Link copied!
Sign in / Sign up
2
Shares

పిల్లలకు ఇంజెక్షన్ అంటే భయం పోగొట్టడానికి 5 ఐడియాలు

చిన్న పిల్లల ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా మనం పిల్లల ఆస్పత్రికి వెళ్లామనుకోండి, అక్కడ చిన్న పిల్లల ఏడుపులు వినిపిస్తాయి.  అనారోగ్యంతో ఉన్న బిడ్డకు డాక్టర్ ఇంజెక్షన్ చేయబోతే ఆ పాప లేదా బాబు వద్దంటూ గింజుకుంటారు. మొరాయిస్తారు. రెండేళ్ల నుంచి పదేళ్ల వరకూ పిల్లల్లో ఇంజెక్షన్ భయం ఉంటుంది. కొందరిలో అది జీవితాంతం ఉంటుంది. పిల్లల్లో ఆ భయాన్ని పోగొట్టడానికి అయిదు ఉపాయాలున్నాయి.

దృష్టి మరల్చాలి

భయపడే పిల్లలకు ఇంజెక్షన్ చేయడం డాక్టర్ కు ఓ పరీక్షే. అయితే ముందే ఇంజెక్షన్ ఇస్తున్నట్టు ఆ పసివాళ్లకు తెలీకుండా జాగ్రత్త పడాలి. కబుర్లు చెబుతూనో, ఏవో ప్రశ్నలు వేస్తూ జవాబు చెప్పమనో వారి దృష్టి మరల్చాలి. అలాగే ఇంజెక్షన్ చేసేటప్పుడు ఏ కార్టూనో, చిన్న మూవీనో వాళ్లకు చూపిస్తే ఇంజెక్షన్ గురించి ఆలోచించరు. అప్పుడు వాళ్లకసలు తెలీకుండా ఇంజెక్షన్ చేయాలి.

చెబితే తెలుసుకుంటారు

అయిదేళ్ల వయసు వచ్చేసరికి పిల్లల్లో కాస్త ఆలోచన వస్తుంది. మనం చెప్పేది తెలుసుకుంటారు. దేనికైనా కారణం చెబితే అర్థం చేసుకుంటారు. వాళ్లు ప్రశాంతంగా, హ్యాపీగా ఉన్న టైంలో – ఇంజెక్షన్ ఎందుకు చేస్తున్నారో వాళ్లకు తెలిసేలా నచ్చ చెప్పాలి. అంతేకానీ భయపెట్టకూడదు. ఒకవేళ ఇంజెక్షన్ తీసుకోకపోతే ఏమవుతుందో చెబితే వాళ్లు వింటారు.

 
పిల్లల దగ్గరే ఉండాలి

ఒకవేళ మీ బిడ్డకు ఇంజెక్షన్ భయం ఉందనుకోండి. సూది చూడగానే భయపడతాడనుకోండి. అప్పుడు తలిదండ్రుల్లో ఎవరోకరు కానీ, బిడ్డకు బాగా చనువున్నవాళ్లు కానీ బిడ్డ దగ్గరే ఉండాలి. అప్పుడు వాళ్ల మనసులో భయం పోతుంది. తనకేదైనా అయితే చూసుకునేందుకు తన వాళ్లున్నారన్న ధైర్యం వస్తుంది.

బాగా ఊపిరి పీల్చుకోవడం

బాగా ఊపిరి పీల్చుకున్నా పిల్లల్లో భయం పోయి రిలాక్స్ అవుతారు. కంగారు, ఆందోళన తగ్గుతాయి. మానసికంగానూ, ఫిజికల్ గానూ ప్రశాంతంగా ఉంటారు. ఒక్కోసారి చిన్నతనంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల కూడా పిల్లల్లో ఇంజెక్షన్ భయం ఉంటుంది. అలాంటప్పుడు పిల్లల్ని సైకాలజిస్టుకు చూపించడం మంచిది.

మత్తు మందివ్వడం

పైన చెప్పిన పద్ధతులేవీ ఫలితాన్నివ్వకపోతే బిడ్డకు ఇంజెక్షన్ ఇచ్చే ముందు అతి స్వల్ప మోతాదులో మత్తు మందు ఇవ్వడం లేదా ఆందోళనను తగ్గించే మందివ్వడం మంచిది. స్పర్శ తెలీకుండా ఉండేందుకు క్రీమ్ రాయడం లేదా మాత్రలు ఇస్తే ఇంజెక్షన్ నొప్పి తెలీదు. ఇబ్బంది అనిపించదు. ఇలా చేస్తే ముందు ముందు పిల్లల్లో ఇంజెక్షన్ భయం తగ్గి, మారాం చేయకుండా ఇంజెక్షన్ చేయించుకుంటారు.


 

 

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon