బిడ్డకు మంచిది కాదని అంటున్నారు డాక్టర్స్. అలాగే కొంతమంది ధూమపానం సేవించేవారి పక్కనే ఉంటే, మరికొందరు ఆల్కహాల్ వంటివి తీసుకుని బిడ్డకు పాలు ఇవ్వడం వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.

బలవంతం చేయకూడదు

బిడ్డ ఆకలితో ఉండి ఏడుస్తుంటే తల్లి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఆ సమయంలో ఎందుకు ఏడుస్తున్నాడో తెలియకపోవడం వలన నేరుగా పాలు తాగించడం చేస్తుంటారు. కారణం ఆకలి ఐతే ఫర్వాలేదు, కానీ పాలు తాగడం లేదు కదా అని బలవంతం చేయడం వలన వారికి నచ్చదు మరియు మళ్ళీ పాలు తాగడానికి నిరాకరిస్తారు.

అస్సలు సిగ్గుపడకండి

మీ కడుపు చీల్చుకు పుట్టిన బిడ్డ ఆరోగ్యమే మీకు ముఖ్యం కాబట్టి, ఎప్పుడైనా ఎక్కడైనా బిడ్డ పాల కోసం ఎదురుచూస్తూ ఉంటే అక్కడికక్కడే పాలు ఇవ్వండి. మీ చుట్టూ ఎవ్వరు ఉన్న సిగ్గుపడకండి. అమ్మ గొప్పదనాన్ని తెలిపే గొప్ప పని చేసేటప్పుడు ఇంకొకరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.

మీ బిడ్డ ఆరోగ్యంగా ఉంటేనే కదా, మీరు హ్యాపీగా ఉంటారు. అందరికీ ఈ సమాచారం SHARE చేయండి..  

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon