Link copied!
Sign in / Sign up
21
Shares

పిల్లలకు ఆయిల్ మసాజ్ ఎలా చేయాలి? ఏ నూనె వాడటం పిల్లలకు ఆరోగ్యకరం

పిల్లల సంరక్షణ నూనె మర్దన లేకుండా పూర్తి అవ్వదు. శిశువు బాగా నిదురపోయినపుడే ఒక్క అమ్మ సంతోషిస్తుంది. నూనె మర్దన చేయడం వల్ల మీ శిశువు హాయిగా నిదురపోతుంది. మీ శిశువు ఆరోగ్యం కొరకు ప్రతి రోజు నూనె మసాజ్ తప్పనిసరి. కానీ ఇది తగిన మోతాదు లో మాత్రమే చేయాలి. శిశువు చర్మం ఎంతో మెత్తగా మరియు మృదువుగాను ఉంటుంది. మసాజ్ చేస్తపుడు జాగ్రత్తగా చేయాలి మరియు అన్ని మసాజ్ పద్ధతులు పిల్లలకి వర్తించవు.

ఎటువంటి నూనె ని మర్దన కొరకు వినియోగించాలి?

మీరు మొదటి సారి తల్లి అయితే మీకు బేబీ ఆయిల్ వినియోగించడం  కాస్త కష్టాంగా అనిపించవచ్చు. అందువలన మొక్కల నుండి వచ్చిన నూనెని వినియోగించటం మంచిది. క్రింది ఉన్న నూనె రకాలు మెరుగైన రీతి లో పని చేస్తాయి.

ఆవాల నూనె

ఎన్నో ఏళ్ల ముందు నుండే తల్లులు తమ శిశివువులకు ఆవాల నూనె తో మర్దన చేస్తూ ఉంటారు. ఆవాల నూనె మీ శిశువును వెచ్చగా ఉంచుతుంది మరియు  శీతాకాలం కి ఎంతో మంచింది. ఇది ఇంకా బాగా పనిచేయాలంటే ఆబలతో పాటు వెల్లులి ముక్కలు,మెంతులు వంటివి వేసుకోండి.

కొబ్బరి నూనె

ఎండాకాలంలో కొబ్బరి నూనె ఎంతో మంచిది. కొబ్బరి నూనె వేసవి కాలంలో శిశువు కి చల్లదనం ఇవ్వడమే కాకుండా అందులో యాంటీఫంగల్ మరియు యాంటిబ్యాక్ట్రయల్ లక్షణాలు ఉన్నాయి.

నువ్వుల నూనె

నువ్వుల నూనె కూడా శిశువు కి మర్దన చేయడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది.

బాదం నూనె

బాదం నూనె తో మీ శిశువు కి మర్దన చేసినట్లు అయితే అది వారి లేత చర్మానికి పోషణ ఇస్తుంది మరియు అందులో విటమిన్ ఈ కూడా వుండి.

నూనె మర్దన వలన కలిగే ప్రయోజనాలు :

మీరు నమ్మిన నమ్మకపోయినా నూనె మర్దన అనేది తల్లి బిడ్డలా బంధాన్ని ఇంకా మెరుగుపరుస్తుంది మరియు వారిని దగ్గర చేస్తుంది. అంతే కాకుండా దాని వలన ఎన్నో ఆరోగ్యానికి గల ప్రయోజనాలు కూడా వున్నాయి.

1. శిశువుని హాయిగా నిదురపోయేలా చేస్తుంది.

2.ఛాతీ పైన మర్దన చేసినపుడు , శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న పిల్లలకి ఉపశమనం లభిస్తుంది.

3. రక రకాల నూనెల యొక్క ఆంటిసెప్టిక్, యాంటిబ్యాక్ట్రయల్ మరియు యాంటీఫంగల్ వలన వచ్చే దద్దుర్లు మరియు ఇతర చర్మ సమస్యలను నయం చేస్తుంది.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon