Link copied!
Sign in / Sign up
3
Shares

పిల్లలకు కొత్త ఆహారాలు అలవాటు చేయడానికి సులభమైన 6 మార్గాలు


మీ పిల్లలు సాలిడ్ ఫుడ్ తినడం స్టార్ట్ చేసారా? కానీ మీరు తినిపించాలనుకునే ఆరోగ్యకరమైన ఆహారాలు, మీ పిల్లలు మొదట్లో తినడానికి అంత ఇష్టపడరు. ఓపికతో మెల్లగా అలవాటు చేయాలి. పిల్లలకు మీరు ఇచ్చే ఈ కొత్త ఆహారాలు అలవాటు కాకపోతే ఎదుగుదల సమస్యలు వస్తాయి. అందుకే వారికి ఏదో విధంగా ఈ ఆహారాలు తినిపించడానికి ప్రయత్నించండి. మీ ప్రయత్నాన్ని సులువు చేయడానికి, పిల్లలకు కొత్త ఆహారాలు అలవాటు చేయడానికి ఈ 6 మార్గాలు తెలుసుకోండి…

1.డిస్ట్రాక్షన్స్ (distractions) ఉండకూడదు

పిల్లలకు మీరు ఏదైనా కొత్త ఆహారాన్ని తినిపిస్తున్నపుడు వాళ్ళను డిస్ట్రాక్ట్ చేసేది ఏది చుట్టు ఉంచకండి. వాళ్ళు తినే ఆహారం మీద దృష్టి పెట్టేలా చేయండి. ఉదాహరణకు వాళ్లకు ఏదైనా కొత్త ఆహారం తినిపించేటప్పుడు టీవీ పెట్టకండి. పిల్లలు టీవీ చూస్తూ మీరు తినిపించే ఆహారాన్ని నిర్లక్ష్యం చేస్తారు. అందుకే పిల్లలకు తినిపించేటప్పుడు వాళ్ళ దృష్టి మళ్ళించే ఏ విషయాన్ని దగ్గరగా ఉంచకండి.

2.కొంచెం సరదాగా

పిల్లలకు ఏ విషయం లోనైనా కొంచెం సరదా ఆట ఉంటె నచ్చుతుంది. అందుకే పిల్లలకు తినిపించేటప్పుడు అలా ప్రయత్నించండి. ఆహారాన్ని వాళ్ళకి ఇష్టమైన బొమ్మలు లేదా జంతువుల ఆకారంలో చేసి, వాటి గురించి ఏదైనా కథ చెప్తు తినిపించండి. ఇష్టంగా తినేస్తారు.

3.లంచం ఇవ్వండి

పిల్లలకు తినిపించడానికి ఇది అందరూ చేసేదే. పిల్లలకు ఇష్టమైన బొమ్మలను దాచి పెట్టండి...తినిన తరువాత ఇస్తామని చెప్పండి. మీరు తినిపించేది మొత్తం తినేస్తే వాళ్ళకు ఇష్టమైన కార్టూన్ ఛానల్ పెడతామని చెప్పండి. ఇలా వాళ్ళు కొత్త ఆహారం తినేలా చేయచ్చు.

4.ప్లేట్ ను అలంకరించండి

మీరు పిల్లలకు ఏదైనా ఆహారం తయారు చేసిన తరువాత. తినిపించడానికి తీసుకెళ్తున్నపుడు, ఆ ఆహారం వాళ్ళకు కనపడడానికి బావుండేటట్టు అమర్చుకోండి. పిల్లలు చూడ్డానికి ఇష్టపడితే తినడానికి కూడా ఇష్టపడుతారు. పిల్లలకు నచ్చే కలర్ ప్లేట్స్, కప్స్ వాడండి.

5.ఉత్సుకతను(curiosity) కల్పించండి

దీని కోసం మీ భర్త సహాయం కూడా తీసుకోండి. మీ పిల్లలకు తినిపించేటప్పుడు మీ ఆయనను పక్కన ఉంచుకోండి. మీ పిల్లలకు తినిపించేముందు కొంచెం మీ ఆయనకు పెట్టండి. తరువుత మీ ఆయన అది తనకు చాలా నచ్చినట్టు పిల్లలకు అర్ధమయ్యేలా ఏదైనా తమాషాగా చేస్తే. పిల్లలు దాన్ని తినడానికి ఇంట్రస్ట్ చూపిస్తారు.

6.ప్రయోగాలు చేయండి

పిల్లలు మీరు తినిపించాలనుకునే ఆహారాన్ని తినడానికి ఇష్టపడకపోతే. ఆ ఆహారాన్ని వాళ్ళకు నచ్చే ఆహారంలో కలిపి తినిపించండి. ఆ టేస్ట్ వాళ్ళకు నచ్చుతుంది కాబట్టి మీరు పెట్టె ఆహారాన్ని కూడా తింటారు. ఆలా వాళ్ళకు అందాల్సిన పోషకాలు అందుతాయి 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon